e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home కరీంనగర్ విత్తనోత్పత్తికి శ్రీకారం

విత్తనోత్పత్తికి శ్రీకారం

విత్తనోత్పత్తికి శ్రీకారం

సిరిసిల్ల, జూలై 13: అవసరమైన వరి విత్తనాలను ఇక గ్రామం లో రైతులు ఉత్పత్తి చేసుకునేలా వ్యవసాయశాఖ విత్తనోత్పత్తికి శ్రీకారం చుట్టింది. గ్రామాల్లోనే విత్తనాలు తయారు చేసుకొని పంటలు సాగు చేసే విధంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. రైతులు ఆయాసపడకుండా గ్రామాల్లోనే విత్తనాలను పెంచే విధం గా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. రైతులకు ఆర్థిక భారం తగ్గించి మేలైన పంటలు పండించడానికి ఈ విధానం ఉపయోగపడను న్నది. గ్రామీణ ఉత్పనోత్పత్తి పథకంలో భాగంగా వ్యవసాయ శాఖ అధికారులు జిల్లాలో కొన్ని గ్రామాలను ఎంపిక చేసి విత్తనోత్పత్తిని ప్రారంభించారు. గ్రామాల్లో ఎంపిక చేసిన రైతులు విత్తనోత్పత్తి చేసి మరికొందరికి విక్రయించేలా ఈ విధానాన్ని వ్యవసాయ శాఖ అధికారులు రూపొందించారు.
35గ్రామాల ఎంపిక..
విత్తనోత్పత్తికి జిల్లాలో 35 గ్రామాలను వ్యవసాయ శాఖ అధి కారులు గుర్తించారు. ముందుగా 25ఎకరాలను ఒక యూనిట్‌గా గుర్తించి, విత్తనోత్పత్తి గ్రామంగా ఎంపిక చేశారు. వానకాలం (20 21) పంటల సాగుకు గాను 35 గ్రామాల్లో ఆసక్తి ఉన్న 875మంది రైతులను గుర్తించారు. వీరి ద్వారా 875 ఎకరాల్లో వరి పంటను సాగు చేసి విత్తనోత్పత్తి చేసేందుకు జిల్లా వ్యవసాయశాఖ అధికా రులు కృషి చేస్తున్నారు.
మూడు రకాల విత్తనాలు పంపిణీ
ఎంపిక చేసిన 35యూనిట్లలో వ్యవసాయాధికారులు విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. కేఎన్‌ఎం-118 రకం విత్తనాలు 10యూనిట్లు, జేజీఎల్‌-1798 విత్తనాలు 15యూనిట్లు, జేజీఎల్‌-24423 రకం విత్తనాలు పది యూనిట్లు రైతులకు పంపిణీ చేశారు. 35 యూనిట్లలో రైతులు ఈ విత్తనాలను నాట్లు వేశారు. వ్యవసాయ శాఖ అధికారులు ఈ యూనిట్లపై ప్రత్యేక దృష్టిసారించి రైతులకు సూచనలు, సలహాలు అందిస్తున్నారు.
ఇక మేలు రకం విత్తనాలు
ఈ విధానంతో రైతులకు మేలురకం విత్తనాలు అందనున్నాయి. రైతులు ప్రైవేట్‌లో విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోకుండా, ఆర్థిక భారం తగ్గించేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. గ్రామాల్లోనే విత్తనాలను తయారు చేసి ఇతర రైతులకు అందించేవిధంగా ఈ విధానం తోడ్పడుతుంది. ఇప్పటికే ఆయా మండలాల్లో వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
విత్తనోత్పత్తికి శ్రీకారం
విత్తనోత్పత్తికి శ్రీకారం
విత్తనోత్పత్తికి శ్రీకారం

ట్రెండింగ్‌

Advertisement