ఆదివారం 12 జూలై 2020
Rajanna-siricilla - Mar 03, 2020 , 01:50:59

ఆలయాల అభివృద్ధికి కృషి

ఆలయాల అభివృద్ధికి కృషి

కోనరావుపేట: ఆలయాల పునరుద్ధరణతో పాటు అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు కొనియాడారు. కోనరావుపేట మండలంలోని బావుసాయిపేటలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో కొనసాగుతున్న విగ్రహ పున:ప్రతిష్ఠా పనోత్సవాలకు జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణతో కలిసి కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే హాజరయ్యారు. వేదపండితులు నంబి వేణుగోపాలాచార్య కౌశిక తన బృందం వారికి పుర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వా మివారికి ప్రత్యేక పూజలను చేయించారు. అనంతరం వారిని ఆశీర్వదించి, తీర్థ, ప్రసాదాలను అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్‌ బైరగోని సత్తయ్య, సర్పంచ్‌ గంగాధర్‌ ఎమ్మెల్యే దంపతులు, జడ్పీ అధ్యక్షురాలు దంపతుల ను శాలువలతో సత్కరించారు. దాతల సహకారంతో ఏ ర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మరిన్ని నిధులు మంజూరు చేస్తాం..

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రమేశ్‌బాబు మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి చెందుతున్నాయని కొనియాడారు. ఆలయాలకు అనేక నిధులను వెచ్చిస్తూ ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చదిద్దుతు న్నారని వివరించారు. అర్చకులకు జీతాలు పెంచారని, ధూపదీప నైవేద్యాలకు నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా కోనరావుపేట మండలంలో మామిడిపల్లి శ్రీ సీతారామస్వామి ఆలయం, నాగారం శ్రీ కోదం డ రామస్వామి ఆలయాలు భవిష్యత్‌ కాలంలో ఆధ్యాత్మిక కేంద్రాలుగా వెలుగొందనున్నాయని తెలిపారు. అదేవిధం గా శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం దాతల సహకారంతో గొప్పగా అభివృద్ధి చెందుతున్నదని, మంచి దైవకార్యాన్ని చేపట్టి ఆరు రోజుల పాటు పున: ప్రతిష్ఠాపన మ హోత్సవాలను నిర్వహిస్తున్న దాతలను అభినందించారు. కార్యకమానికి తనతోపాటుగా తన సతీమణిని ఆహ్వానించడం ఆనందంగా ఉందన్నారు. విశాలమైన ప్రదేశాల్లో ఆ లయాలను నిర్మిస్తే అవి అభివృద్ధి చెందడంతో పాటు, వాటి ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికీ తెలుస్తుందని అభిప్రా యం వ్యక్తం చేశారు. అందుకు దాతలు కృషి చేస్తున్న తీరు అభినందనీయమని కొనియాడారు. రాబోయే రోజుల్లో మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి దేవాదాయశాఖ ద్వారా నిధు లు మంజూరు చేయించి మరింత గొప్పగా ఆలయాన్ని అ భివృద్ధి చేస్తామని, అన్ని వసతులను కల్పించడంతో పాటు సీసీ రోడ్లను నిర్మిస్తామని ఎమ్మల్యే హామీ ఇచ్చారు.  

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు అందజేత

మండలంలోని మరిమడ్ల గ్రామానికి చెందిన సర్పంచ్‌ మాట్ల అశోక్‌కు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద రూ.24వేలు మంజూరుకాగా, సంబంధిత చెక్కును వేములవాడలోని సంగీత నిలయంలో ఆయనకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా రమేశ్‌బాబు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆ రోగ్యశ్రీ ద్వారా పేదలకు వైద్య సేవలను ఉచితంగా అం దించడంతో పాటు సీఎం రిలీఫ్‌ ద్వారా అండగా నిలుస్తు న్నారని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలుచేస్తూ అన్నివర్గాల అభ్యున్న తికి పాటుపడుతున్నారని తెలిపారు. అంతేకాకుండా ప్ర భుత్వ దవాఖాలను అన్నిహంగులతో తీర్చిదిద్దుతూ వ సతులను కల్పిస్తూ కేసీఆర్‌ కిట్టును అందిస్తున్నారని తెలి పారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం మధ్యవర్తులను ఆశ్రయిం చకుండా నేరుగా సంప్రదించాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ చంద్రయ్యగౌడ్‌, వైస్‌ ఎంపీపీ వం గపల్లి సుమలత,  సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మంతెన సంతోష్‌, సర్పంచ్‌ కెంద గంగాధర్‌, ఎంపీటీసీ యాస్మిన్‌ పాషా, సింగిల్‌ విండో చైర్మన్లు బండ నర్సయ్య, రాంమోహన్‌రావు, టీఆర్‌ఎస్‌  మండలాధ్యక్షుడు రాఘవరెడ్డి, ఆల య కమిటీ చైర్మన్‌ సత్తయ్య, ఉపసర్పంచ్‌ చంద్రం, మాజీ సర్పంచ్‌ పద్మ, సర్పంచ్‌లు, దాతలు పాల్గొన్నారు.


logo