దేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజు(సెప్టెంబర్ 17)ను కాంగ్రెస్ ప్రభుత్వం ‘ప్రజాపాలన దినోత్సవం’గా జరిపింది. పేరులోనే ప్రజాపాలన ఉన్నది కాబట్టి, అద్భుతం, అమోఘం అని చాలామంది కీర్తించారు కూడా. అయితే, మనం ఓ తొమ్మిది నెలలు వెనక్కి వెళ్తే, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రోజులవి. తెలంగాణలో ప్రజాపాలన తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో చెప్పింది. అధికార పీఠం మీద కూర్చోగానే ప్రజాపాలన మొదలుపెడతామని గొప్పగా ప్రచారం చేసింది.
కానీ, రాష్ట్రంలో ఇప్పుడేం జరుగుతున్నది? నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉండదో.. కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజాస్వామ్యం ఉండదని.. కాంగ్రెస్ పాలకులకు ప్రజలు, ప్రజా సంక్షేమం అంటే అస్సలే పట్టవని ఈ తొమ్మిది నెలల్లో తేలిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ పాలన నడుస్తున్నదంటే ప్రజాకంటక పాలన నడుస్తున్నది.
సెప్టెంబర్ 17 నేపథ్యంలో ప్రజాపాలన పేరును కాంగ్రెస్ సర్కార్ మరోసారి తెరమీదికి తెచ్చింది. ప్రజాపాలన అంటే ఏమిటో, ఎలా ఉం టుందో ఈ తొమ్మిది నెలల్లో మనకు అను భవంలోకి వచ్చింది. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, ప్రజా హక్కులను కాల రాస్తూ, ప్రశ్నించినవారిపై దాడులు చేయడమే కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలన. అంతేకాదు, ప్రతిపక్ష నాయకులపై దాడు లు చేయడమనేది ప్రజాపాలనలో ముఖ్యాంశం. ఇది ప్రజా పాలన కాదు, ప్రజాకంటక పాలన.
పంటలకు నీళ్లు రావడం లేదని సోషల్ మీడియాలో పోస్టులుపెట్టిన రైతుల ఇండ్లకు వెళ్లి మరీ నాయకులు దాడులు ప్రజా పాలన. నిండు వానకాలంలోనూ పంటలు ఎండిపోతున్నాయి. వరి పొలాలు నెర్రెలు బారాయి. కాలువల ద్వారా నీళ్లిచ్చి అన్నదాతలను ఆదుకోవాలన్న సోయి పాలకులకు లేదు. దశాబ్దం కిం దట తెలంగాణ ప్రాంతంలో ఎరువులు, విత్తనాల దుకాణాల ముందు కనిపించిన చెప్పుల లైన్లు ఇప్పుడు మళ్లీ తిరిగొచ్చాయి. నాడు పోలీస్స్టేషన్లలో ఎరువులు ఇప్పుడు పోలీసు పహారాలో ఎరువులు, విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. పంట కొద్దిరోజుల ముందే ఠంచన్‌గా అకౌంట్లో పడే రైతుబంధు ఆగిపోయింది. రుణమాఫీ పేరుతో మాటల మాయాజాలం చేశారనే విషయం ఇప్పటికే చాలామంది రైతులకు తెలిసిపోయింది.
అధికారంలోకి రాగానే ప్రజాపాలన పేరుతో దరఖాస్తులను ఆరు గ్యారంటీల అమలు కోసమే ఈ తతంగమని చెప్పారు. కానీ, ఇప్పటి వర కు అవి ఏమయ్యాయో అతీ గతీ లేదు. ఆరు గ్యారంటీలు, 420 హామీలన్నీ అటకెక్కాయి. ‘మేమొస్తే అన్నీ డబుల్’ అని చెప్పుకున్నోళ్లు.. కనీసం పాత పింఛన్లు కూడా సరిగా ఇవ్వలేకపోతున్నారు. అం టే.. ప్రజలను బురిడీ కొట్టించి ఇచ్చిన మాట తప్పడమే ప్రజాపాలన కావొచ్చు అన్న అభిప్రాయం కలుగుతున్నది.
అధికారపీఠంపై ఆసీనులైన రోజే ఉమ్మడి నల్లగొండ జిల్లా చింతపల్లిలో ఓ రైతు లాకప్‌డెత్ జరిగింది. రెండు, మూడు రోజులకే బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు మొదలయ్యాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు మూడు రాజకీయ హత్యలు జరిగినా ఇప్పటికీ నిందితులను పట్టుకోలేకపోయారు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై హత్యాయత్నం జరిగింది. దానికి ముం దు మాజీ మంత్రులు, ప్రస్తుత మీద హత్యాయత్నం జరిగింది. ప్రజా సమస్యలపై సోషల్ మీడియాలో పెడితే చాలు దాడులు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న జర్నలిస్టులపై మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు, లైంగికదాడు లు.. ఇవన్నీ రాష్ట్ర నెల రోజు ల్లో 30కి పైగా హత్యలు జరగడం.. రుణమాఫీ, రైతుభరోసా అడిగితే దాడులు చేయడం.. వరద పరిహారం అడిగిన బాధితులపై లాఠీచార్జీలు.. ఇవన్నీ ప్రజాపాలన పుణ్యమే. మహిళలపై దాడులను ఖండించాల్సిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేచురల్ రియాక్షన్స్ ఉంటాయంటూ దాడుల కు ఉసిగొల్పడం ప్రజాపాలనలో మనం చూసిన మరో అద్భుత ఘట్టం. ఓవైపు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నడుం కట్టి పోరాడుతున్నామని చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ.. మరోవైపు అదే రాజ్యాంగంలోని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే ప్రజా పాలనా?
రాష్ట్రంలో ఏ ఒక్క వ్యవస్థ కూడా సక్రమంగా నడవటం లేదు. తెలంగాణలో శాంతిభద్రతలు పట్టాలు తప్పాయి. అందు కే అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన గురుకుల విద్యాలయాలు నేడు సమస్యలకు నెలవుగా మారాయి. విద్యార్థుల మరణాలు, సిబ్బంది దురుసు ప్రవర్తన, కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు.. వెరసి ఒక నాడు సీటు కోసం లైను కట్టిన తల్లిదండ్రులు ఇప్పుడు ‘మాకొద్దీ గురుకులాలు’ అని పిల్లలను ఇంటికి తీసుకెళ్లే పరిస్థితులు వచ్చాయి. కానీ, ఒకటి మాత్రం నిజం. ఆనాడు హైదరాబాద్ స్టేట్‌గా నిజాం పాలనలో, రజాకార్ల అకృత్యాల మధ్య చవిచూసిన అనుభవాలను ఈ ప్రజాపాలనలోతెలంగాణ ప్రజలు నెమరువేసుకుంటున్నారు. నయా మాదిరిగా రేవంత్‌రెడ్డి తెలంగాణను పాలిస్తున్నారు. నాడు నిజాం పాలకులు ప్రజలపైకి రజాకార్ పార్టీ కార్యకర్తలను, పోలీసులను ప్రశ్నిస్తున్నవాళ్లపైకి ఎగదోస్తున్నారు.
నాటి నిజాం పాలనకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ తొమ్మిది నెలల ప్రజాపాలన సాగిందనే సంబురంతోనే ఏమో సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా జరిపారు. వాస్తవానికి నిజాం పాలన నుంచి బయటకొచ్చి భారతదేశంలో సందర్భంగా విలీన దినోత్సవాన్ని జరుపుకొంటాం. కానీ, ప్రస్తుత సర్కార్ పూర్తిగా నాటి నిజాం పంథాలో, ఒకరకంగా చెప్పాలంటే నిజాం పాలకులకు ప్రతిరూపంగా నిరంకుశ పాలన చేస్తున్నారు కాబట్టి సంబురాలు జరుపుకున్నారు. నాడు నిర్రనీలిగిన నిజాంనే ఈ గడ్డ ప్రజాపాలన పేరుతో నిజాంలా నిరంకుశత్వానికి పాల్పడుతున్న ప్రస్తుత పాలకులు ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది.
(వ్యాసకర్త: కన్వీనర్, బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం)
-వై.సతీష్‌రెడ్డి
96414 66666