సుస్థిర ప్రగతికి ఎంతో కీలకమైన ఆవిష్కరణల, అంకుర పరిశ్రమల స్థాపనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో కొనసాగుతున్నది. తెలంగాణ ఐటీ రంగం అప్రతిహతంగా తన ప్రగతి ప్రస్థానం కొనసాగిస్తున్నది. తాజా నివేదిక చూస్తే తెలంగాణ ఐటీ రంగంలో తిరుగులేని ఫలితాలు కనిపిస్తున్నాయి. తొమ్మిదేండ్ల కాలంలో ఐటీ రంగంలో కొత్తగా 5,82,319 ఉద్యోగాలు లభించాయి. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సారథ్యంలో, యువ ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఆకాశమే హద్దు.. అన్న రీతిలో తెలంగాణ ఐటీ రంగం దూసుకుపోతున్నది. ప్రపంచ దేశాలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నాయి.
అంతర్జాతీయ స్థాయిలో స్టార్టప్‌లకు దిక్చూచిగా మారిన టీహబ్‌కు ఎన్నో అవార్డులు, మరెన్నో పురస్కారాలు లభించాయి. ఇందులో బెస్ట్ ఇంక్యుబేటర్ ఇన్ ఇండియా-2022, నేషనల్ టెక్నాలజీ అవార్డుతోపాటు, బెల్జియం, అమెరికా, స్వీడన్, యూకే వంటి ఎన్నో దేశాల ప్రతినిధుల ప్రశంసలను అందుకుని ఇన్నోవేషన్ రంగానికి చిరునామాగా మారింది. దీంతో స్టార్టప్ రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.
స్టార్టప్‌లకు హైదరాబాద్ స్వర్గధామంగా మారింది. ఈ క్రమంలో 2022 -23 సంవత్సరంలో ఐటీ రంగం 31.44 శాతం వృద్ధిని సాధించడం గొప్ప మైలురాయిగా చెప్పుకోవచ్చు. 2016లో 400 స్టార్టప్‌లతో ఉన్న టీ-హబ్ ప్రస్తుతం 2500లకు విస్తరించింది. టీ- హబ్ వేదికగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేసిన 2022-23 ఐటీ వార్షిక నివేదిక చూస్తే తిరుగులేని ప్రగతి కనిపిస్తోంది. కేవలం తొమ్మిదేండ్లలో ఎగుమతులు రూ. 57వేల కోట్ల నుంచి రూ.2.41 కోట్లకు చేరుకోవడం ఓ ఘన త. ఐటీ రంగం తర్వాత రాష్ర్టానికి ఎలక్ట్రానిక్ రం గంలోనూ భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఈ రంగంలో రూ.38 వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు రాగా, వాటి ద్వారా 31వేల ప్రత్యక్ష కొలువులు దక్కడం చెప్పుకోదగిన మరో ఘనత. పదహారేండ్ల హైదరాబాద్ ఐటీ రంగ ప్రస్థానంలో మూడు లక్షల పైచిలుకు ఉద్యోగులు ఉంటే..గడిచిన తొమ్మిదేండ్లలో ఆ సంఖ్య మూడు రెట్లకు పైగా పెరిగింది.
హైదరాబాద్ తరహాలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నది. ఇందులో రాష్ట్రంలోని టైర్-2, టైర్-3 నగరాల్లోనూ ఐటీ రంగా న్ని విస్తరించి స్థానికంగానే ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా ప్రణాళికలను అమలు చేస్తున్నది. దీంతో హైదరాబాద్ దాటి ఐటీ, ఐటీయేతర రంగాలు విస్తరిస్తున్నాయి. వరంగల్, నిజామాబాద్, నల్గొండ, సిద్దిపేట, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రా ల్లో ఐటీ టవర్లు, ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పా టు చేస్తున్నది. ఇప్పటికే ఐదు నగరాల్లో టవర్లు అందుబాటులోకి రావడంతోపాటు మరిన్ని నిర్మాణ దశలో ఉన్నాయి.
వరల్డ్ క్లాస్ ప్రోటో టైపింగ్ ఫెసిలిటీ ఇంక్యుబేటర్ కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం 2017లో ప్రారంభించింది. టీ వర్క్స్ పేరిట ఆలోచనలకు రూపం తీసుకువచ్చేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టగా ఎన్నో మైలురాళ్లను తెలంగాణ ప్రభుత్వం అధిగమించింది. ఇప్పటివరకు 300కు పైగా స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలు టీ వర్క్స్ సేవలను వినియోగించుకోగా, 1000కి పైగా విడి భాగాల నమూనాలను ఆవిష్కరించింది. దీంతోపాటు 30 ఉత్పత్తులను ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అందించి ఫాక్స్‌కాన్, క్వాల్కామ్, వసంత టూల్స్ వంటి కంపెనీలతో కీలక ఒప్పందాలను చేసుకున్నది. అంతరిక్షయానంలో తొలి స్టార్టప్‌గా స్కైరూట్ ఇక్కడి నుంచి మొదలు కాగా ఎయిర్‌బోర్న్ మెడికల్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్టు, పరిశోధనలకు అవసరమైన 3డీ ప్రింటెడ్ నమూనా లు, మెడికల్ డ్రోన్ పేలోడ్, మారుతి డ్రోన్స్, చార్ట్ టెక్నో, మెకానికల్ వెంటిలేటర్ వంటి ప్రొటోటైప్ ఉత్పత్తులను టీ వర్క్స్ అందించింది.
2016లో తీసుకువచ్చిన తెలంగాణ స్టేట్ ఎలక్ట్రానిక్స్ పాలసీ పెట్టుబడులకు గేట్ వేగా మారింది. దీని ద్వారా ఇప్పటివరకు రూ. 50 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఈవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా హైదరాబాద్ ఈ మోటర్ షోను దేశంలోనే తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతిని దక్కించుకోవడం మరో విశేషం.
ఇటీవల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హై ఫాక్స్ కాన్’ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది.
2015లో టీ హబ్ అందుబాటులోకి రాగా, ఏడేండ్లలో మరో దశకు చేరుకుని టీ హబ్ 2.0ను కూడా ఆవిష్కరించింది. స్టార్టప్ రంగానికి బూస్టప్నిస్తూ రూ.8.5 మిలియన్ డాలర్ల నిధులను సమకూర్చుకున్నది. స్టార్టప్‌లకు అండగా నిలు స్తూ వినూత్న కార్యక్రమాలతో ఊతమిస్తున్నది. సుస్థిరమైన స్టార్టప్‌లను నెలకొల్పేందుకు ల్యాబ్ 32 కార్యక్రమాన్ని చేపట్టింది. బిగ్ లీప్ ప్రోగ్రాం, రుబ్రిక్స్ కార్యక్రమాలతో స్టార్టప్‌లకు అవసరమైన ఫండింగ్, మెంటరింగ్, ప్రొడక్ట్ మార్కెటింగ్‌కు అవసరమైన సేవలను అందించి తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.
అంతర్జాతీయ స్థాయిలో స్టార్టప్‌లకు దిక్చూచిగా మారిన టీహబ్‌కు ఎన్నో అవార్డులు, మరె న్నో పురస్కారాలు లభించాయి. ఇందులో బెస్ట్ ఇంక్యుబేటర్ ఇన్ ఇండియా-2022, నేషనల్ టెక్నాలజీ అవార్డుతోపాటు, బెల్జియం, అమెరికా, స్వీడన్, యూకే వంటి ఎన్నో దేశాల ప్రతినిధుల ప్రశంసలను అందుకుని ఇన్నోవేషన్ రంగానికి చిరునామాగా మారింది. దీంతో స్టార్టప్ రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. మహిళా సాధికారి త, ఉమెన్ ఆంత్రప్రెన్యూర్ షిప్‌ను పెంచడ మే లక్ష్యంగా 2017లో తీ సుకువచ్చిన వీ హబ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది. అనతి కాలంలోనే 21 స్టార్టప్ కార్యక్రమాలు, 5288 మ హిళా ఆంత్రప్రెన్యూర్లతో 2823 ఉద్యోగాలను కల్పించే స్థా యికి వీ హబ్ ఎదిగింది.
అదేవిధంగా స్టేట్ ఇన్నోవేషన్ సెల్‌ను ప్రారంభించి విద్యార్థి దశలోనే ఆంత్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దేందుకు తోడ్పడుతున్నది. గ్రామీణ స్థాయిలో యువ పారిశ్రామికవేత్తలు, ఇన్నోవేటర్లను ప్రోత్సహించేలా కార్యక్రమాలు చేపడుతున్నది. ఇంటిం టా ఇన్నోవేటర్, ఇన్నోవేషన్ టు ఆంత్రప్రెన్యూర్ షిప్, సోషల్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ సమిట్, గవర్నమెంట్ సెన్సిటైజేషన్ వర్క్‌షాప్, సోషల్ ఆంత్రప్రెన్యూర్ షిప్ సమిట్తో కృషి చేస్తున్నది. మల్టీమీడియాలో విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకునేలా ఇమేజ్ పాలసీని తీసుకువచ్చిన ప్రభుత్వం దేశంలోనే తొలి మల్టీమీడియా, యానిమేషన్, గేమింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ పాలసీని రూపొందించింది. దీని ద్వారా దేశంలో హైదరాబాద్ నగరాన్ని యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్‌లో హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఎస్టీపీఐతో కలిసి కృషి చేస్తున్నది.
‘ఆలోచనలతో రండి-ఆవిష్కరణలతో వెళ్ళం డి’ అన్న నినాదంతో ఏడేళ్ల క్రితం ఏర్పాటు చేసి న టీ-హబ్ కేవలం ఇంక్యుబేటర్‌గా మాత్రమే కాకుండా ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ఎనేబ్లర్‌గా మారింది. నీతి ఆయోగ్ ప్రకటించిన ఇన్నోవేషన్ పెర్ఫార్మెన్స్ సూచికలో ముందు వరుసకు చేరుకొని అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
నిరంతర శ్రమ.. అనుక్షణం పర్యవేక్షణ.. అంతకుమించి లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పం.. వెరసి.. రాష్ట్ర ఐటీ రంగం అనూహ్య వేగంతో దూసుకుపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక నాయకత్వంలో, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమర్థ పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్రం నేడు మొ త్తం దేశానికే ఐటీ హబ్‌గా, ప్రపంచ స్థాయి సంస్థల గమ్యస్థానంగా, ఆవిష్కరణలకు దిక్సూచిగా మారుతున్నది. డిజిటల్ తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసే దిశగా సాగుతున్నది.
-ముద్దం నరసింహస్వామి
9949839699