కేంద్ర ప్రభుత్వం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి పరాజయం పాలైంది. మూడింట రెండొంతుల మంది సభ్యుల మద్దతు లేకపోవడంతో బిల్లు వీగిపోయింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లోక్‌సభలో ఓటమి ఎరుగని బీజేపీకి, ప్రధాని నరేంద్రమోదీ , హోంమంత్రి అమిత్‌షాకు తాజా పరిణామం అనూహ్యంగా మారింది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడంతో ప్రభుత్వం ప్రతిపాదిత మూడు బిల్లులను వెనక్కి తీసుకున్నది. అయితే, ఎన్డీఏ సర్కార్ నియోజకవర్గాల పునర్విభజన ద్వారా లోక్‌సభ సీట్లను 850కి పెంచాలని ప్రయత్నించి, విఫలమైంది.
రాష్ర్టాల జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరపాలన్న కేంద్రం నిర్ణయం పట్ల దక్షిణాది రాష్ర్టాలు అభ్యంతరాలు వ్యక్తంచేశాయి. జనాభా నియంత్రణలో పురోగతి సాధించిన దక్షిణాది రాష్ర్టాలకు మోదీ ప్రభుత్వం ఎలాంటి రక్షణలు కల్పించలేకపోయింది. కేంద్రం తీసుకొచ్చిన బిల్లుపై విపక్షాలు ఏకతాటిపై నిలిచి తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వానికి ఎదురైన పరాజయం పలు సంకేతాలను ఇస్తున్నది.
1.లోక్‌సభలో ఓటమి-బీజేపీకి దెబ్బ
2014లో కేంద్రంలో 282 సీట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీకి లోక్‌సభలో ఎదురైన తొలి ఓటమి ఇదే. సంఖ్యాపరంగా బీజేపీకి బలం లేని రాజ్యసభలో పలుసార్లు బిల్లులపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 2015 మార్చిలో రాష్ట్రపతి ప్రసంగంపై విపక్షాలు ప్రవేశపెట్టిన సవరణపై ఓటింగ్ జరిగి ఆమోదం పొందింది. కానీ లోక్‌సభలో ఈ స్థాయి ఓటమి ఎదురుకావడం మొదటిసారి. గతంలో పలు బిల్లులను ద్రవ్యబిల్లులుగా చూపి, స్క్రూటినీ నుంచి తప్పించుకున్నది. కానీ ఈసారి అది కూడా కుదరలేదు.
2. కమలం పార్టీ ప్రతిష్ఠకు భంగపాటు
మోదీ ప్రభుత్వం రాజ్యాంగ మౌలిక సూత్రాలను పునర్వ్యవస్థీకరించే ప్రయత్నంలో ప్రజల అభీష్టానికి పార్లమెంట్ మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుందని న్యాయస్థానాల్లో, ఇతర వేదికలపైనా చెప్తూ ఉంటుంది. పార్లమెంటే సర్వోన్నతమైనదని వాదిస్తుంది. రాజ్యాంగ విలువలను సర్వోన్నతమైనవిగా పరిగణనలోకి తీసుకోదు. లోక్‌సభలో సభ్యుల సంఖ్యాబలాన్ని, వరుస విజయాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ సర్కార్ అలాంటి ధోరణిలో మాట్లాడుతూ వస్తున్నది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గినప్పటికీ పాత మంత్రివర్గంతోనే మళ్లీ ప్రమాణ స్వీకారం చేయించింది. దీంతో కార్యనిర్వాహక వ్యవస్థలపై పట్టు సాధించి, అధికార దుర్వినియోగానికి పాల్పడాలని చూసింది. కానీ మోదీ ప్రభుత్వం చాకచక్యంగా పెంచుకున్న ప్రభావాన్ని గత వారం జరిగిన పరిణామాలు దెబ్బతీశాయి.
3. ప్రతిపక్షం ప్రాధాన్యత తెలిసిందా?
మోదీ ప్రభుత్వం ప్రతిపక్షాలను పరిగణనలోకి తీసుకోవడంలేదు. లోక్‌సభలో బీజేపీకి ప్రస్తుతం ఉన్న సీట్లు కేవలం 240 మాత్రమే. కానీ ప్రతిపక్షాలను ‘మ్యానేజ్’ చేయవచ్చులే అని ఆ పార్టీ పెద్దలు భావించారు. వివిధ పార్టీల అధ్యక్షులతో మాట్లాడటం ద్వారా, పార్టీల నేతలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించడం ద్వారా ఓటింగ్ నుంచి గట్టెక్కవచ్చని అనుకున్నారు. ఇదే ఆలోచనతో కనీసం అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించలేదు. కానీ బీజేపీ ఆలోచన పటాపంచలైంది. దీంతో ప్రతిపక్షం పాత్ర, ప్రాధాన్యత ఏంటో, మ్యానేజ్ చేయొచ్చనే భావన ఎంతటి అనాలోచిత ధోరణో బీజేపీకి తెలిసివచ్చింది.
4. నెగ్గని అమిత్ షా ఎత్తుగడలు
మోదీ ప్రభుత్వంలో అమిత్ షా ఎత్తుగడలు తమను గట్టెక్కిస్తాయని కమలం నేతలు అనుకుంటారు. కానీ ఈసారి ఆయన పాచికలు పారలేదు. లోక్‌సభను గందరగోళానికి గురిచేయడం షా నైజం. గతంలో 2019లో ఆగస్టు 5న ఎలాంటి చర్చ లేకుండా, సభకు సమాచారం ఇవ్వకుండా, జాతీయ భద్రత కారణాల చెప్తూ జమ్మూ కశ్మీర్ రాష్ర్టాన్ని విభజించి, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చారు. ఆ సమయంలో అమిత్‌షా ఎత్తుగడలు పనిచేశాయని ఆ పార్టీ నేతలు కితాబు ఇచ్చారు. కానీ తాజాగా డీలిమిటేషన్ బిల్లు వీగిపోయింది. దీంతో షా ఎత్తుగడలు పనిచేయలేదని స్పష్టమవుతున్నది.
5. మోదీ-షా విశ్వసనీయతకు గండి
ప్రధానిగా మోదీ, హోంమంత్రిగా అమిత్ షా విశ్వసనీయత పునర్విభజన బిల్లుతో దెబ్బతిన్నది. రాష్ర్టాల ప్రయోజనాలకు విఘాతం కలిగించబోమంటూ ఇద్దరు నేతలు చెప్పిన మాటలను సభ్యులు ఎవరూ నమ్మలేదు. ఓ దశలో కేంద్రం పెద్దలు బుజ్జగించి సయోధ్య కుదుర్చుకోవడానికి ప్రయత్నించినా ప్రతిపక్షాలు బిల్లును అంగీకరించలేదు. దీంతో పంతం నెగ్గలేదనే ఆక్రోశంతో ప్రధాని బెదిరింపు ధోరణికి దిగారు.
6. వక్రీకరణ ఎల్లప్పుడూ సాధ్యం కాదు
కేంద్ర ప్రభుత్వం తన ఇష్టానుసారం పార్లమెంటరీ విధానాల్లో మార్పులు చేసి, జోక్యం చేసుకొని తప్పించుకోవచ్చనే భావన కలిగి ఉన్నది. కానీ పునర్విభజన బిల్లు వీగిపోవడంతో ఆ నమ్మకం బద్దలైంది. అంతేకాదు, స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా 2019 నుంచి లోక్‌సభకు డిప్యూటీ స్పీకర్ లేరు.
7. సైద్ధాంతిక ఎదురుదెబ్బ
కేంద్రం రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకొని, బీజేపీ రాజకీయ ఆధిపత్యాన్ని విస్తరించేందుకు యత్నించింది. త్వరితగతిన లోక్‌సభ సీట్ల పెంపును పట్టాలెక్కించి, తమ పార్టీకి బహుమతి ఇవ్వాలని భావించింది. సీట్ల పెంపుతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే విషయాలపై చర్చ జరగకుండా చూసింది. మహిళా రిజర్వేషన్లను వేగవంతం చేయాలని అనుకున్నట్టుగా వేసుకున్న ముసుగు సహాయపడలేదు. కొన్ని రాష్ర్టాలకు నష్టం చేకూర్చేలా కేంద్రం యత్నించినట్టుగా తేలిపోయింది. దేశ రాజకీయ వ్యవస్థను బీజేపీ ఏ విధంగా మార్చడానికి ఎత్తుగడలు వేస్తున్నదో అర్థమైపోయింది. హిందీ, హిందూ, హిందుస్థాన్ నినాదంతో బీజేపీ పథకం స్పష్టంగా బయటపడింది. ఎలాంటి చర్చ జరగకుండా, అసంతృప్తులు వ్యక్తం కాకుండా ప్రణాళికను పట్టాలెక్కించాలని కేంద్రం అనుకున్నది. కానీ లోక్‌సభలో కేంద్రం వైఖరి అర్థం చేసుకున్న పార్టీలన్నీ ఏకమై బీజేపీ భవిష్యత్తు రాజకీయ సైద్ధాంతిక ప్రణాళికకు తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలేలా చేశాయి.
8. రగిలిన ప్రాంతీయ భావోద్వేగాలు
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారంలో ప్రాంతీయ, భాషా పరమైన భావోద్వేగాలు కూడా ఇమిడి ఉన్నాయి. మత రాజకీయాలు చేసే బీజేపీ కులాన్ని కలుపుకొనిపోవడానికి ఇబ్బందులు పడుతున్నది. కులమతాలు రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు భాష, ప్రాంతం అనే అంశాలను తెరపైకి తెచ్చినట్టయింది. కొత్త రాష్ర్టాల్లో అధికారం కైవసం చేసుకోవాలని బీజేపీ ఆరాటపడుతున్నది. డీలిమిటేషన్ సందర్భంగా మొదలైన భాష, ప్రాంతీయ చర్చలు భవిష్యత్తులో రాజకీయాలను ప్రభావితం చేయగలవు.
9. చెల్లని బీజేపీ ఆధిపత్యం
పునర్విభజన బిల్లును మహిళా బిల్లుగా చిత్రీకరించి ఆమోదింపజేసుకునేందుకు కేంద్రం ఆరాటపడింది. బీజేపీ మహిళా ముఖ్యమంత్రి, కీలక నేతలను విపక్షనేత రాహుల్ గాంధీ వద్దకు పంపి, మద్దతు కోసం అభ్యర్థించింది. కానీ బిల్లును ఆమోదించుకోలేకపోయింది. బిల్లు వీగిపోయిన తర్వాత జాతినుద్దేశించి మాట్లాడిన మోదీ, కొన్ని సంకేతాలు ఇచ్చారు. కానీ మహిళా బిల్లు 2023లోనే ఆమోదం పొందగా 2024 ఎన్నికల్లో ఎందుకు అమలు చేయలేదు? బీజేపీ మొత్తం ఎంపీల్లో మహిళా ఎంపీల శాతం ఎందుకు తక్కువ ఉన్నది? ఈ ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేపోయారు. ప్రజలు మాత్రం ఈ ప్రశ్నలు సంధిస్తూనే
(‘ది వైర్’ సౌజన్యంతో)