ఆకాశంలో సగం, భూమిలో సగం, సమగ్ర అభివృద్ధిలో సగం, అవకాశాల్లోనూ సగం వాటా మాదే అంటూ దశాబ్దాలుగా నినదిస్తున్న భారతీయ మహిళలకు ఇంత వరకు నిరాశే ఎదురవుతూ వచ్చింది. పార్లమెంట్ ముందే తచ్చాడుతున్న ఈ బిల్లును పాస్ చేసి చిత్తశుద్ధితో మహిళలకూ సమానత్వాన్ని ఇచ్చే ఉద్ధేశం చట్టసభల్లో కొలువైన మగానుభావులకు కలగకపోవడం విచిత్రమే కాదు, ఎందుకంటే నిచ్చెనమెట్ల వ్యవస్థలో ఎదిగిన మనకు ఈ వ్యత్యాసాలు లేకపోతే మరి ముద్ద దిగదాయే. కానీ అందరూ అదేవిధంగా ఉండరు కదా. అవును ఇప్పుడు పార్లమెంట్ ఉభయసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత అవసరం ఏముందనేది మీ సందేహం కావచ్చు. ఆ బిల్లు ఆమోదం పొందటానికి తెలంగాణ రాష్ట్ర నాయకులు చేసిన కృషిని విస్మరించరాదు.
మహిళా బిల్లుకోసం ఇంతవరకు జరిగిన పోరాటాలు ఒక ఎత్తైతే ఈసారి ఎటువంటి వ్యతిరేకత లేకుండా మహిళా బిల్లు ఉభయసభల్లోను ఆమోదం పొందింది. దీనివెనుక మన రాష్ట్ర నాయకుల కృషి ఎంతో ఉన్నది. మహిళ బిల్లు కోసం ఇటీవల దేశ రాజధాని న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారత జాగృతి చైర్ పర్సన్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దీక్ష చేపట్టారు. అంతేకాదు దేశంలోని అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులకు ‘మహిళా రిజర్వేషన్’ బిల్లు అమలుకోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ లేఖలు రాశారు. దీంతో కేంద్రం మొద్దు నిద్ర వదిలి బిల్లు పాస్ చేయడానికి సిద్ధమైంది. ఆర్టికల్ 15(3) ప్రకారం భారత రాజ్యాంగం స్త్రీ, పురుషులను సమానంగా గుర్తించింది. మహిళల అభివృద్ధి, ఉన్నతికి రాజ్యం ప్రత్యేక చట్టాలు చేయవచ్చు. ఆర్టికల్ 39(బీ) ప్రకారం పురుషులతో సమానంగా మహిళలకూ వేతనం చెల్లించాలి. ఆర్టికల్ 39(ఏ) ప్రకారం స్త్రీ, పురుషులకు సమాన జీవన ఉపాధి కల్పించాలి. 15 ఏ(ఈ) ప్రకారం స్త్రీ గౌరవ పరిరక్షణకు ప్రతి పౌరుడు కృషి చేయాలి. అంటే రాజ్యాంగంలో పొందుపరచబడిన హక్కులను అమలు చేసే నాయకత్వం కావాలి. అదృష్టవశాత్తు తెలంగాణ ప్రజలకు నాయకత్వ కొరత లేదు.
మన సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్‌రావు వీరంతా ఇంట గెలిచిన నాయకత్వం. ఇక రచ్చ గెలవడానికి ఎప్పుడూ సం సిద్ధం, అంటే రాష్ట్రం ఏర్పడి నిండా పదేండ్లు పూర్తికాకుండానే స్వా తంత్య్రం వచ్చినప్పటి నుంచి ఉన్న రాష్ర్టాల అభివృద్ధికి ధీటుగా చా లా విషయాల్లో మన రాష్ర్టాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టిన ఘనత మన నాయకులది. మన ఎమ్మెల్సీ కవిత మాత్రమే కాదు. సాక్షాత్తు మన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్ర శాసనసభలోను ఇంకా ఆమోదానికే నోచుకోని మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మన నాయకుడు ఎంతటి దూరదృష్టితో ఉన్నారో గమనించవలసిన సందర్భం ఇది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని కేంద్రానికి తీర్మానం పంపించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. ఇప్పుడే కాదు యూపీఏ ప్రభుత్వ హయాంలో 2009లోనే కేసీఆర్ తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన బీసీ ఉద్యమ నాయకులను ప్రధాని మన్మోహన్ సింగ్ దగ్గరకు తీసుకెళ్లారు. బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు ఆవశ్యకతను వివరించి బీసీ మంత్రిత్వ శాఖను ప్రకటించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రస్తుత బీసీ వర్గాల అతి ముఖ్య డిమాండ్ కుల గణన గురించి సానుకూలంగా స్పందించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. ఎవరూ అడగక ముందే ఆదర్శ రాజకీయాల కోసం తన, పర భేదాలకు తావులేకుండా సమాజ అభివృద్ధే తారకమంత్రంలా జపిస్తూ, ఆచరిస్తూ అనుసరిస్తూ దేశ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలుకుతున్న కేసీఆర్ జాతీ య రాజకీయాల్లో అసలైన ప్రత్యామ్నయం కాగలరు.
దేశవ్యాప్తంగా జరిగే జనాభా లెక్కల్లో బీసీల కుల గణన జరుపాలని కేసీఆర్ నాయకత్వంలో అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి కేంద్రానికి పంపించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. అదేవిధంగా మహిళా బిల్లును సమర్థిస్తూనే మహిళా బిల్లులో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రానికి సూచించిన నాయకుడు మన సీఎం కేసీఆర్. అదేవిధంగా దశాబ్దాలుగా ఓబీసీలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి శాసనసభ సమావేశంలోనే ఓబీసీలకు 33శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్.
తెలంగాణ రాష్ట్రంలో చిన్న చిన్న కులాలకు సామాజిక న్యాయం జరగాలని మార్కెట్ కమిటీ నియామకాలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన చరిత్ర కేసీఆర్ సొంతం. అదే విధంగా మద్యం షాపుల్లో గౌడ కులస్తులకు, ఫర్టిలైజర్ షాపుల్లో ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించిన ఏకైక నాయకుడు మన కేసీఆర్. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే క్రమంలో భాగంగా వృత్తిపై ఆధారపడిన బీసీలను అభివృద్ధి చేయడం కోసం యాదవ సోదరులకు గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ, నేత కార్మికులకు సబ్సిడీతో రుణాలు, చాకలి, మంగలి కులాల వారికి 250 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, ఆధునిక ధోబీ ఘాట్ల నిర్మాణం చేపట్టారు. గీత కార్మికులకు తాటి చెట్ల మీద పన్నును రద్దు చేసి కల్లు దుకాణాలను తిరిగి ప్రారంభించి వారికి ఉపాధి కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌ది.
ఇలా చెప్పుకుంటూ పోతే బీసీలలో అన్ని కులాలకు సమన్యా యం సమాన అభివృద్ధికోసం ని రంతరం శ్రమిస్తున్న ఏకైక రాజకీయ మేరునగధీరుడు మన సీఎం కేసీఆర్. ఇలా తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేసిన విధంగానే రాబో యే కాలంలో భారతదేశాన్ని కూ డా అభివృద్ధి చేయడానికి దేశ్ కీ నేతగా ఎదగాలి మన కేసీఆర్!!!
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమీషన్ సభ్యులు)
ఉపేంద్ర,
9963202547