న్యూఢిల్లీ: తెలంగాణ ప్రగతిలో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ రధసారథి సీఎం కేసీఆర్ మరో ప్రస్థానానికి నాంది పలికారు. దేశ రాజధాని ఢిల్లీలో .. తెలంగాణ భవన్ నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయానికి ఇవాళ శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా జరిగిన భూమి పూజలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆయనతో తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రతినిధులు ఆ వేడుకకు హాజరయ్యారు. వేద మంత్రోచ్ఛరణ మధ్య భూమి పూజ నిర్వహించారు. తెలంగాణ భవన్ నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమాన్ని వసంత్ విహార్‌లో చేపట్టారు.
వసంత్ విహార్‌లో వేదోచ్ఛరణ..
ఢిల్లీలోని వసంత్ విహార్ వేదఘోషతో మారుమోగింది. ఆ ప్రాంతంలో ఉన్న సుమారు 1100 చదరపు మీటర్ల ప్రాంగణంలో తెలంగాణ భవన్‌ను నిర్మించనున్నారు. త్రీ ప్లస్ త్రీ రీతిలో భవనాన్ని కట్టనున్నారు. ఇవాళ భూమి పూజ సమయంలో ముందుగా సీఎం కేసీఆర్ హోమంలో పాల్గొన్నారు. వేద వచనాలతో వసంత్ విహార్ వెల్లువిరిసింది. పండితులు మంత్రోచ్ఛరణతో శుభసందేశాలిచ్చారు. మంగళకరమైన దీవెనలతో ఆ ప్రాంగణం దివ్యవెలుగులు చిమ్మింది.
ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా జరిగిన భూమి పూజలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆయనతో పాటు తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆ వేడుకకు హాజరయ్యారు @KTRTRS @VSrinivasGoud @trspartyonline pic.twitter.com/Vqtzc6GMGW
— Namasthe Telangana (@ntdailyonline) September 2, 2021