భారతదేశ పాలన పూర్తిగా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దేశాన్ని పాలించే బీజేపీ నాయకులు పాలనను వ్యాపార సంస్థలకు కట్టబెట్టారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి చేతులు దులుపుకొన్నారు, అధికారాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకొని వచ్చే ఆదాయాన్ని తమ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ ప్రజా మద్దతుతో గెలిచిన ప్రభుత్వాలను కూలదోస్తూ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు. కేంద్రంలోని అధికార బీజేపీ అరాచకాలకు అడ్డుకట్ట పడాలంటే ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దేశంలో అధికారంలోకి రావడం అత్యంత అవసరంగా కనిపిస్తున్నది.
రైతులపైన నల్ల చట్టాలతో దాడి చేసినప్పుడు రైతు సంఘాలు చేసిన ఆందోళనలో ఎంతోమంది రైతులు ప్రాణాలు విడిచారు. ఇది అత్యంత బాధాకరం. అయినప్పటికీ కేంద్రం మాత్రం ఆ కుటుంబాలను పరామర్శించలేదు, ఆదుకోలేదు. అదే సమయంలో ఆ రైతులను, వారి కుటుంబాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం పెద్ద మనసుతో ఆదుకున్నారు, పరామర్శించారు. మానవత్వం కలిగిన నాయకుడి ఆలోచన ఎంత గొప్పగా ఉంటుందో కేసీఆర్ రూపంలో దేశ ప్రజలు చూశారు.
ప్రజల ఓట్లతో గెలిచిన రాష్ట్ర ప్రభుత్వాలను ఏ మాత్రం ప్రజల అభిమానం పొందని బీజేపీ కూలుస్తున్నది. కేంద్రంలో తమకున్న అధికారంతో ప్రభుత్వాలను కూల్చడమే పనిగా పెట్టుకున్నది. కార్పొరేట్ సంస్థలకు లాభం చేయడానికి, ప్రభుత్వ రం గ సంస్థలను వారి చేతుల్లో పెడుతున్నది. తద్వారా ప్రభుత్వరంగ సంస్థల ఆదాయాన్ని దారి మళ్లించి, అక్రమ మార్గంలో వస్తున్న డబ్బులతో ప్రభుత్వాలను కూల్చుతున్నది. దానికోసం ఎంతకైనా దిగజారుతున్నది. ఇది ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం కూడా.
మొన్నటికి మొన్న తెలంగాణలో ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికి జైలు పాలయ్యారు. ఈ కేసులో కేంద్రంలోని ప్రముఖుల పాత్ర ఉన్నదని పకడ్బందీ సాక్ష్యాలతో సహా కోర్టు ముందు పెట్టడం కూడా జరిగింది. అయినా న్యాయస్థానం ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ, నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు బీజేపీ నాయకులు.
బీజేపీ నాయకత్వం పలు రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడంలో విజయం సాధించింది. అదే సమయంలో అక్కడి ప్రజలు తిరగబడితే వారిని అణచివేయడానికి కూడా సిద్ధపడింది. దానికోసం ‘కేంద్ర భద్రత దళాలను కూడా సమకూర్చుతాం’ అన్న ఆడియో సందేశాలను కూడా ప్రజలందరూ విన్నారు. ఐటీ, ఈడీ, సీబీఐ సంస్థలను అడ్డం పెట్టుకొని ఎలాంటి ఫిర్యాదులు, ఆధారాలు లేకు న్నా దాడులు చేపిస్తూ ఎమ్మెల్యేలు, ఎంపీల ను బెదిరిస్తూ దారిలోకి తెచ్చుకుంటున్నది. ఎవరేమనుకున్నా సరే. ప్రజలు మాకు అధికారం కట్టబెట్టకున్నా సరే. ప్రజలను బెదిరిస్తాం, వేరే పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కొంటాం అంటూ యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నది. పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేయాలనే ఎజెండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో లేదు. వారి ఆలోచనంతా కార్పొరేట్ సంస్థలు బాగుపడాలి. తద్వారా బీజేపీ ఆర్థికంగా ప్రభుత్వాలను కూల్చే స్థోమత కలిగి ఉండాలి.
రైతులపైన నల్ల చట్టాలతో దాడి చేసినప్పు డు రైతు సంఘాలు చేసిన ఆందోళనలో ఎంతోమంది రైతులు ప్రాణాలు విడిచారు. ఇది అత్యంత బాధాకరం. అయినప్పటికీ కేం ద్రం మాత్రం ఆ కుటుంబాలను పరామర్శించలేదు, ఆదుకోలేదు. అదే సమయంలో ఆ రైతులను, వారి కుటుంబాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం పెద్ద మనసు తో ఆదుకున్నారు, పరామర్శించారు. మానవత్వం కలిగిన నాయకుడి ఆలోచన ఎంత గొప్పగా ఉంటుందో కేసీఆర్ రూపంలో దేశ ప్రజలు చూశారు. అంతా సునిశితంగా గమనిస్తున్నారు.
రైతులు మరణిస్తే కేసీఆర్ వారి కుటుంబాలను వెతుక్కుంటూ వెళ్లారు. ‘అన్నదాతలు వారి హక్కులు కాపాడుకునే క్రమంలో ప్రాణాలు వదలడం దేశానికి మంచిది కాదు, ఆదుకోవాల్సిన కేంద్రం ప్రాణాలు తీయడం సరికాదు’ అని తేల్చిచెప్పారు. దేశ ప్రజలకు ఆ రోజే కేసీఆర్ గొప్ప మనసు అర్థమైంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంకెంత బాగా పాలిస్తున్నారో అనే ఆలోచన కూడా మొదలైంది. తెలంగాణ పాలనా విధానాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా దేశవ్యాప్తం గా ప్రజల్లో నెలకొన్నది. సీఎం కేసీఆర్ పాలనలో రైతన్నలకు అందుతున్న సహాయం, పేద ఆడబిడ్డల పెండ్లికి చేస్తున్న సహాయం, దళితబంధు, కేసీఆర్ కిట్, అభివృద్ధి చెందిన ఐటీ రంగం, యువకుల జీవితాల్లో వెలుగు నింపిన విధానం, ఇంటింటికీ పరిశుద్ధ నల్లా నీరు, డబుల్ బెడ్రూం ఇండ్లు, సాగు నీరు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్.. ఇలా అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతున్న విధానం దేశ ప్రజలను ఆకట్టుకున్నది. కేసీఆర్ను ఆదరించడానికి, అక్కున చేర్చుకోవడానికి ఇంతకన్నా ఇంకేం కావాలి, ఇప్పుడు దేశం ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి నాయకుడి అవసరం దేశానికి ఉన్నది. కాబ ట్టే యావత్ దేశ ప్రజలు కేసీఆర్ను ముక్తకంఠంతో స్వాగతిస్తున్నారు.
ఇప్పుడు దేశానికి కావలసిందేమిటి? అధికారాన్ని డబ్బులతో కొనే నాయకుడా? లేక ప్రజస్వామ్యాన్ని కాపాడే నాయకుడా? అనే ఆలోచన దేశ ప్రజలందరికీ రావాలి. ఇది అవసరం కూడా. కులాలు, మతాలు దేశాభివృద్ధికి దోహదం చేయవు. చిత్తశుద్ధి కలిగిన నాయకుడి పాలన మాత్రమే దేశానికి మేలు చేస్తుంది. ఆ నాయకుడే కేసీఆర్ అనే నిజాన్ని అందరూ అర్థం చేసుకొని ఆయనకు మద్దతు గా నిలవాల్సిన అవసరం ఉన్నది.
కేంద్రం ఉచితాలు వ్యర్థాలంటూ, పేద ప్రజలకు ఉచితాలు వద్దంటూ కార్పొరేట్ సంస్థలకు మాత్రం లక్షల కోట్ల రుణమాఫీలు చేస్తున్నది. అదే సమయంలో పన్నుల రూపంలో పేద, మధ్య తరగతి ప్రజల దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తున్నది. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ రాక ఎప్పుడైతే ప్రకటించబడిం దో అప్పుడే బీజేపీ నాయకుల్లో అలజడి మొదలైంది. ఏ రాజకీయ పార్టీ అయినా తమ అధికారం పోగొట్టుకోవలసిన పరిస్థితి వస్తే వెంటనే కండ్లు తెరిచి జరిగిన తప్పిదాలను గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపడుతుంది. కానీ బీజేపీకి మాత్రం ఆ ఆలోచన లేదనే చెప్పాలి. ఎందుకంటే కార్పొరేట్ శక్తులు వారి ఎదుగుదలను, వారికి మేలు చేసిన నాయకుల ఎదుగుదలను మాత్రమే చూసుకుంటాయి. ప్రజలతో వారికి సంబంధం ఉండదు. అవసరం కూడా లేదు. అందుకు వారు ఒప్పుకోరు కూడా. కాబట్టి బీజేపీ కూడా పూర్తిగా నిస్సహాయ స్థితిలోకి కూరుకుపోయింది.
భారత దేశ ప్రజలందరూ కేసీఆర్ ప్రధాని కావాలని ఒక నిర్ణయానికి రావాలి. ఒక విజన్ ఉన్న నాయకుడు, పూర్తిగా దేశాన్ని చదివిన నాయకుడు, విషయ పరిజ్ఞానం కలిగిన నాయకుడు కేసీఆర్ ఒక్కరే. ఆయన ఆలోచనా విధానం తెలంగాణలో ప్రవేశపెట్టి, రాష్ట్ర ప్రజల మన్ననలు పొందారు. ఏర్పడిన ఎనిమిదేండ్లలోనే రాష్ర్టాన్ని అభివృద్ధి చేసి దేశంలో అగ్రగామిగా నిలిపిన నాయకుడు కేసీఆర్.
కేసీఆర్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో విజయాలు సాధించారు. అలాంటి నాయకుడి పాలనను మిగతా రాష్ర్టాలు, దేశం అనుసరిస్తున్నది. అందుకే కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పాలన దేశానికి ఎంత అవసరమో గుర్తించాలి. దేశం పగ్గాలు కేసీఆర్ చేతిలో పెట్టి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది.
రవిందర్ రెడ్డి గోగుల
95022 52229