e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home కరీంనగర్ సర్కారుతోనే నిర్వాసితులకు న్యాయం

సర్కారుతోనే నిర్వాసితులకు న్యాయం

సర్కారుతోనే నిర్వాసితులకు న్యాయం

యువతీ యువకులకు రూ. 61.68 కోట్ల పరిహారం
ఎమ్మెల్యే రమేశ్‌బాబు కృషితోనే రీనోటిఫికేషన్‌
వేములవాడ ఎంపీపీ బూర వజ్రమ్మ,జడ్పీటీసీ మ్యాకల రవి

వేములవాడ, జులై12: మధ్యమానేరు రిజర్వా యర్‌లో ముంపునకు గురైన నిర్వాసితులకు కేసీ ఆర్‌ సర్కారు న్యాయం చేసిందని వేములవాడ ఎంపీపీ బూరవజ్రమ్మ, జడ్పీటీసీ మ్యాకల రవి అ న్నారు. సోమవారం సంగీత నిలయంలో విలేకరులతో మాట్లాడారు. ఐక్యవేదిక పేరిట కొంద రు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. 2016లో కురిసిన వర్షాలకు మధ్య మానే రు జలాశయం కట్ట కొట్టుకుపోగా సీఎం కేసీఆర్‌ ఆ ప్రాంతాన్ని హెలికాప్టర్‌ ద్వారా పరిశీలించారని, కరీంనగర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించి ని ర్వాసితులకు రూ. 5 లక్షల4వేలు ఇస్తానని ప్రకటించారని చెప్పారు. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో ని వాస స్థలాలు కేటాయించారన్నారు. 01-01-2015 నాటికి 18 ఏండ్లు నిండిన యువతీ, యు వకులకు రూ. 2 లక్షల పరిహారాన్ని ప్రకటించి, ఇప్పటి వరకు 1464 మంది యువకులకు రూ. 28.28 కోట్లు, 1670 మంది యువతులకు రూ. రూ. 33.40కోట్లను అందించారని తెలిపారు. మి గిలిన 545 మందికి కూడా పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ హ యాంలో నిర్లక్ష్యానికి గురైన నిర్వాసితుల నివాసాలను ఎమ్మెల్యే రమేశ్‌బాబు రీనోటిఫికేషన్‌ చే యించారని గుర్తు చేశారు. పరిహారం అందని ని వాసాలు, వ్యవసాయ భూములు, ఇంటి స్థలాలు, అసైన్డ్‌ భూములకు కూడా పరిహారం ఇప్పించేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని చెప్పారు. తన కోటా నుంచి నిర్వాసితులకు 300 డబుల్‌ బెడ్రూం ఇండ్లను కేటాయించారన్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని విన్నపం మేరకు రూ. 28 కోట్లతో నాలుగు లైన్ల రహదారిని నిర్మించేందుకు ప్రతిపాదనలు చేశారన్నారు. మధ్యమానేరు నిర్వాసితులకు ఉపాధి కల్పించేందుకు చింతల్‌ఠాణా గ్రామ పరిధిలోని కోర్టు వివాదంలో ఉన్న 19ఎకరాల 11గుంటల భూమిలో వివాదం పరిష్కారం కా గానే ఇండస్ట్రియల్‌ కారిడార్‌గా ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఐఏ వై కింద నివాసాల నిర్మాణానికి కేంద్రం ఇచ్చే పరిహారానికి రాష్ట్ర ప్రభుత్వం పెంచి ఇవ్వాలని ఎమ్మె ల్యే ఇప్పటికే కోరారని చెప్పారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఊరడి ప్రవీణ్‌, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఊరడి రాంరెడ్డి, వైస్‌ ఎం పీపీ ఆర్‌సీరావు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు వనపర్తి దేవరాజు, సర్పంచులు కొండపల్లి రమణారావు, గుర్రం లక్ష్మారెడ్డి, నేతలు రేగులపాటి చరణ్‌రావు, రాములు, వేణు ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సర్కారుతోనే నిర్వాసితులకు న్యాయం
సర్కారుతోనే నిర్వాసితులకు న్యాయం
సర్కారుతోనే నిర్వాసితులకు న్యాయం

ట్రెండింగ్‌

Advertisement