శనివారం 28 నవంబర్ 2020
Rajanna-siricilla - Oct 03, 2020 , 06:02:23

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు 

కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌

పలు గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణ పనులు పరిశీలన

బోయినపల్లి: గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అధికారులను ఆదేశించారు. కొదురుపాక, విలాసాగర్‌, కోరెం, గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికలను శుక్రవారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. నాణ్యాతా ప్రమాణాలు పాటిస్తూ రైతు వేదికలను మరింత వేగవంతంగా పూర్తి చేయాలన్నా రు. రైతు వేదికల నిర్మాణ పనులపై ప్రత్యేకాధికారులు దృష్టి సారించాలన్నారు. వేదికల పనులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో లైవ్‌ లొకేషన్‌ పెట్టాలని కోరారు. రైతులకు నాణ్యమైన సేవలందించేందుకు ప్రభుత్వం వేదికలు నిర్మిస్తున్నదని తెలిపారు. నిర్మాణాల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఎంపీడీవో నల్లా రాజేందర్‌రెడ్డి, ఏఈ యాదగిరి, నాయకులు ఉన్నారు.

త్వరగా పూర్తి చేయాలి

రుద్రంగి: గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికలను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఎంపీపీ గంగం స్వరుపారాణి పేర్కొన్నారు. మండల కేంద్రంలో నిర్మిస్తున్న వేదికను జడ్పీటీసీ గట్ల మీనయ్యతో కలిసి శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడు తూ, రైతులను సంఘటితం చేసేందుకే ప్రభుత్వం వేదికలు నిర్మిస్తున్నదని తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేదికలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మహ్మద్‌ తఫాజుల్‌ హుస్సేన్‌, ఎంపీడీవో శంక ర్‌, ఎంపీవో సుధాకర్‌, నాయకులు గంగం మహేశ్‌, మాడిశెట్టి ఆనందం, చెప్యాల సంజీవ్‌ పాల్గొన్నారు.