దేశం గర్వించదగ్గ జాతిరత్నం.. మన్మోహన్సింగ్
హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ విప్రో సరిల్లో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ఆవిష్కరించారు. మన్మోహన్సింగ్ దేశం గర్వించదగ్గ జాతిరత్నమని ఆయన కొనియాడారు. ఆర్బీఐ గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా ఆయన అనేక పదవులకు వన్నె తెచ్చారని పేర్కొన్నారు. 1991లో పీవీ నర్సింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెకించి, ఎల్పీజీ(ఉదారీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ) విధానాలు తీసుకొచ్చిన ఘనత ఆయనకే దకుతుందని చెప్పారు.
- మాజీ ప్రధానమంత్రి విగ్రహ ఆవిష్కరణ వేడుకలో సీఎం రేవంత్
- భారతరత్న ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ విప్రో సరిల్లో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ఆవిష్కరించారు. మన్మోహన్సింగ్ దేశం గర్వించదగ్గ జాతిరత్నమని ఆయన కొనియాడారు. ఆర్బీఐ గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా ఆయన అనేక పదవులకు వన్నె తెచ్చారని పేర్కొన్నారు. 1991లో పీవీ నర్సింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెకించి, ఎల్పీజీ(ఉదారీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ) విధానాలు తీసుకొచ్చిన ఘనత ఆయనకే దకుతుందని చెప్పారు.
దశాబ్దాల తెలంగాణ కలను సోనియా గాంధీ, అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ సాకారం చేశారని, తెలంగాణ ఏర్పాటు ఫైలుపై ఆయన చేసిన సంతకాన్ని ఇకడ పొందుపరిచామని తెలిపారు. విద్యాహకు చట్టం, జాతీయ ఉపాధి హామీ చట్టం, భూసేకరణ-పునరావాస చట్టం-2013ను తెచ్చి పేదలకు భరోసా కల్పించారని వివరించారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని ప్రధాని మోదీని కోరారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి, మాజీ ఆర్థిక సలహాదారు మోహన్ గురుస్వామి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

