పవన్ ఒక ‘ప్రోబింగ్ డ్రోన్’
ఈ మూడు అంశాల కారణంగా తెలంగాణలో ప్రభావితులు కాగల తెలంగాణవారు గాని, తెలంగాణేతరులు గాని, తెలుగేతరులు గాని ఎవరు కావచ్చు? ఈ అంచనాలను బీజేపీ, టీడీపీ తమకు తాముగానూ వేయగలవు. వారితోపాటు, అందుకు కొంత భిన్నమైన తరగతులలో పవన్ కల్యాణ్ ప్రోబింగ్ కూడా పని చేయగలదన్నది ఆయనను ప్రయోగించిన వారి అంచనా అయి ఉండాలి.
తెలంగాణలో బీజేపీ, టీడీపీ అనుకూల వర్గాలు ఏవో, ఎవరి బలం ఎంతో స్థూలంగా తెలిసిందే. జనసేన గురించి ఇంకా స్పష్టత రావలసి ఉన్నది. వారు లోగడ పోటీ చేసింది ఒంటరిగా అయినందున, ఇప్పటి పరిస్థితుల్లో తిరిగి అంచనాలు అవసరం. ఇప్పటి పరిస్థితులు అంటే ఏమిటి? ఆంధ్రప్రదేశ్‌లోనే కావచ్చు గాని ఆయన ఇప్పుడు అధికారానికి రావటం. తను, టీడీపీ, బీజేపీ కలిసి ఒక కూటమి కావటం. ఆ కూటమి కేంద్రంలో పాలిస్తుండటం.
(నిన్నటి వ్యాసం తరువాయి)
ఈ మూడు అంశాల కారణంగా తెలంగాణలో ప్రభావితులు కాగల తెలంగాణవారు గాని, తెలంగాణేతరులు గాని, తెలుగేతరులు గాని ఎవరు కావచ్చు? ఈ అంచనాలను బీజేపీ, టీడీపీ తమకు తాముగానూ వేయగలవు. వారితోపాటు, అందుకు కొంత భిన్నమైన తరగతులలో పవన్ కల్యాణ్ ప్రోబింగ్ కూడా పని చేయగలదన్నది ఆయనను ప్రయోగించిన వారి అంచనా అయి ఉండాలి. పైగా ఆయన హైదరాబాద్‌కు పరిమితం గాక జిల్లాల్లోనూ పర్యటిస్తానంటున్నారు.
అందువల్ల ఈ ప్రోబింగ్ డ్రోన్ రాగల కాలంలో బీజేపీ, టీడీపీల పనుపున దాడుల డ్రోన్‌గా కూడా మారగల ప్రమాదం పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండటం అవసరం. మొదట చెప్పుకొన్నట్టు తెలంగాణలో ఎందుకూ కొరగాని ఆయన విషయం మాట్లాడటం ఎందుకని ఆశ్చర్యపోతూ విస్మరించటం ఎంతమాత్రం సరికాదు.
ప్రమాదాలను సకాలంలో గుర్తించి చిత్తు చేయక తెలంగాణ ఇప్పటికే అనేక నష్టాలను ఎదుర్కొన్నది. కనుక, చిన్న పామునైనా పెద్ద కట్టెతో కొట్టాలని పెద్దలు చెప్పిన జాగ్రత్తలను గుర్తు చేసుకుంటూ తగు చర్యలు తీసుకోవాలి. లేనట్టయితే చిన్న ఎలుకలు చేసిన రంధ్రంలోంచి పెద్ద ఎలుకలు, వాటి వెనుక పాములు చొరబడగల ప్రమాదం ఉంటుంది. తెలంగాణలో టీడీపీని పునర్నిర్మిస్తామని, పునర్ వైభవం తెస్తామని చంద్రబాబు కొంతకాలంగా అంటూనే ఉన్నారు. తెలంగాణ మీ అయ్య జాగీరా? అని పవన్ సవాల్ చేస్తూనే ఉన్నారు. వారికి ఇక్కడ ఏ విషయంలో ఏ ఇబ్బంది కలిగినా బీజేపీ నాయకులు మద్దతుగా నిలువటాన్ని చూస్తూనే ఉన్నాము. దీనంతటి ఉద్దేశమేమిటో తెలంగాణ ప్రజలకు ఎవరూ వివరించనక్కర లేకుండానే అర్థమవుతున్నది. కనుక ఎందుకూ కొరగాని మనిషి విషయం పట్టించుకోవటం ఎందుకనే అమాయకత్వాన్ని, ఉపేక్షాభావాన్ని, తెలంగాణ ప్రజల స్వభావంలో భాగమైన ఉదారతను వదలుకోవలసిన సమయం వచ్చింది. పైన అనుకున్నట్టు, చిన్న పామునైనా పెద్ద కట్టెతో కొట్టకతప్పదు.
తెలంగాణకు సంబంధించి పవన్ కల్యాణ్ సహా ఎవరి ఏ రాజకీయమైనా సాధారణ రీతిలో చేసుకోవచ్చు. కానీ ఈ నేలను, ప్రజలను, వారి ఆకాంక్షలను కించపరచటమనే దుర్మార్గం వల్ల సమస్య వస్తున్నది. ఇక్కడి ప్రజలు ఎటువంటి పరిస్థితుల కారణంగా తమ సొంత రాష్ర్టాన్ని, స్వపరిపాలనను కోరుకున్నారు? ఆ పరిస్థితులన్నవి ఒక కోణం కాగా, ఈ సువిశాలమైన వైవిధ్య దేశంలో వేర్వేరు ప్రాంతాలు, జాతులకు ఫెడరలిస్టు హక్కులు అవసరమనే గుర్తింపు రాజ్యాంగ నిర్మాతలకు కలగటమన్నది రెండవ కోణం. ఆ మేరకు మొదటి భాషా రాష్ర్టాలు ఏర్పడ్డాయి. మునుముందు మరిన్ని ఏర్పడవచ్చు. ఇవి ప్రపంచ వ్యాప్త పరిణామాలు కూడా.
ఇటువంటి అవగాహనలు గాని, కనీస జ్ఞానం గాని లేని పవన్ కల్యాణ్, రాజ్యాంగంలో పొందుపరిచిన ఫెడరలిజాలు దేశ ఐక్యతకు భంగకరమని, వేర్పాటువాదమని, విచ్ఛిన్నవాదమని, ఉగ్రవాదం కన్నా ప్రమాదకరమని ప్రేలాపనలు చేస్తున్నారు. విచిత్రమేమంటే స్వయంగా తన పార్టీ, తాను అధికారం కోసం చేతులు కలిపిన టీడీపీ కూడా ప్రాంతీయ పార్టీలే. వారిద్దరి అసలు బాధ తెలంగాణ తమ దోపిడీ హస్తాలలో ఎల్లకాలం చిక్కుకుపోకుండా విముక్తి చెందిందన్నదే. ఇప్పుడు తనను తాను పాలించుకుంటూ తన భవిష్యత్తును తాను స్వతంత్రంగా తీర్చిదిద్దుకుంటున్నదనేదే. అటువంటి తెలంగాణను తిరిగి తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ప్రధానంగా బీజేపీ, చంద్రబాబు ఎత్తుగడలు వేస్తుండగా, పవన్ కల్యాణ్ ఏవో చిల్లర లాభాల కోసం వారికి ఏజెంటుగా ముందుకు వస్తున్నారు. అది గ్రహించి ఒక విషపు మొక్కను మొగ్గలోనే తుంచివేయక తప్పదని తెలంగాణ ప్రజలు గుర్తించాలి.
-టంకశాల అశోక్
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

