తెలంగాణ గడ్డ మీద నిలబడి తెలంగాణ నాయకుడి మీద దురహంకారపు ప్రదర్శన. తెలంగాణ నాయకుడు ఎదుగుతుంటే ఓర్చుకోలేనంత అక్కసు. దేశ చిత్రపటంలో ఎక్కడో ఓ మూలకు పడి ఉన్న రాష్ట్రం నుంచి చరిత్రే లేనివాడు ప్రధాని కావచ్చు. దానికి ఆ రాష్ట్రంలో పార్టీలకతీతంగా అందరూ హర్షిస్తారు. ప్రజలూ ఎగబడి ఓట్లు వేసి గెలిపిస్తారు. పారిశ్రామికవేత్తలు నిధులు కుమ్మరించి ఆదుకుంటారు. మావాడు ప్రధాని అని ఆ రాష్ట్రవాసులు దేశమంతా కాలరెగరేసుకొని తిరుగుతారు.
కానీ తెలంగాణలో మాత్రం ఎవరో గుజరాత్ నుంచి వచ్చి ఈ గడ్డమీద నిలబడి తెలంగాణవాడు ప్రధాని కాలేడని ఎద్దేవా చేస్తే.. దానికి కొందరు కట్టుబానిసల్లాగ చప్పట్లు కొడతారు. రాష్ర్టాన్ని సాధించి, సాధించిన రాష్ర్టాన్ని తీర్చిదిద్దినవాడు ప్రధాని స్థాయికి ఎదుగుతుంటే భరించలేనంత అక్కసు.
ఇదే మాదిరిగా గుజరాత్‌కు వెళ్లి అక్కడివాడు ప్రధాని కాడని అంటే గుజరాత్ ప్రజలు హర్షిస్తారా? ఈ బుద్ధి తెలంగాణ నాయకులకు లేకపోయింది. పార్టీలుంటాయి కదా? అంటే గతంలో ఇక్కడే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పీవీ నరసింహారావుకు పార్టీలు, ప్రాంతాలు, కులాలకతీతంగా అంతా ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. అదీ చరిత్ర.
-ఎస్జీవీ శ్రీనివాసరావు
దేశంలో తెలంగాణ ఇపుడు ఒక ట్రెండింగ్. ఎందరెందరికో డెస్టినేషన్ రాజధాని హైదరాబాద్. విమానాశ్రయానికి రోజూ 200 విమానాల్లో సుమారు 60 వేల మంది, రైల్వేస్టేషన్లకు సుమారు 200 రైళ్లలో 1.80 లక్షల మంది, బస్స్టేషన్లకు వచ్చే 4 వేల బస్సుల్లో సుమారు 2 లక్షల మంది వస్తుంటారు. ఇలా ప్రతిరోజూ లక్షల మంది వచ్చేవాళ్లు వస్తుంటారు. పోయేవాళ్లు పోతుంటారు. వచ్చి హైదరాబాద్‌లో తిరిగేవాళ్లు కొందరైతే, రాష్ట్రమంతా పర్యటించేవాళ్లు మరికొందరు. వారిలో రాజధాని అందాలకు మైమరిచిపోయేవాళ్లు, రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ముగ్ధులయ్యేవాళ్లు, గొప్పగా పొగిడేవాళ్ల సంఖ్య చాలా ఎక్కువ. ఇందులో కొందరు కేంద్రమంత్రులు, వివిధ రాష్ర్టాల మంత్రులు, వివిధ రాష్ర్టాల నుంచి వచ్చే అధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వ అధికారులు, వివిధ ఏజెన్సీల అధికారులు, సీడబ్ల్యూసీ చైర్మన్లు, దేశవిదేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలు, రైతు నాయకులు, పర్యావరణవేత్తలు… ఇలా ఈ లిస్టు చాలా పెద్దది. ఊరంతా ఓ దారైతే ఉలిపికట్టెది మరోదారి అన్నట్లు ఇలాంటి వారితో పాటు కేవలం తెలంగాణను తిట్టేందుకు విమానాలేసుకొని వచ్చేవాళ్లు కొందరున్నారు. వారిలో బీజేపీ నాయకులది అగ్రస్థానం. అందులో అమిత్ షా గారు ప్రత్యేకం.
కేసీఆర్ ఒక టాస్క్ తీసుకుంటే ముగిసేదాక వదలడు.
అందుకు నిదర్శనమే మహారాష్ట్రలో జరిగిన మూడో సభ దిగ్విజయం.
అబద్ధాలైనా సరే ప్రచారం చేయండన్నది అమిత్ షా గారి ట్యాగ్‌లైన్. పాపం ఆయన తన ట్యాగ్‌లైన్‌ను ఏ మాత్రం దాటబోరు. వచ్చిన ప్రతిసారి ట్యాగ్‌లైన్‌కు మరింత పదునుపెట్టడం ఆయన ప్రత్యేకత. సరే ఆయన తెలంగాణకు చాలాసార్లు వచ్చారు. మొదట్లో ఇంటింటికీ తిరిగి బీజేపీ స్టిక్కర్లు అతికించేవారు. ఆ తర్వాత దళితుల ఇంట్లో భోజనం అంటూ ఎక్కడో వండిన భోజనాన్ని తెప్పించుకొని దళితుల ఇంట్లో కూర్చొని తినేవారు. అప్పుడెపుడో నేను తెలంగాణలోనే పార్టీ సభ్యత్వం తీసుకుంటా… క్రియాశీల సభ్యత్వమూ అక్కడే అని వాగ్దానాలూ చేశారు. దాన్ని నిలబెట్టుకున్నది లేనిదీ మనకు తెలియదు. ఆయన విజ్ఞానం అమోఘం.
ఆ మధ్య తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు అంటూ ఢిల్లీలో ఓ కార్యక్రమం పెట్టి తెలంగాణ విముక్తి కోసం రాంజీగోండు, కొమురం భీంతో కలిసి అల్లూరి సీతారామరాజు పోరాడారని ప్రవచిస్తే విస్తుపోవడం ప్రజల వంతైంది. ఆయన ప్రసంగాలూ విచిత్రమే. తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చామని ఓసారి అంటే ఆ వెంటనే సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి వాస్తవ అంకెలు చెప్పి నోరు మూయించారు. అయినా సరే ఆయన దారి ఆయనదే. ఆ మధ్య మరోసారి ఢిల్లీలోనే ఆ సంఖ్యను మరింత పెంచి రెండున్నర లక్షల కోట్లు ఇచ్చాం పో అనేశారు. అంతేకాదు తాము అన్ని రాష్ర్టాలను సమాన దృష్టితో చూస్తామని రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నదీ చూడబోమని నొక్కి వక్కాణించారు. నమ్మితీరాలి మనం. ఆయన సృష్టించే వివాదాలకు అంతూ పొంతూ ఉండదు. దేశవ్యాప్తంగా కలవరం సృష్టించిన పౌరసత్వ సవరణ బిల్లు ఆయన మేధో శిశువే. ఎవరు అడ్డం పడ్డా అమలుచేసి తీరుతామని భీషణ ప్రతిజ్ఞలు కూడా చేశారు. అయితే కాలం కలిసిరాక బిల్లును విరమించుకున్నామని ఆయనే ప్రకటించవలసి వచ్చింది. తాజాగా ఇటీవల కర్ణాటక, గోవా మధ్య కూడా వేలు పెట్టారు.
మహాదాయి నదీజలాల సమస్యను పూర్తిగా పరిష్కారించామని కర్ణాటకకు నదీజలాలు సాధించామని ప్రకటించారు. ఇది గోవాలో కల్లోలం రేపింది. అక్కడ బీజేపీ ప్రభుత్వానికే చెందిన మంత్రి ఒకరు అలాంటి ఒప్పదమనేదేదీ లేదని తమ సీఎం ఒప్పుకొనే ముచ్చటే లేదని ప్రకటించారు. కేంద్రం సహకరించకుంటే న్యాయస్థానాల్లో తేల్చుకుంటామన్నారు. షా గారు గప్‌చుప్. ఇంకోసారి వివిధ రాష్ర్టాల ప్రభుత్వాధికారులు ఇంగ్లీషులోనో, స్థానిక భాషల్లోనో కాకుండా హిందీలో మాట్లాడుకోవాలని ప్రకటించారు.
దక్షిణాది రాష్ర్టాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో మళ్లీ తోకముడిచి హిందీ బలవంతపు ఆలోచన లేదని ఈయనే ప్రకటించారు. మహ్మద్ ప్రవక్త విషయంలో బీజేపీ అధికార ప్రతినిధులు చేసిన నీచ వ్యాఖ్యలపై దేశ హోంమంత్రిగా వెంటనే స్పందించకపోవడంతో దేశ ఉప రాష్ట్రపతి విదేశాల్లో అగౌరవాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత నాలిక్కరుచుకొని నూపూర్ గ్యాంగ్‌ను వదిలించుకున్నారు. అమిత్ గారి సామర్థ్యాన్ని టీఎంసీ పార్టీ ఒక్కటే గట్టిగా గుర్తించింది. ఆ పార్టీ నేతలు ఇండియాస్ బిగ్గెస్ట్ పప్పూ అంటూ టీషర్టులు వేసుకొని అమిత్ గారి కారికేచర్‌తో నిరసన తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్‌ను పప్పూ పేరుతో అవమానించిన బీజేపీకి అదే అనుభవంలోకి వచ్చింది. అమిత్ షా గారి పాలనా సామర్థ్యానికి పుల్వామా ఘటన, కశ్మీర్ ఘటనలు అద్దం పట్టాయి. సభల నిర్వహణలో అమిత్ షా గారి నైపుణ్యానికి ముంబైలో ఎండదెబ్బకు 14 మంది దుర్మరణం పాలుకావాల్సి వచ్చింది. లీటరు రూ.850 విలువ చేసే హిమాలయన్ బ్రాండ్ నీరు తాగే అమిత్ షాకు సభికులు కూడా నీళ్లు తాగుతారని తెలియకపోవడం వింత. ఆయన ఒక కేంద్ర మంత్రిగా ఉండి బెంగాల్ పర్యటనకు వెళ్లి ‘పార్లమెంటు ఎన్నికల్లో 35 సీట్లు ఇవ్వండి. మమత ప్రభుత్వాన్ని లేపేస్తాం’ అని ప్రకటించారు. అదీ ఆయన ప్రజాస్వామిక స్ఫూర్తి. అభినవ పటేల్ అనిపించుకోవాలనేది ఆయన ఆరాటం. అయితే ఆఖరికి అబద్ధాల పటేల్ పేరు ఖాయమయ్యేట్లుంది. అమిత్ షా ప్రజాస్వామిక విలువలకు, రాజ్యాంగ రక్షణకు కట్టుబడిన వాడేం కాదు. గుజరాత్ మారణహోమం కేసులో రాష్ట్రం నుంచి బహిష్కరణ శిక్షకు గురైన హోం మినిస్టర్‌గా ఘనత కలిగినవాడు.
సరే అదంతా ఆయన సొంత వ్యవహారం. ఆయన శైలి ఆయన ఇష్టం. కానీ ఇటీవల చేవెళ్ల పర్యటనలో ఆయన వ్యాఖ్యలు మాత్రం తీవ్ర అభ్యంతరకరం. బీజేపీకి అధికార మదం ఎంతగా వంటబట్టిందో ఆయన మాటలతో అర్థం చేసుకోవచ్చు. ఆయన వ్యాఖ్యలు చూడండి.. ‘భయ్యా కేసీఆర్! తెలంగాణలో మీ సర్కారు పనయిపోయింది. ఇక దేశమేమిటి, దేశ రాజకీయాలేమిటి? ప్రధాని కావాలని కలలు కంటున్నావా?’ అంటూ ఇటు పర్యటనలు చేస్తూ ప్రధాని అంటూ మాట్లాడుతున్నావా? కేసీఆర్.. అక్కడేమన్నా ప్రధాని కుర్చీ ఖాళీగా ఉందనుకున్నావా? (నవ్వు) లేదు. 2024లో కూడా మా మోదీ పూర్తి మెజారిటీతో ప్రధాని కాబోతున్నారు. ఇంకా విను.
మోదీ ప్రధాని కావడానికి ముందే తెలంగాణలో బీజేపీ సర్కార్ అనే ట్రైలర్ చూపిస్తాం’ ఇదీ ఆయన ప్రసంగం తీరు. వెటకారపు నవ్వులు. అహంకారపు మాటలు. ఢిల్లీ అధికారమేమైనా బీజేపీ సొంత జాగీరా? ఈ దేశంలో పుట్టిన ఏ నాయకుడైనా ప్రధాని పదవి ఆశించవచ్చు. అందుకోసం రాజకీయం నెరపవచ్చు. దాన్ని అవమానపరచడమేమిటి? తెలంగాణ గడ్డ మీద నిలబడి తెలంగాణ నాయకుడి మీద దురహంకారపు ప్రదర్శన. తెలంగాణ నాయకుడు ఎదుగుతుంటే ఓర్చుకోలేనంత అక్కసు.
దేశ చిత్రపటంలో ఎక్కడో ఓ మూలకు పడి ఉన్న రాష్ట్రం నుంచి చరిత్రే లేని వాడు ప్రధాని కావచ్చు. దానికి ఆ రాష్ట్రంలో పార్టీలకతీతంగా అందరూ హర్షిస్తారు. ప్రజలూ ఎగబడి ఓట్లు వేసి గెలిపిస్తారు. పారిశ్రామికవేత్తలు నిధులు కుమ్మరించి ఆదుకుంటారు. మావాడు ప్రధాని అని ఆ రాష్ట్రవాసులు దేశమంతా కాలరెగరేసుకొని తిరుగుతారు. కానీ తెలంగాణలో మాత్రం ఎవరో గుజరాత్ నుంచి వచ్చి ఈ గడ్డమీద నిలబడి తెలంగాణవాడు ప్రధాని కాలేడని ఎద్దేవా చేస్తే దానికి కొందరు కట్టుబానిసల్లాగ చప్పట్లు కొడతారు. రాష్ర్టాన్ని సాధించి, రాష్ర్టాన్ని తీర్చిదిద్దినవాడు ప్రధాని స్థాయికి ఎదుగుతుంటే భరించలేనంత అక్కసు. ఇదే మాదిరిగా గుజరాత్‌కు వెళ్లి అక్కడివాడు ప్రధాని కాడని అంటే గుజరాత్ ప్రజలు హర్షిస్తారా? ఈ బుద్ధి అమిత్ షా పక్కన కూర్చొని చప్పట్లు కొడుతున్న తెలంగాణ నాయకులకు లేకపోయింది. పార్టీలుంటాయి కదా? అంటే గతంలో ఇక్కడే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పీవీకి పార్టీలు ప్రాంతాలు, కులాలకతీతంగా అంతా ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. అదీ చరిత్ర.
Amisha
ప్రధాని కుర్చీ ఖాళీగా లేదట..
అమిత్ షా తన అహంకారానికి పరాకాష్ఠగా ప్రధాని కుర్చీ ఖాళీగా లేదని తెలంగాణ గడ్డ మీద నిలబడి ఎద్దేవా చేశారు. కానీ అమిత్ షా తెలుసుకోవాల్సిందేమంటే ప్రధాని కుర్చీ ఖాళీగా ఉండదు. అవసరమనుకుంటే ప్రజలే ఖాళీ చేయించి నచ్చినవారికి అప్పగిస్తారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని కుర్చీ ఖాళీగా ఉంటేనే పోటీ పడ్డారా? కాంగ్రెస్ పార్టీకి చెందిన మన్మోహన్ ప్రధానిగా ఉండి ఎన్నికలు వస్తే గెలిచి ఆ కుర్చీలో కూర్చున్నారు. అంతే తప్ప ఆయనేదో ఖాళీ చేస్తే మోదీ వచ్చి కూర్చోలేదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ప్రజలు ఎవరికి అధికారం ఇవ్వాలో నిర్ణయిస్తే ఆ ఆదేశాన్ని శిరసావహించి పార్టీల నాయకులు పదవులు చేపడతారు. ఎప్పుడు ఎవరికి ఏ కుర్చీ ఇవ్వాలో ప్రజలు నిర్ణయిస్తారు. అంతేకాదు.. ప్రజలు ఎవరికీ శాశ్వతంగా ఏ కుర్చీ ఇవ్వరు. ప్రజలు ఐదేండ్ల కోసమే ఆ కుర్చీ ఇస్తారు. ఆ తర్వాత ఎవరైనా ఖాళీ చేయాల్సిందే. ప్రజాదరణలో హిమాలయమంత ఎత్తుకు ఎదిగిన ఇందిరను కూడా ప్రజలు కుర్చీ నుంచి ఖాళీ చేయించారు. గుజరాత్లో పర్వతాలేవీ అందులో పదో వంతు ఎత్తు కూడా ఉండవు. ఆ మాత్రానికే అంత మిడిసిపడితే ఎలా? ఈ వాస్తవాన్ని అమిత్ షా అర్థం చేసుకున్నట్టు లేరు. మోదీకి ప్రజలేదో శాశ్వతంగా ఆ సీటును ఇచ్చినట్టు భ్రమపడుతూ అర్థం పర్థం లేకుండా మాట్లాడారు. మాట్లాడితే కొన్ని గొర్రెలు వంతపాడాయి.
ఆయనకు తెలుసో తెలియదో రాజ్యాంగం ప్రకారం ప్రధాని కుర్చీ ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఒక లోక్‌సభ కాలపరిమితి పూర్తికాగానే ఎన్నికలు నిర్వహించి గెలిచిన పార్టీ తరపున ప్రధానిగా ఎన్నుకునే వరకూ పూర్వ ప్రధానే ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరిస్తాడు. దురదృష్టవశాత్తూ ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి మరణించినా తాత్కాలిక ప్రధానిగా మరొకరిని రాష్ట్రపతి నియమిస్తాడు. అది కూడా తాత్కాలికం అనేది వ్యవహారికమే. కానీ, రాజ్యాంగం ప్రకారం ఆయన పూర్తిస్థాయి ప్రధానే. ప్రధానిగానే విధులు నిర్వహిస్తాడు.
అసలు ప్రధాని కుర్చీ ఎప్పుడూ ఖాళీ ఉండదు. అది అమిత్ షాకు తెలిసినట్టు లేదు. ఫేక్ సర్టిఫికెట్ల పార్టీ నాయకుడి నుంచి ఇంతకు మించిన విజ్ఞానం ఆశించలేం. వీళ్లకు చదువు లేదు, విజ్ఞానం లేదు, రాజ్యాంగం తెలియదు. ప్రజల తీర్పు అంటే తెలియదు. ఎరుగనోడు ఎవుసం చేస్తే ఏదో అయిందన్నట్టు.. ప్రజాస్వామిక విలువలు, హుందాతనం అనేది లేని మూక అధికారపు మెరుపులకు మతి తప్పి ప్రవర్తిస్తున్నది.
రంగీన్ సప్నే…
ప్రధాని పదవి కోసం కేసీఆర్ కలలు కంటున్నాడన్న విమర్శ అలా ఉంచితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని(ప్రచండమైన మెజారిటీతో) ఏ ప్రాతిపదికన అమిత్ షా కలలు కంటున్నా డో తెలువదు. క్షేత్రస్థాయి వాస్తవం చెప్పాలంటే బీజేపీ శ్రేణులే తాము అధికారంలోకి రాగలమని భ్రమపడటం లేదు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో ఎవరి సాయం తీసుకొని గెలిచారో వాళ్లకు బాగా తెలుసు. కాంగ్రెస్ తాను ఆత్మహత్య చేసుకొని తమను గెలిపించిందనీ తెలుసు. అదేరకమైన సాయం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అందుతుందనే భ్రమలేం వారికి లేవు. పైగా సంస్థాగత బలంలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌తో పోలిస్తే తాము ఎక్కడుంటామో కూడా వారికి తెలుసు. రాష్ట్రస్థాయి నాయకులకు ఇంతకన్నా ఎక్కువే తెలుసు. ఇప్పటికీ మూడొంతుల స్థానాలకు కనీసం పోటీ ఇవ్వగల అభ్యర్థులు కూడా లేరనీ తెలుసు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వట్టి ఆవులు తమను గెలిపించడం అటుంచి వాళ్లయినా గెలుస్తారా? అనే ప్రశ్న ఎదురవుతున్నది. ఏడాది క్రితం ఎంతో హడావుడి చేసిన కేంద్ర నాయకత్వం ఆ తర్వాత చల్లబడిందని, కేంద్ర నాయకుల రాకపోకలు తగ్గిపోయిన వైనం చూసి పార్టీ నాయకులు కూడా అంచనాకు వచ్చారు. ఇపుడైనా కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పెట్టడం, కేంద్రం మీద పదునైన విమర్శలు చేయడం వల్లనే కేంద్ర నాయకులు వస్తున్నారని, వారి లక్ష్యం కేసీఆర్‌ను రాష్ర్టానికి పరిమితం చేయడమే తప్ప రాష్ర్టాన్ని గెలువడం కాదని పార్టీ వర్గాలే చెప్తున్నాయి. ఒకటి, రెండు సీట్లు అదీ స్థానిక కారణాల మీద గెలవగానే కొంత ఆశ పెరిగి ఏకంగా చేరిక కమిటీలు పెట్టుకున్నా.. చేరేవారి కోసం ఇప్పటికీ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడటం తప్ప ఊపు, ఉత్సాహం కలిగించే ఏ చేరిక లేదనేది వాస్తవం.
అమిత్ షా గారు అమితోత్సాహానికి పోయి బండిని జైల్లో వేయడాన్ని తప్పుబట్టారు. దీన్ని సమర్థిస్తారా? అన్న ఆయన ప్రశ్నకు సభలో స్పందన కరువైంది. బండి ఏమన్నా స్వతంత్ర పోరాటం చేసి జైలుకెళ్లాడా? లేక ప్రజా సమస్యల మీద అరెస్టయ్యాడా? పేపర్ లీకేజీలో ఏ-1గా వెళ్లాడు. అయినా అది రిమాండే తప్ప జైలు శిక్ష కాదు. కేంద్ర హోంమంత్రికి ఈ సాంకేతిక పదజాలం తెలిసి ఉండాలి. లేకపోతే విద్యావంతులు నవ్వుకుంటారు. పైగా కేసీఆర్‌పై పోరాడి జైలుకు వెళ్లడానికి బీజేపీ భయపడదని కూడా గొప్పలు చెప్పుకొన్నారు.
అంతేకాదు, పేపర్ లీకేజీలతో యువత జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నారని విషం చిమ్మారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్నారు. వాస్తవానికి ఈ యువతకు ఉద్యోగాల కోసమే కేసీఆర్ ప్రభుత్వం భారీ కసరత్తు చేసింది. తెలంగాణ ఏర్పడిన నాడున్న పరిస్థితిలో 25 శాతం స్థానికేతరులకు దక్కేవి. అలా కాకుండా ఉండాలని దానికి ఒక రూట్‌మ్యాప్ తయారు చేసుకున్నది కేసీఆర్ సర్కారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల యువతకు ఉద్యోగావకాశాలు దక్కాలనే కొత్త జిల్లాలు ఏర్పాటుచేసింది. తర్వాత జోన్ల విభజన చేపట్టి రాష్ట్రపతి ఆమోదంతో ఉద్యోగాల భర్తీకి పూనుకుంది. జోన్ల విభజనే జరిగి ఉండకపోతే ఆదిలాబాద్, భూపాలపల్లి వంటి జిల్లాల్లో మూరుమూల గ్రామాల యువతకు ఉద్యోగాలు దక్కేవే కాదు. ప్రతి జిల్లాలో యువతకు ఉద్యోగాలు దక్కాలనే ఉద్యోగుల బదిలీలతో ప్రతి జిల్లాలో వందల ఉద్యోగ ఖాళీలు వచ్చే భారీ కసరత్తు చేసింది. టీఎస్పీఎస్సీ ఏర్పాటుచేసింది. దురదృష్టవశాత్తూ కొందరి కారణంగా పేపర్ లీకేజీ జరిగితే వెంటనే స్పందించింది. మరి బీజేపీ పాలిత రాష్ర్టాల రికార్డు ఏమిటి? బీజేపీ పాలిత రాష్ర్టాల్లో గత పదేండ్లలో 118 సార్లు వివిధ పరీక్షా పత్రాలు లీకయ్యాయి. శాఖాపరమైన చర్యలే తప్ప ఎక్కడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించిన దాఖలా లేదు. కానీ తెలంగాణలో పీఎస్సీ పేపర్ లీక్ విషయం బయటకు రాగానే ప్రభుత్వం వెంటనే సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. రోజుల వ్యవధిలో లీకేజీ కారకులను రిమాండ్‌కు పంపింది. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతూ ఉంది. ఈ సంఘటన దరిమిలా పీఎస్సీ పరీక్షల నిర్వహణపై ఐఏఎస్ అధికారిని నియమించింది. పదో తరగతి పరీక్ష విషయంలో అత్యంత వేగంగా స్పందించి దోషులను పట్టుకున్నది. దర్యాప్తు కొనసాగుతున్నది. కానీ బీజేపీ నేతలే అడ్డగోలు ఆరోపణలు చేసి వివరాలు ఇమ్మంటే ముఖం చాటేశారు.
ఆయన వదిలిన మరో ఆణిముత్యం.. ‘మోదీ అందిస్తున్న సంక్షేమ పథకాలు కిందిదాక చేరడం లేదు. వాటిని కాజేస్తున్నారు. కేసీఆర్ ఏం చేసినా మోదీ నుంచి పేద ప్రజలను వేరు చేయలేరు’. ఇంతకీ మోదీ అందిస్తున్న సంక్షేమ పథకాలు ఏమిటో అవి చేరకుండా కేసీఆర్ ఎలా అడ్డం పడ్డారో ఆయనకే తెలియాలి. కేసీఆర్‌ను కాపీకొట్టి ‘కిసాన్ యోజన’, ‘జల్ జీవన్ మిషన్’ చేపట్టడం తప్ప చేసిందేమిటి? ‘ఉజ్వల్ యోజన’ పేరుతో గ్యాస్ సిలిండర్లు దేశంలో అక్కడక్కడా పంచుతున్నారు. అయితే తెలంగాణ రాకముందే ఇక్కడ ఇంటింటికీ గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరిగింది. పెరిగిన సిలిండర్ ధరల మీద మండిపడేవారు తప్ప పెద్దగా ఆశించేవారు లేరు. ‘ఆయుష్మాన్ భారత్’ మీద గోలగోల చేశారు తప్ప నిధులు మాత్రం ఎప్పటికప్పుడు రావడం లేదు. అంతేకాదు, రాష్ర్టానికి మోదీ రెండున్నర లక్షల కోట్లు ఇచ్చారని, టెక్స్టైల్ పార్క్ ఇచ్చారని చెప్పుకొన్నారు. టెక్స్టైల్ పార్క్ ఎవరు పెట్టారో రాష్ట్రంలో నెక్కరేసుకునే పిల్లాడినడిగినా చెప్తాడు. దాన్ని మోదీ ఖాతాలో వేయడం చూస్తే ఆ మధ్య కేసీఆర్ ‘మంది పిల్లలను…’ అన్న కామెంట్ గుర్తుకు వస్తున్నది.
మరి బీజేపీ పాలిత రాష్ర్టాల రికార్డు ఏమిటి? బీజేపీ పాలిత రాష్ర్టాల్లో గత పదేండ్లలో 118 సార్లు వివిధ పరీక్షా పత్రాలు లీకయ్యాయి. శాఖాపరమైన చర్యలే తప్ప ఎక్కడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించిన దాఖలా లేదు. కానీ తెలంగాణలో పీఎస్సీ పేపర్ లీక్ విషయం బయటకు రాగానే ప్రభుత్వం వెంటనే సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. రోజుల వ్యవధిలో లీకేజీ కారకులను రిమాండ్‌కు పంపింది. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతూ ఉంది. ఈ సంఘటన దరిమిలా పీఎస్సీ పరీక్షల నిర్వహణపై ఐఏఎస్ అధికారిని నియమించింది. పదో తరగతి పరీక్ష విషయంలో అత్యంత వేగంగా స్పందించి దోషులను పట్టుకున్నది. దర్యాప్తు కొనసాగుతున్నది. కానీ బీజేపీ నేతలే అడ్డగోలు ఆరోపణలు చేసి వివరాలు ఇమ్మంటే ముఖం చాటేశారు.
మీ కారు స్టీరింగ్ ఎవరి చేతిలో..
బీజేపీ నాయకులంతా పాడిందే పాటరా అంటూ కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉన్నదంటూ సొల్లు మాటలు మాట్లాడటం అలవాటు చేసుకున్నారు. కానీ ఓవైసీ ఏ ప్రభుత్వ విధానంలో జోక్యం చేసుకున్నాడో ఏ ఒక్కడూ చెప్పడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఈ ప్రభుత్వం గత పదేండ్లలో 200లకు పైగా పథకాలు చేపట్టింది. ఇందులో ఏ ఒక్క పథకమూ ఓవైసీ చెప్పింది కాదు. పాలనా సంస్కరణల కోసం అనేక విధానాలు అమలుచేసింది. అందులోనూ ఏనాడూ ఓవైసీ పేరు వినిపించలేదు. మరోవైపు పెద్ద సంఖ్యలో కార్పొరేషన్ చైర్మన్లను నియమించింది. అధికారులకు వివిధ బాధ్యతలను అప్పగించింది. ఇతర రాష్ర్టాలతో వివిధ విషయాల్లో అవగాహనలు చేసుకుంది. పాలనా సంస్కరణలు తీసుకువచ్చింది. జాతీయ రాజకీయాల్లో అనేక రాజకీయ నిర్ణయాలు తీసుకుంది. కేంద్రప్రభుత్వ విధానాలకు సంబంధించి కొన్ని సమర్థించింది.. కొన్నింటిని వ్యతిరేకించింది. పార్లమెంటులో తనదైన వైఖరి ఎంచుకున్నది.
ఈ మొత్తం ప్రక్రియల్లో ఎక్కడైనా ఓవైసీ పాత్ర ఉన్న దా? ఆసరా పింఛన్లు ఓవైసీ చెప్తే ఇచ్చిందా. ప్రాజెక్టులు ఓవైసీ చెప్తే కట్టిందా? మిషన్ భగీరథలు కాకతీయలు, కంటివెలుగులు, గురుకులాలు, జిల్లాకో మెడికల్ కాలేజీలు, భారీ ఉద్యోగ నియామకాలు.. ఇలా ఏ పథకంలో, ఏ విధానంలో ఓవైసీ పాత్ర ఉన్నదో బీజేపీ ఒక్కటన్నా చూపించగలదా? వాస్తవానికి ఎంఐఎంకు ఏ మాత్రం నచ్చని కశ్మీర్ 370 ఆర్టికల్ తొలగింపు విషయంలో, పీవీకి భారతరత్న డిమాండ్ విషయంలో బీఆర్ఎస్ కేంద్రానికి మద్దతు పలికింది. రాజధాని నగరం లో పాతబస్తీకి, 7 సీట్లకు పరిమితమై తన ఓటు బ్యాంకు తానే కాపాడుకుంటున్న ఎంఐఎం రాష్ట్రవ్యాప్త యం త్రాంగం కలిగి ప్రజల్లో తిరుగులేని మద్దతుతో అంచెలంచలుగా దేశ రాజకీయాల స్థాయికి ఎదిగిన బీఆర్ఎస్ను ఓ జిల్లాకు పరిమితమైన పార్టీ శాసించలేదనే విషయం బుద్ధి, జ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది.
ఆసరా పింఛన్లు ఓవైసీ చెప్తే ఇచ్చిందా. ప్రాజెక్టులు ఓవైసీ చెప్తే కట్టిందా? మిషన్ భగీరథలు కాకతీయలు, కంటివెలుగులు, గురుకులాలు, జిల్లాకో మెడికల్ కాలేజీలు, భారీ ఉద్యోగ నియామకాలు.. ఇలా ఏ పథకంలో, ఏ విధానంలో ఓవైసీ పాత్ర ఉన్నదో బీజేపీ ఒక్కటన్నా చూపించగలదా? వాస్తవానికి ఎంఐఎంకు ఏ మాత్రం నచ్చని కశ్మీర్ 370 ఆర్టికల్ తొలగింపు విషయంలో, పీవీకి భారతరత్న డిమాండ్ విషయంలో బీఆర్ఎస్ కేంద్రానికి మద్దతు పలికింది. రాజధాని నగరంలో పాతబస్తీకి, 7 సీట్లకు పరిమితమై తన ఓటు బ్యాంకు తానే కాపాడుకుంటున్న ఎంఐఎం రాష్ట్రవ్యాప్త యంత్రాంగం కలిగి ప్రజల్లో తిరుగులేని మద్దతుతో అంచెలంచలుగా దేశ రాజకీయాల స్థాయికి ఎదిగిన బీఆర్ఎస్ను ఓ జిల్లాకు పరిమితమైన పార్టీ శాసించలేదనే విషయం బుద్ధి, జ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది.
మీ పార్టీ స్టీరింగ్ ఎవరి చేతిలో..
ఇంతా చెప్పిన అమిత్ షా తమ పార్టీ స్టీరింగ్ ఎవరి చేతిలో ఉందో మరిచినట్టున్నారు. అదానీ కోసం అదానీ చేత నడవబడే అదానీ ప్రభుత్వంగా తమ ప్రభుత్వం గొప్ప పేరును సంపాదించుకున్నదన్న నిజాన్ని గ్రహించినట్టు లేరు. ఎవరు స్టీరింగ్‌ను తిప్పడం వల్ల పారిశ్రామికవేత్తలు దశాబ్దాలుగా తాము నిర్వహిస్తున్న ఎయిర్‌పోర్టులు, షిప్పింగ్యార్డులను అదానీకి ధారాదత్తం చేస్తున్నారు? ఎవరు స్టీరింగ్‌ను నడపడం వల్ల దేశీయ విద్యుత్ కేంద్రాలకు పది శాతం విదేశీ బొగ్గు వాడకం తప్పనిసరి అనే జీవోలు వస్తున్నాయి? ఎవరు స్టీరింగ్‌ను తిప్పితే శ్రీలంక ప్రభుత్వం అదానీ సంస్థతో విద్యుత్ ఒప్పందాలు చేసుకొని ప్రజాగ్రహ జ్వాలల్లో మాడిమసైంది? ఎవరి స్టీరింగ్ వల్ల బంగ్లాదేశ్ అదానీతో విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నది? ఆస్ట్రేలియా బొగ్గు ఒప్పందాలు చేసుకున్నది? ఎవరి స్టీరింగ్ వల్ల ఎఫ్‌సీఐ ఇక నుంచి సీలో గోదాముల్లో మాత్రమే ధాన్యం నిల్వ చేయాలనే ఆదేశం వచ్చింది? ఎవరు స్టీరింగ్ తిప్పడం వల్ల అదానీ అత్యంత వేగంగా ప్రపంచ కుబేరుల జాబితాలోకి భారతదేశం అత్యంత పేదరికంలో వెళ్తున్నది? బీజేపీ స్టీరింగ్ ఎవరి చేతిలో ఉన్నదో, ఎవరికి అనుకూలంగా ప్రతి కేంద్ర ఆదేశం వెలువడుతున్నదో మేధావులు, బుద్ధిజీవులు ఇప్పటికే గమనించారు.
ఈ సభలో అమిత్ షా మరో ఆణిముత్యం వదిలారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ము స్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తుందన్నారు. అంతేకాదుట, ఆ మేరకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచుతారట. చాలా విచిత్రం. ముస్లిం రిజర్వేషన్ల రద్దు సరే. వాటిని ఇతర వర్గాలకు ఎట్లా బదిలీ చేస్తారు? ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం ప్రకారం జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లున్నాయి. పార్లమెంటులో చట్టంతో తప్ప మార్చలేరు. వాస్తవానికి ఎప్పుడో 1961లో నాటి జనాభా ప్రకారం ప్రకటించిన రిజర్వేషన్లవి. అప్పటినుంచి మార్పు లేదు.
జనాభా పెరిగిన దామాషాలో రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్ బలంగా ఉన్నది. ఈ మేరకు కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన దరిమిలా ఆ దామాషాలో పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు మార్చాలని అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపి చాలా కాలమైనా కేంద్రంలోని ఈ బీజేపీ ప్రభుత్వమే పట్టించుకోలేదు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఎట్లా మారుస్తారో అమిత్ షా గారికే తెలియాలి.
కేసీఆర్‌కు ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండే అర్హత లేదని ఆయన ఉవాచ. ఎందుకట. రాష్ట్రంలో భ్రష్టాచార్ ప్రభుత్వం రాజ్యమేలుతున్నదట. అవినీతి గురించి బీజేపీయే చెప్పాలి. కాంగ్రెస్ చేతగానితనం వల్ల బతికిపోయారు గానీ ఒక్క రఫెల్ కుంభకోణమే చాలు బీజేపీ అవినీతి ఆకాశాన్ని తాకిందని చెప్పడానికి. ఇవాళ విదేశీ బొగ్గుకు కేంద్రం సేల్స్‌మేన్‌గా ఎందుకు పనిచేస్తున్నదో దేశంలో ఓవైపు ఉల్లి ధరలు పడిపోయిన స్థితిలో ఉన్నా విదేశాల నుంచి ఎవరి జేబులు నింపడానికి ఎడాపెడా దిగుమతులు జరుగుతున్నాయో అమిత్ షా గారు చెప్పాలి. ఎవరి ప్రయోజనాల కోసం వరిధాన్యం ఎగుమతుల మీద బ్యాన్ పెట్టారో.. ఆహారధాన్యాల సబ్సిడీకి కోత పెట్టి ఎవరి బొక్కసాలు నింపడానికి గ్రీన్ ఎనర్జీకి భారీ బడ్జెట్ కేటాయించారో.. గ్రీన్ ఎనర్జీ మీద రాష్ర్టాలు పన్నులు వేయరాదని జీవోలు ఇచ్చారో విచారణ జరిపితే కుప్పలుతెప్పల కుంభకోణాలు బయటికి వస్తాయి. పదేండ్లలో వ్యాపారులను ప్రపంచ కుబేరులు చేసి దేశాన్ని దివాళా తీయించిన వైనం మీదవిచారణ జరిపితే బీజేపీ నాయకులు వారి వ్యాపార మిత్రులతో తీహార్ జైలు నిండిపోతుంది.
తెలంగాణలో ప్రభుత్వాన్ని ఎందుకు గద్దె దించాలి? ఈ ప్రశ్నకు అమిత్‌షా దగ్గర సమాధానం లేదు.
ఈ దేశం గాంధీని చూసింది. నెహ్రూను చూసింది. గాంధీ పరాయి పాలన నుంచి విముక్తి కోసం దేశాన్ని ఏకం చేసి మడమ తిప్పని పోరాటం చేసి సాధించారు. ఎన్నో విమర్శలు నిందలు నిప్పులు.. అన్నింటినీ ఎదుర్కొని తాను ఎంచుకున్న మార్గంలోనే ముందుకుసాగి దేశానికి స్వాతంత్య్రం సాధించి జాతిపితగా వెలుగొందారు. జవహర్లాల్ నెహ్రూ సాధించిన దేశం కోసం ఒక విజన్ రూపొందించి నవ భారత నిర్మాణానికి పునాదులు వేశారు. ఇటు వ్యవసాయం అటు పరిశ్రమల రంగాన్ని పరుగులెత్తించారు. ఆ పునాదులే దశాబ్దాల పాటు ఈ దేశాభివృద్ధికి ఇంధనంగా పనిచేశాయి. ఇద్దరివీ రెండు మార్గాలు. ఒకటితో ఒకటి సంబంధం లేనివి. ఇద్దరూ తమ తమ మార్గాల్లో అద్వితీయులు. ఈ రెండు మార్గాలను విజయవంతంగా చేసి చూపించిన నేత కేసీఆర్. గాంధీ మార్గంలో అహింసాయుత పోరాటంతో ప్రత్యేక రాష్ట్రం సాధించారు. నెహ్రూ వంటి విజన్‌తో కొత్త రాష్ట్రం ఎలా ఉండాలో రోడ్‌మ్యాప్ వేసుకొని రాష్ట్ర ప్రగతికి వ్యవసాయాన్ని, పరిశ్రమలను పేదరిక నిర్మూలన కోసం సంక్షేమ పథకాలను అమలుచేసి విజయం సాధించారు. ఇవాళ రాష్ట్రమంతా పరుచుకున్న పచ్చని పంట పొలాలు, తీర్చిదిద్దినట్టు తయారైన పల్లెలు, కొత్త అందాలు పులుముకుంటున్న పట్టణాలు, ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న ఆర్థికస్థాయి కేసీఆర్ పాలనా పటిమను చాటిచెప్పాయి. కేంద్రమే ప్రకటించిన అవార్డులు తెలంగాణ గ్రామాల పరిపుష్టి స్థాయిని వెల్లడిస్తాయి.
ఆ మధ్య తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు అంటూ ఢిల్లీలో ఓ కార్యక్రమం పెట్టి తెలంగాణ విముక్తి కోసం అల్లూరి సీతారామరాజు రాంజీగోండు, కొమురం భీంతో కలిసి పోరాడారని ప్రవచిస్తే విస్తుపోవడం ప్రజల వంతైంది. ఆయన ప్రసంగాలూ విచిత్రమే. తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చామని ఓసారి అంటే ఆ వెంటనే సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి వాస్తవ అంకెలు చెప్పి నోరు మూయించారు. అయినా సరే ఆయన దారి ఆయనదే.
ఇవాళ తెలంగాణ ఒక సాఫల్య రాష్ట్రం. దేశానికి ఒక దిక్సూచి. దేశాన్ని తీర్చిదిద్దుకోవడం ఎలాగో తెలిపే ఓ ప్రయోగశాల. దేశానికి కావలిసిందేమిటో అది తెలంగాణలో ఉంది. ఎవరు ఔనన్నా, కాదన్నా భారతదేశం వ్యవసాయిక దేశం. ఈ దేశానికి ఇప్పుడైనా భవిష్యత్తులోనైనా అగ్రగామిగా తీర్చిదిద్దే శక్తి గ్రామీణ భారతానికే ఉన్నది. ప్రపంచం ఆర్థిక కల్లోలాలతో అల్లాడవచ్చు. కరోనా వంటి మహమ్మారితో జీవన్మరణ పోరాటం చేయవచ్చు. సామాజిక ఒడిదుడుకులకు లోనుకావచ్చు. కానీ భారత్ నిబ్బరంగా నిలబడే ఉన్నది. ఉంటుంది. దానికి ఈ గ్రామీణ భారతమే కారణం. ఈ వ్యవసాయ ప్రాధాన్యమే కారణం. అలాంటి వ్యవసాయాన్ని గ్రామాలను గత ఏడు దశాబ్దాలుగా పాలకులు గాలికి వదిలారు. వ్యవసాయాన్ని వరుణ దేవుడి కరుణకు గ్రామాలను రోగాలు, రొష్టులకు ధారాదత్తం చేశారు. ఇప్పటికీ చాలా గ్రామాలకు రహదారుల్లేవు. గ్రామాల్లో మంచినీరు లేదు. వైద్యసౌకర్యాలు కరువు. విద్య అందని ద్రాక్ష. వ్యవసాయం దైవాధీనం. కరువులు, వలసలు కవలపిల్లలు.
రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణా ఇంతే. ఈ బాధలన్నీ చవిచూసిందే. దశాబ్దాల ప్రజా జీవితాన్ని చూసిన కేసీఆర్ ఈ శాపానికి కనుక్కున్న విరుగుడు వ్యవసాయాభివృద్ధి, గ్రామాభివృద్ధి. ఇందుకు వేసుకున్న రోడ్‌మ్యాప్ నీళ్లు. ఆ నీళ్లే ఇపుడు తెలంగాణ రూపురేఖలను మార్చాయి. వ్యవసాయాభివృద్ధికి ఆయన అందించిన మరో చేయూత రైతుబంధు, బీమా ప్రజలకు సంక్షేమ వరాలు. ఇవాళ తెలంగాణలో గ్రామస్వరాజ్యం రైతురాజ్యం కవల పిల్లలుగా మారా యి. అభివృద్ధి విజన్‌లోని అన్ని కోణాలను కేసీఆర్ ప్రభుత్వం సృష్టించింది. అందుకే రాష్ర్టానికి ఈ అవార్డులు. తెలంగాణ విజయం ఇపుడు దేశవ్యాప్తం చేయాలనేది కేసీఆర్ సంకల్పం. ఆ సంకల్పానికి రాజకీయ రూపమే బీఆర్ఎస్, దాని ప్రస్థానం. కొంచెపు ఆలోచనలతో, కుట్రపూరిత ఎత్తుగడలతో దాన్ని భంగపరచడం కల్ల. కేసీఆర్ ఒక టాస్క్ తీసుకుంటే ముగిసేదాక వదలరు. అందుకు నిదర్శనమే మహారాష్ట్రలో జరిగిన మూడో సభ దిగ్విజయం. రాజకీయ సభల్లో ఏం మాట్లాడాలో, ఎంత హుందాగా వ్యవహరించాలో అ మిత్ షా వంటి వాళ్లు నేర్చుకుంటే మంచిది. అంతే తప్ప గుండెల్లో గాలంతా నోట్లోంచి వదులుతూ హుం కారాలు చేసినంత మాత్రాన ప్రజలను ఆకట్టుకోలేరు.
రాష్ట్రం ఇలా ప్రగతిపథంలో దూసుకుపోతుంటే చూ డలేక తెలంగాణకు చెందని ఎవరో వచ్చి ఇక్కడి తెలంగాణ ప్రభుత్వాన్ని, నాయకుడిని దూషిస్తుంటే, అవమానిస్తుంటే తెలంగాణ రక్తం ప్రవహించే ఏ బిడ్డా సహించరు. అలాంటి వారికి, వత్తాసు పలికే వారికి తెలంగాణ ప్రజలే సరైన గుణపాఠం చెప్పాలి.. చెబుతారు.