బుధవారం 24 ఫిబ్రవరి 2021
Peddapalli - Jan 24, 2021 , 04:05:24

రౌడీ రాజకీయాలు మానుకోండి

రౌడీ రాజకీయాలు మానుకోండి

బల్దియా కార్యాలయంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

కోల్‌సిటీ, జనవరి 23: ‘రౌడీ రాజకీయాలు మానుకొని అభివృద్ధికి సహకరించండి.. దళిత వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు ఇన్ని డ్రామాలు ఆడుతున్నారు.. నిధుల కేటాయింపులో ఎమ్మెల్యేకు సంబంధం ఉండదంటున్న వీరి మాటల్లోనే అర్థమౌతుంది.. అరిచి గీ పెట్టినా... అభివృద్ధిని మాత్రం ఆపలేరనేది తెలుసుకోండి.. సోయి తప్పి గౌరవ సభ్యులన్న మాటనే మరిచి ప్రవర్తించడం చాలా బాధకరంగా ఉంది..’ అంటూ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ధ్వజమెత్తారు. బల్దియా కార్యాలయంలో శనివారం మేయర్‌ అనిల్‌కుమార్‌తో కలిసి మాట్లాడారు. రామగుండం కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్లు తనను ఒక దళిత వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు సిని మా ఫక్కీలో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఏనాడూ పట్టించుకోని కాంగ్రెస్‌ కార్పొరేటర్లు ఇలా సమావేశాలను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ నాయకత్వంలో పట్టణాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. రామగుండం కార్పొరేషన్‌కు సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ ఏటేటా నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌ రావు, కార్పొరేటర్లు ధాతు శ్రీనివాస్‌, జెట్టి జ్యోతి, కాల్వ స్వరూప, వేగోళపు రమాదేవి, రాకం లత, కవిత సరోజని, మంచికట్ల దయాకర్‌, రమణారెడ్డి, కుమ్మరి శ్రీనివాస్‌, కృష్ణవేణి, గట్టయ్య, బొడ్డు రజిత, నీల పద్మ, శంకర్‌ నాయక్‌, సాగంటి శంకర్‌, అంజలి దేవి, అమృతమ్మ, కన్నూరి సతీశ్‌, సలీం బేగ్‌, రాజ్‌కుమార్‌, స్వరూప, వేణు, పాతపెల్లి లక్ష్మి, పొన్నం విద్య, మహాలక్ష్మి, కో-ఆప్షన్‌ సభ్యులు తానిపర్తి విజయలక్ష్మి, చెరుకు బుచ్చిరెడ్డి, వంగ శ్రీనివాస్‌, తస్నీం భాను, మహ్మద్‌ రఫీ తదితరులున్నారు. 

వాడీవేడిగా బల్దియా సభ 

రామగుండం నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. సమావేశాన్ని మేయర్‌ అనిల్‌కుమార్‌ ప్రారంభించి నగరంలో చేపడుతున్న, చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు సంబంధించి ఎజెండాను ప్రవేశపెట్టడంతో కాంగ్రెస్‌, బీజేపీ కార్పొరేటర్లు ఎస్‌సీ సబ్‌ ప్లాన్‌ నిధుల విషయంలో వివక్షత ప్రదర్శించారంటూ పోడియాన్ని చుట్టు ముట్టారు. ప్లకార్డులు చేతబూని సభ సాగనీయకుండా అడ్డుకున్నారు. అప్పటికీ మేయర్‌, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తోపాటు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కార్పొరేటర్లు సముదాయించే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు. 23 అంశాల ఎజెండాగా మేయర్‌ అధ్యక్షతన చేపట్టిన సమావేశంలో మెజారిటీ సభ్యులు 22 అంశాలకు ఆమోదం తెలిపారు. కార్యాలయం వెలుపల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ధర్నా చేసేందుకు ఉపక్రమించగా, గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్‌ కార్పొరేటర్లు రాత్రి పది గంటల దాకా బల్దియా కమిషనర్‌ చాంబర్‌లో బైఠాయించారు.

VIDEOS

logo