కల్వకుంట్ల తారకరామారావు.. కేటీఆర్‌గా దేశ రాజకీయ యవనికపై తణుకులీనుతున్న తెలంగాణ ముద్దుబిడ్డ. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న నవతరం నాయకుడు.
భారత రాష్ట్ర సమితికి భావి ఆశాజ్యోతి. దాని వ్యవస్థాపకులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలు, ఆదర్శాలకు ప్రతిరూపం. కేటీఆర్ రాజకీయవేత్తగా కేసీఆర్‌కు వారసుడే, ఆయనతో సమానంగా ప్రజాభిమానం పొందిన నాయకుడు.
కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ రాజకీయ యవనికపై కేటీఆర్‌ను కేవలం పరిచయం మాత్రమే చేసింది. నిన్నటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ పార్టీని మించి ఎదిగిన కేటీఆర్ ప్రతిష్ఠకు తండ్రి వారసత్వం ఒక ఆలంబన మాత్రమే. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం శ్రమించి, సాధించి తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన కేసీఆర్ ప్రజల నుంచి వచ్చిన నాయకుడు. మేధస్సుకు అందని, విమర్శలకు చిక్కని, విశ్లేషకులు ఊహించలేని విశిష్ట వ్యక్తిత్వం కేటీఆర్ సొంతం. సమస్యలను సమూలంగా అధ్యయనం చేయటం, మాటల్లో స్పష్టత, చేతల్లో పారదర్శకత వంటి లక్షణాలు కేటీఆర్‌లోని నాయకత్వ పటిమను ఆవిష్కరింపజేశాయి.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఎన్నో సందర్భాలు కేటీఆర్‌లోని నాయకత్వ లక్షణాలకు దర్పణం పట్టాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన కృషి వల్లే రెండుసార్లు టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.
కేటీఆర్ ప్రతి అంశాన్ని సమగ్రం గా అధ్యయనం చేస్తారు. పారిశ్రామికవేత్తలను ఆహ్వానించటం, సాఫ్ట్వేర్ కంపెనీలను నెలకొల్పే దిశగా ఆయా కంపెనీల సీఈవోలతో కేటీఆర్ ప్రజెంటేషన్ అద్భుతంగా ఉం టుంది. వివరించే తీరు అందరినీ మంత్రముగ్ధ్దులను చేస్తుంది. కేటీఆర్ గురించి ఏది చెప్పినా, ఎంత చెప్పుకొన్నా తక్కువే. విశ్లేషణలకు చిక్కని, మాటలకందని మహోన్నత వ్యక్తిత్వం ఆయనది.‘ది లీడర్’ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం.
శాఖమూరు శ్రీనివాస ప్రసాద్
70326 14864