వృక్షో రక్షతి రక్షితః అనేది కేవలం ఆచరణలోకి రాని అందమైన సూక్తిగానే మిగిలిపోతున్నది. ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పచ్చదనం హరించుకుపోతున్నది. కాపాడే నాథుడు లేక అశేష జంతుజాలం అవతారం చాలిస్తున్నది. మన దేశంలోనూ పరిస్థితులు మరీ దారుణం గా తయారయ్యాయి. ప్రకృతి పరిరక్షణ సూచీ లో (ఎన్సీఐ) భారత్ అట్టడుగున పడిపోవడ మే ఇందుకు తాజా ఉదాహరణ. వందకు 45.5 స్కోరుతో 180 దేశాల జాబితాలో, 176 వ ర్యాంకు వద్ద చిట్టచివరి ఐదు దేశాల్లో భారత్ ‘అగ్రస్థానంలో’ నిలిచింది. మానవ జీవనానికి అవసరమయ్యే సర్వస్వాన్ని సమకూర్చే ప్రకృతి ని కాపాడే విషయంలో ప్రపంచ దేశాల తీరు తెన్నులను తెలిపే ఈ సూచీని ఈ ఏడాదే ప్రవేశపెట్టారు. నెగేవ్లోని బెన్గురియన్ యూనివర్సిటీ, బయోడీబీ డాట్కామ్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ సూచీని తయారుచేశాయి. తొలి జాబితాలోనే భారత్కు ఇబ్బందికరమైన ర్యాంకు రావడం గమనార్హం. ఇది బాధాకరమే అయినప్పటికీ కాదనలేని వాస్తవం.
జీవవైవిధ్య పరిరక్షణలో, సుస్థిర భూ నిర్వహణలో భారత్ వైఫల్యమే కనిష్ఠ ర్యాంకుకు కారణమని సూచీ రూపకర్తలు అభిప్రాయపడ్డారు. తరిగిపోతున్న తరుసంపదే అందుకు సాక్ష్యం. భారత్లో 53 శాతం భూమిని సహజ స్థితిలో కాపాడకుండా పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, వ్యవసాయాభివృద్ధి వంటి వేరే అవసరాలకు మళ్లించడం జరిగింది. 2001-2019 మధ్యకాలంలో 23,300 చదరపు కిలోమీటర్ల పచ్చని అడవి అంతర్ధానమైపోయింది. 67 శాతం జలచర, 47 శాతం భూచర జాతు ల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతున్నది. 100 స్కేలుపై భారత్ 54 వద్ద ఆగిపోయింది. దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన జాతీయ పార్టీలు దీనికి జవాబు చెప్పాలి. కాంగ్రెస్ హయాంలో మొదలైన అడవుల విధ్వంసం బీజేపీ హయాంలో నిరాఘాటంగా కొనసాగిం ది. ఖనిజాల కోసం వనాలను కార్పొరేట్ కం పెనీలకు ధారాదత్తం చేసే అటవీ సవరణ చట్టాన్ని తెచ్చిన ఘనత కేంద్రంలోని ఎన్డీయే సర్కారుదే. అటవీ ఉత్పత్తుల అక్రమ వ్యాపారంలో ప్రపంచంలో భారత్ నాలుగో స్థానం లో ఉండటాన్ని గమనిస్తే చాలు మన పర్యావరణ పరిరక్షణ ఏ స్థాయిలో ఉన్నదో అర్థమవుతుంది.
ఉన్న అడవులను కాపాడుకోవడం ఒక ఎత్త యితే, అడవిని కొత్తగా సృష్టించడం మరో ఎత్తు. దాదాపు అసాధ్యం లాంటి ఈ అద్భుతా న్ని తెలంగాణలో సుసాధ్యం చేసిన వ్యక్తి కేసీఆర్. ప్రత్యేక రాష్ట్రంలో పచ్చదనం పరిరక్షణకు ఆయన చేపట్టిన చర్యలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. పెదవులపై మాటలు చెప్పకుండా వ్యూహాత్మకంగా, ఆచరణాత్మకంగా ముందుకు సాగడం వల్లే అది సాధ్యమైంది. స్వరాష్ట్ర పగ్గా లు అందుకున్న వెంటనే నానాటికీ తీసికట్టు అవుతున్న అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు ఆయన నడుం బిగించారు. తెలంగాణకు హరితహారం పేరుతో ఆయన చేపట్టిన మొక్కలు నాటే ఉద్యమం ఉధృతంగా సాగింది. 2015 నుంచి 2023 వరకు ఎనిమిది విడతల్లో రూ.10,822 కోట్ల వ్యయంతో 273 కోట్ల మొక్కలను కేసీఆర్ ప్రభుత్వం నాటించింది. అవార్డులు, రివార్డులు పొందిన ఈ అపూర్వ కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో అటవీ పరిమాణం 7.7 శాతం పెరిగిందని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించి ప్రశంసించడం తెలిసిందే. పల్లె వనాలు, పట్టణ వనాలు పెం చడం మరింతగా హరితాన్ని విస్తరింపజేసిం ది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హరితహారం లక్ష్యాలను నీరుగార్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. కేసీఆర్ విధానాలను తిరగదోడటమే లక్ష్యంగా పనిచేయడం ఇందుకు కారణం. రాడార్ నిర్మాణం పేరిట దామగుం డం అడవుల విధ్వంసాన్ని స్వాగతించిన కాం గ్రెస్ ప్రభుత్వం నుంచి ఇంతకన్నా ఎక్కువ ఆశించలేం. ఆ సంగతి అలా ఉంచితే భూతా పం పెరిగి మానవాళి మనుగడకే ముప్పు ఎదురవుతున్న వేళ అత్యధిక జనాభా కలిగిన దేశం గా కాలుష్య దుష్పరిణామాలకు అత్యధికంగా గురయ్యే భారత్ వంటి పెద్ద దేశం బాధ్యతారహితంగా ఉండజాలదు. పరిస్థితి మరింతగా చెయ్యిదాటి పోకముందే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. భూమాతకు జరుగుతున్న అపచారాన్ని అరికట్టేందుకు పచ్చని ఆకు సాక్షిగా ఉద్యమించాలి.