సింగపూర్‌లో చిందేశారు!.. సాత్విక్-చిరాగ్దే సింగపూర్ ఓపెన్ డబుల్స్ టైటిల్
భారత బ్యాడ్మింటన్ ‘డబుల్లెట్స్' సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు. రెండేండ్ల నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు వరల్డ్ టూర్ టైటిల్‌ను గెలచుకున్నారు.
- ఈ ఘనత సాధించిన భారత తొలి జోడీగా రికార్డురెండేండ్ల వరల్డ్ టూర్ టైటిల్ నిరీక్షణకు తెర
సింగపూర్: భారత బ్యాడ్మింటన్ ‘డబుల్లెట్స్’ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు. రెండేండ్ల నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు వరల్డ్ టూర్ టైటిల్‌ను గెలచుకున్నారు. ప్రతిష్టాత్మక సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్ పురుషుల డబుల్స్‌లో తొలిసారి విజేతలుగా నిలిచారు. ఈ ఘనత సాధించిన భారత తొలి జోడీగా సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంక్ జోడీ సాత్విక్-చిరాగ్ 18-21, 21-17, 21-16 తేడాతో మూడో ర్యాంక్ ద్వయం ఫజర్ అల్ఫియాన్-ముహమ్మద్ షోహిబుల్ ఫిక్రి (ఇండోనేషియా)పై అద్భుత విజయం సాధించింది.
గంటా 13 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోయినప్పటికీ, భారత జంట పట్టువిడకుండా పోరాడి టైటిల్ ఎగరేసుకుపోయింది. సాత్విక్-చిరాగ్ జంటకు రెండేండ్లలో ఇదే తొలి వరల్డ్ టూర్ టైటిల్. చివరిగా 2024లో థాయిలాండ్ ఓపెన్ గెలిచిన తర్వాత నాలుగు టోర్నీల్లో ఫైనల్ చేరినప్పటికీ రన్నరప్‌గానే నిలిచింది.ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్స్ అయిన సాత్విక్-చిరాగ్ కెరీర్లో ఇది మూడో సూపర్ 750 టైటిల్ కాగా.. 9వ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ట్రోఫీ కావడం విశేషం.
రెండేండ్ల తర్వాత టైటిల్ గెలవడంతో కాస్త ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక్కడికి వచ్చే ముందు మా గత రికార్డుల వల్ల కొంచెం టెన్షన్ పడ్డాం, కానీ ఈ వారం మాకు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది
– సాత్విక్ సాయిరాజ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

