పోరాటాల గడ్డ మన వరంగల్ ఖిల్లా. తెలంగాణ ఉద్యమ నాదాన్ని శిరస్సుపై మోసి భారతదేశానికి ప్రత్యేక రాష్ట్ర వాంఛను పరిచయం చేసింది మన వరంగల్ జిల్లానే. కాకతీయ రాజులు, సమ్మక్క-సారక్కలు అందించిన వారసత్వంతో… దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ పౌరుషత్వంతో పిడికిలి బిగించి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ర్టాన్ని తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషించిన వరంగల్ జిల్లా ప్రజానీకానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. నిన్న వరంగల్ జిల్లాకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి మెప్పు పొందేందుకు గాను వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరించిన వరంగల్ ఎంపీ కడియం కావ్య వ్యాఖ్యలకు మనందరం సమాధానం చెప్పకపోతే అన్యాయమే రాజ్యమేలుతుంది.
నిజాలను, అబద్ధాలుగా మలచాలని చూసినా, అబద్ధాలను నిజాలుగా చేయాలనే ప్రయత్నం చేసినా చరిత్ర ఒప్పుకోదు గాక ఒప్పుకోదు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వైద్య రంగానికి సరితూగేలా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు నిర్మించడమే కాకుండా వరంగల్ నడిబొడ్డున కార్పొరేట్‌ను తలదన్నేలా 24 అంతస్థులతో బహుళ ప్రజా దవాఖాన నిర్మాణం చేపట్టిన ఘనత బీఆర్ఎస్ది. శతాబ్ద కాలంలో జరగని అభివృద్ధిని, బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ద కాలంలోనే చేసి చూపెట్టి మాది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని నిరూపించింది. మీ తండ్రి అయిన కడియం శ్రీహరి నాటి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేసిన వ్యాఖ్యలను ఒకసారి గుర్తుచేసుకో.
ప్రజాకవి కాళోజీ నారాయణరావు ధిక్కార స్వర నినాదంతోటే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ప్రజల ఐక్యతతో అందిపుచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం మరింత ప్రజ్వరిల్లాలని మన వరంగల్ ప్రత్యేక భూమిక పోషించింది. అందులో భాగంగానే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రణాళికలతో త్రినగరాన్ని సుందరీకరించుకున్నాం. ఎన్నో అంతర్జాతీయ పరిశ్రమలను వరంగల్ జిల్లాకు తీసుకువచ్చి, వరంగల్ ఖ్యాతిని ఖండాంతరాలకు పరిచయం చేసిన నేత కేసీఆర్. కానీ, కొందరు మిడిమిడి జ్ఞానంతో వాస్తవాలను, అవాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, చరిత్ర చెరిగిపోదు కదా? కాకతీయ రాజుల చరిత్రను తిరగరాసేలా.. ముందు తరాలకు భవిష్యత్తు రహదారిని పరిచేందుకు గాను కేసీఆర్ ‘మిషన్ కాకతీయ’ పేరుతో ప్రతి నీటి బిందువును ఒడిసిపట్టి రేగుముళ్లతో ఉన్న పొలాలను పచ్చని మాగాణిగా మలిచారు. నాడు ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ నారాయణరావు ను అణచివేయాలని, రాజకీయంగా ఎదగనీయకుండా చేయాలని శతవిధాలుగా ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీ నేడు నీతులు మాట్లాడుతుండటం నీచమైన రాజకీయ చర్యగా భావిస్తున్నా. కాళోజీ నామస్మరణ చేసే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం లేదు. నాడు వ్యతిరేకించిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు భజనలు చేయడం చూస్తుంటే ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్టుగా ఉన్నది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం కాళో జీ నారాయణరావుకు ప్రత్యేక గుర్తింపు ఉండాలని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ నేతృత్వంలోని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగ ల్ జిల్లా ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. ఆ సమావేశంలో కాళోజీ కళాక్షేత్ర నిర్మాణానికి పూనుకోవాలని తీర్మానం చేశారు. అనుకున్నదే తడవుగా ప్రత్యేక జీవో ద్వారా నిధులను విడుదల చేసి నిర్మాణ పనుల ను వేగవంతం చేశారు. ఈ క్రమంలో కరోనా మహమ్మారి కారణంగా నిర్మాణ పనులు కొం చెం ఆలస్యమయ్యాయి. కానీ, కాంగ్రెస్ ప్రభు త్వం ఇప్పుడు చంకలు గుద్దుతూ మేమేదో చేశామన్నట్టు ఊకదంపుడు రాతలతో నిజాలను అబద్ధాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నది. చెరిపేస్తే చరిత్ర చెరిగిపోతుందా? నిజానిజాలేమిటో ప్రజలకూ తెలుసు.
రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నట్టయితే వెలుగులు విరజిమ్మేలా.. కండ్లు మైమరిచేలా దశాబ్ద కాలంలో జరిగిన అభివృద్ధే తప్ప.. రాష్ట్రంలో గత ఏడాది కాలం గా జరిగిన అభివృద్ధి శూన్యం అనేది నూటికి నూరుపాళ్లు నిజం. నాటి ప్రభుత్వ ప్రగతి చక్రాలతో వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్య, వైద్యం, పర్యాటకం, సాంస్కృతిక, ఉపాధి అన్నిరంగా ల్లో కేసీఆర్ తనదైన ప్రత్యేక చొరవను చూపించారు. ఒక్క వరంగల్ జిల్లానే కాదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి పథంలో దూసుకుపోయిం ది. కానీ, నేడు రాష్ట్రంలో చీకట్లు అలుముకున్నాయి. దశాబ్ద కాలపు అభివృద్ధిపై కారుమబ్బులు కమ్ముకున్నాయి. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చా క పచ్చగా ఉన్న ప్రాంతం ఒక్కసారిగా తీరు మారింది. ఇది నేనొక్కదాన్నే చెప్తున్న వాస్తవం కాదు, రాష్ట్ర పరిస్థితిని చూసిన ప్రజలందరూ ముక్తకంఠంతో ఘోషిస్తున్నది.
రాష్ర్టానికి రెండో రాజధానిగా వరంగల్ జిల్లాకు ప్రాణం పోసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. హైదరాబాద్ అభివృద్ధికి ఏ మాత్రం తీసిపోకుండా వరంగల్‌కు అంతే ప్రాధాన్యం కల్పించింది తెలంగాణ తొలి ప్రభుత్వం. అభివృద్ధికి చిరునామాగా మారుస్తూ జాతీయ కంపెనీ మెగా టెక్స్టైల్ పార్కును సైతం తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా కల్పించిన ఘనత నాటి కేసీఆర్ ప్రభుత్వానిది.
అభివృద్ధి పథాన దూసుకువెళ్తున్న తెలంగాణను అణగదొక్కాలని నేటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాడు ఆంధ్రా తొత్తులతో కలిసి కుట్రలు చేసిన విషయం తెలంగాణలోని ప్రతీ పౌరునికి తెలుసు. ఆ కుట్రలను ఛేదించి శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రత్యేక ఖ్యాతిని గడించి యావత్ ప్రపంచాన్ని మనవైపు తిప్పుకునేలా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. నిరంత రం అభివృద్ధి మంత్రంతో, సంక్షేమ పథకాల తో, ప్రజారంజకమైన పరిపాలనను అంది స్తూ.. సబ్బండ వర్గాలను గుండెకు హత్తుకున్న చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది.
ఈ ప్రాంత బిడ్డ పీవీ నరసింహారావు దేశ ప్రధానిగా ఎన్నో సంస్కరణలతో దేశానికి వన్నె తెస్తే, ఢిల్లీలో తన చితికి కట్టెపుల్ల కూడా ఇవ్వని కాంగ్రెస్ పార్టీ పీవీ గురించి మాట్లాడటం మరీ విడ్డూరం. జాతీయ రహదారులకు, తెలంగాణ రాష్ట్ర అంతర్గత రోడ్లను అనుసంధానం చేస్తూ అభివృద్ధి చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. నిజాలను, అబద్ధాలుగా మలచాలని చూసినా, అబద్ధాలను నిజాలుగా చేయాలనే ప్రయత్నం చేసినా చరిత్ర ఒప్పుకోదు గాక ఒప్పుకోదు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వైద్య రంగానికి సరితూగేలా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా మెడికల్ కాలేజీలు నిర్మించడమే కాకుండా వరంగల్ నడిబొడ్డున కార్పొరేట్‌ను తలదన్నే లా 24 అంతస్థులతో బహుళ ప్రజా దవాఖాన నిర్మాణం చేపట్టిన ఘనత బీఆర్ఎస్ది. శతాబ్ద కాలంలో జరగని అభివృద్ధిని, బీఆర్ఎస్ ప్రభు త్వం దశాబ్ద కాలంలోనే చేసి చూపెట్టి మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపించింది. మీ తండ్రి అయిన కడియం శ్రీహరి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేసిన వ్యాఖ్యలను ఒకసారి గుర్తుచేసుకో. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దోచుకొని అధిష్ఠానానికి చేరవేయడమే తప్ప అంతకుమించిందేమీ ఉండదు. తెలంగాణ రాష్ట్రం నలువైపులా మరింత అభివృద్ధి సాధించాలంటే అదొక్క బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని తెలుసుకో.
మణిపూర్ లాంటి ఘటనలు రాష్ట్రంలో ఎన్నో చూస్తున్నాం. అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలగడం లేదు. ఢిల్లీకి డబ్బు ల మూటలు అప్పజెప్పడంతోనే ఆ పార్టీకి సరిపోతున్నది. అధికార జులుంతో, పోలీసు బలగాలతో గిరిజన తండాలపై దాడులు చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది. గిరిజనులు తమ భూములను అప్పనంగా అప్పజెప్పాలని రైతులకు సంకెళ్లతో బేడీ లు వేసి, అమాయకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన రాక్షస ప్రభుత్వం ఇది. ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అంటూ పోలీసు బలగాలతో చేస్తు న్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా కాంగ్రెస్ చరిత్రలో మిగిలిపోవడం ఖాయం.
(వ్యాసకర్త: మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్, నర్సంపేట, వరంగల్ జిల్లా)
-పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి