బుధవారం 25 నవంబర్ 2020
Peddapalli - Oct 25, 2020 , 04:45:09

వైభవంగా శ్రీ దుర్గాష్టమి వేడుకలు

వైభవంగా శ్రీ దుర్గాష్టమి వేడుకలు

మండపాల్లో ప్రత్యేక పూజలు

మంథనిలో శోభాయాత్ర

మంథని టౌన్‌: దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగం గా 8వ రోజైన శనివారం దుర్గాష్టమి వేడుకలను వేద పండితులు, అమ్మవారి దీక్షా పరులు, భక్తులు నిర్వహించారు. పట్టణంలోని శ్రీ మహాలక్ష్మీ, లక్ష్మీనారాయణ ఆలయాలతో పాటు పట్టణంలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన  మండపాల్లో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ మహాలక్ష్మీ ఆలయంలో వేద పండితులు శాస్త్రోక్తంగా గోపాల కలువలను నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంలో అమ్మవారి శోభాయాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలోని వీధుల గుండా నిర్వహించిన శోభాయాత్రలో అమ్మవారి వద్ద మహిళలు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మీ ఆలయం వద్ద, మందాట, లక్ష్మీనారాయణ ఆలయ సమీపంలో, పెంజేరుకట్టల్లో ఉట్టి కొట్టే కార్యక్రమాలను చేపట్టగా, యువతీ యువకులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. గోపాల కలువల వేడుకల్లో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

భక్తులకు అన్నదానం

ధర్మారం: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ధర్మారం మండలం బొట్లవనపర్తిలో యువసేన యూత్‌ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవీ విగ్రహం మండపం వద్ద శనివారం భక్తులకు అన్నదానం చేశారు. గ్రామానికి చెందిన దాతలు క్యాతం పద్మ-నరేశ్‌, క్యాతం హారిక -నరేశ్‌ దంపతులు దుర్గాదేవీ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రామగుండంలో కోలేటి దామోదర్‌ 

జ్యోతినగర్‌:  రామగుండం విద్యుత్‌నగర్‌లో టీఆర్‌ఎస్వీ జిల్లా మాజీ కోఆర్డినేటర్‌ మద్ది అన్వేష్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవీ విగ్రహం వద్ద తెలంగాణ పోలీసు హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌ కోలేటి దామోదర్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ నాయకులు కృష్ణమూర్తి, భరత్‌, రాము, సతీశ్‌, శరణం మధుకర్‌, నిఖిల్‌ సాయి, కోలేటి మహేశ్‌కుమార్‌ ఉన్నారు.  

సుల్తానాబాద్‌రూరల్‌: నల్ల మనోహర్‌రెడ్డి గర్రెపల్లిలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నల్ల మనోహర్‌రెడ్డి అర్చకులు, గ్రామస్తులు సన్మానించారు. అనంతరం గ్రామ యువకులకు క్రికెట్‌, వాలీబాల్‌ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమం లో ఎంపీటీసీ పులి అనూష, మత్స్య సహకార సంఘం జిల్లా డైరెక్టర్‌ కుందేళ్ల శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ ఆసరి రాజయ్య, టీఆర్‌ఎస్‌ యూత్‌ నాయకులు పులి అనిల్‌, శ్రీఅభయాంజనేయ స్వామి యూత్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మండలం పెద్దబొం కూర్‌లోని దుర్గామాత విగ్రహం వద్ద నల్ల మనోహర్‌ రెడ్డి  ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక యువకులకు నాలుగు క్రికెట్‌ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కారుపాకల మానస, ఎంపీటీసీ మిట్టపల్లి వసంత, మాజీ ఎంపీటీసీ కారుపాకల సంపత్‌కుమార్‌ నాయకులు మిట్టపల్లి వెంకటేశం, మిట్టపల్లి శ్రీనివాస్‌, లక్ష్మీరాజం, రాయ మల్లు, చంద్రమౌళి, లచ్చయ్య, అఖిల్‌, రఘు, రాకేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

మండపాల్లో జడ్పీ చైర్మన్‌  పూజలు

కమాన్‌పూర్‌: గుండారం, పేరపల్లిలోని దుర్గామాత మండపాల్లో జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇనగంటి భాస్కర్‌ రావు, నాయకులు రాచకొండ రవి, చంద్రమౌళి, చల్లగొండ సంతోష్‌, బొల్లపెల్లి శంకర్‌గౌడ్‌, గాదె సదయ్య, బోయిని బాలకృష్ణ, పిడుగు అంజి, ఆకుల కుమార్‌, బండి మల్లేశ్‌, తోడేటి రవి, తిరుపతి, ఆకుల గట్టయ్య, దండె కిషన్‌, బోగె తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

దాసరి పూజలు

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మండలం చీకురాయి, భోజన్నపేట గ్రామాల్లో దుర్గామాత విగ్రహాల వద్ద శనివారం ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్‌ గౌడ్‌ యూత్‌ సభ్యులు ఉన్నారు.

పెద్దపల్లి జంక్షన్‌: పెద్దపల్లి తిలక్‌నగర్‌లోని దుర్గామాతను ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్‌, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, నాయకులు ఉన్నారు.

పెద్దపల్లి కల్చరల్‌: శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శనివారం అమ్మవారు దుర్గాదేవీ, మహిశాసుర మర్ధినిగా భక్తులకు దర్శనమివ్వగా, అభిషేకాలు, పూజలు, చండీ యాగం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మడ్ల రామలింగేశ్వరాలయం (శివాలయం), సీతారామాలయం వీధిలో బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, శాంతినగర్‌ కోదండ రామాలయ మండపంలో అమ్మవారిని దుర్గాదేవీగా అలంకరించిన అర్చకులు అష్టోత్తరనామ పుష్పార్చన, కుంకుమార్చనలు పూజలు చేశారు. కోదండ రామాలయం మండపంలో చండీయాగం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెనుగువాడలో ఉదయం పూట అమ్మవారిని దుర్గాదేవీగా అలంకరించగా, సాయంత్రం మహిశాసుర మర్ధినిగా దర్శనమివ్వగా, ఆయుధపూజ చేశారు. అలాగే సుమంగళి పూజ చేసి, మహిళలకు చీరెలను పంపిణీ చేశారు. అనంతరం అమ్మవారికి మహాహారతి సమర్పించారు. ఇక్కడ అర్చకులు మధు శ్రీనివాస శర్మ, ఈశ్వర ప్రసాద్‌ శర్మ, శ్రీనివాస స్వామి, జంబోజు శ్రీనివాస శర్మ, రామారావు, సంతోష్‌ శర్మ, అరుట్ల శ్రీధరాచార్యులు, భక్తులు బూతగడ్డ రాజ్‌కుమార్‌, అలువోజు రవితేజ, గణవేన నవీన్‌, దయ్యాల శ్రీనివాస్‌, బోయపోతుల నవీన్‌, చేని సాయి, రవితేజ ఉన్నారు.