తెలంగాణ రాష్ట్రంలోఎవరినోట విన్నా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డాయన్న చర్చలే. ప్రభుత్వ పథకాలు అందుకున్న లబ్ధిదారులు తమకు ఆసరానిచ్చిన ప్రభుత్వానికే జై కొడుతామంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి నేటి వరకు పేదల పార్టీ అని, ప్రజల సంక్షేమం కోసం పరితపిస్తుందని చెప్తున్నారు. నూటికి నూరుశాతం ఇది వాస్తవం. పుట్టిన పసి బిడ్డ నుంచి పండు ముదుసలి వరకు కులమతాలకతీతంగా అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం.
ఉద్యమ పార్టీగా అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర పాలనను కూడా ఉద్యమంగానే సాగించింది. తెలంగాణకు అత్యంత అవసరమైన తాగునీరు, సాగునీరు, విద్యుత్తును అతి తక్కువ సమయంలోనే సమకూర్చి పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. ఒకవైపు అభివృద్ధి పనులు చేపడుతూనే మరోవైపు సంక్షేమ పథకాలను కూడా అదే రీతిలో అమలు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.
తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం మీద ఆధారపడ్డ రాష్ట్రం. అందుకే కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటగా రైతు, వ్యవసాయాభివృద్ధిపై దృష్టి సారించింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటల పునరుద్ధరణ, మరమ్మత్తులు చేపట్టి అటు వ్యవసాయాన్ని ఇటు మత్స్య సంపద, జలసంపద సృష్టికి మార్గం సుగమం చేసింది. అందులో భాగంగానే దేశంలో ఎక్కడా లేని రైతుబంధు, రైతుబీమా, పంటల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు జరిపి రైతులను ఆదుకున్నది. చివరి గింజ వరకు పంటను ప్రభు త్వం కొనుగోలు జరిపి రైతులు బలపడి ఎదగడానికి ఇతో ధికంగా తోడ్పాటు నందించి, బాధ్య తాయుత ప్రభుత్వం గా గుర్తింపు పొందింది.
దశాబ్దాల నీటి దోపిడికి గురైన తెలంగాణ ప్రజలను వ్యవసాయ పరంగా అభివృద్ధి పరచడానికి, పాలమూరు, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను, కాలువలను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి, భారీ, మధ్య చిన్న తరహా ప్రాజె క్టులను నిర్మించి, లక్షలాది ఎకరాల భూమిని సాగులోనికి తీసుకువచ్చి దండుగ అన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చింది ప్రభుత్వం. మిషన్ కాకతీయ ద్వారా వందలాది చెరువులు నింపి వ్యవసాయానికి ఊతమిచ్చారు కేసీఆర్.
మిషన్ కాకతీయ కింద చెరువులు మరమ్మతు చేసు కోవడం వల్ల ఇవాళ రాష్ట్రంలో చెరువులు నిండు కుండ ల్లా మారి, భూగర్భజలాలు పెరగడమే కాకుండా మత్స్య సంపద కూడా పెరిగింది.తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చడానికి మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నీరు వచ్చే విధానాన్ని చేపట్టి ప్రజల మన్ననలను అందుకున్నది కేసీఆర్ ప్రభుత్వం.
ఎక్కడా లేనివిధంగా రైతులకు ఉచితంగా తాగు, సాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే. రైతాంగానికి 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్తు, ధరణి ద్వారా భూ రికార్డుల కంప్యూటరీకకరించి రైతులకు భూరక్షణ హక్కులు కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది.
సంక్షేమ రంగంలోనూ వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, బోదకాలు బాధితులకు ఇలా అన్ని రంగాల వారికి పింఛన్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. గురుకులాలు, జిల్లాకో మెడికల్ కాలేజీ, బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు, హరితహారం, కంటివెలుగు, ఆసరా పింఛన్లు, దేవాలయాల నిర్మా ణం ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం.
నేడు తెలంగా ణ అభివృద్ధి దేశానికే దిక్సూచి లా నిలిచింది. ఎవరినోట వి న్నా కేసీఆర్ మాటనే. ఆయన చేసిన మంచిపనులే తిరిగి ఆయనను ముఖ్యమంత్రి చేస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు.
మిద్దె సురేష్
9701209355