పుస్తక సమీక్ష
ఛిద్రమైన బతుకులకు, అతుకులతో నెట్టుకొస్తున్న జీవితాలకు నిదర్శనమే ఈ నవల. ఆ గుడిసెలో ఆకలితో పాటు ఎంతో ఆవేదన దాగుంది. ఆ రాత్రి వానపడి గుడిసెలోకి నీరు వచ్చినప్పుడు ‘గొప్పోళ్లంతా రాత్రంతా నిద్రపోకుండా జాగరణ చేస్తారు గనుకే వాళ్లు గొప్పోళ్లయ్యారు’ అని హనుమంతు తన కొడుకు రాముడికి చెప్పే మాటల్లో అమాయకత్వంతో పాటు గొప్పతత్వం బోధపడుతుంది. ఇక ఇందులోని మన కథానాయకుడు రాముడు అణగారిన వర్గాలకు చెందినవాడు.
నిశబ్ద విప్లవం

బాల్యం నుంచే వివక్ష, ఆకలి ఎదుర్కొన్నా ఆత్మవిశ్వాసం కోల్పోడు. రుద్రగిరి గ్రామ పెద్ద సంజీవయ్య చేయని అకృత్యం ఉండదు. దళితులు అంటరాని వారని గుడిలోకి రానీయకుండా, వారి భూములను లాక్కుంటాడు. దళితవాడకు చెందిన మల్లిగాడి భార్య మంగమ్మపై అత్యాచారానికి పాల్పడతాడు. అవమానం భరించలేక ఆమె చనిపోతుంది. ఆ కోపంతో మల్లిగాడు ఊరి జాతర్లోనే సంజీవయ్య తల నరికి మొండాన్ని చెట్టుకు వేలాడదీసి వరదల్లో కొట్టుకుపోతాడు. అదే వరదల్లో భార్యను కోల్పోయిన హనుమంతు కొడుకుతో కలిసి అతుకుల గుడిసెలో జీవిస్తుంటాడు.
రాత్రంతా కురిసిన వానకు గుడిసె తడవడంతో హనుమంతు తన కొడుకును దగ్గరకు తీసుకొని తమకు చదువు అవసరాన్ని వివరించి నిద్రలోనే కన్నుమూస్తాడు. ఒంటరివాడైన రాముడిని శివయ్య పేరుతో వచ్చిన మల్లిగాడు చేరదీస్తాడు. శ్మశానమే ఇల్లుగా చేసుకొని చక్కగా చదువుకుంటూ ఉంటాడు రాముడు. కష్టపడి చదివి ఐఏఎస్ సాధించి కలెక్టర్ అవుతాడు. రుద్రగిరిలో సంజీవయ్య కొడుకు నరసింహ చేసిన దుర్మార్గాలను గ్రామస్తులతో కలిసి రాముడు ఎదిరించడంతో కథ సుఖాంతమవుతుంది. రచయిత ఈ నవలను సినిమాటిక్లా మార్చడంతో పుస్తకం చదివే అలవాటు లేని వారికి సైతం ఇది ఆసక్తిని కలిగిస్తుంది.
అతుకుల గుడిసె (దక్షిణ వీధిలో ఉదయించిన సూరీడు)
రచయిత: సురేష్ మందల
పేజీలు: 110, ధర: రూ.200
ప్రతులకు: 99662 44674
-రాజు పిల్లనగోయిన
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్