కర్నల్ వెంకట్‌రెడ్డి కామెడీ
అగ్ర కథానాయకుడు వెంకటేశ్, నందమూరి కల్యాణ్‌రామ్ కాంబినేషన్లో అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఓ భారీ వినోదాత్మక మల్టీస్టారర్‌ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వెంకీ సరసన కీర్తి సురేశ్, కల్యాణ్‌రామ్‌కి జోడీగా కృతి శెట్టి నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రిన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.
అగ్ర కథానాయకుడు వెంకటేశ్, నందమూరి కల్యాణ్‌రామ్ కాంబినేషన్లో అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఓ భారీ వినోదాత్మక మల్టీస్టారర్‌ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వెంకీ సరసన కీర్తి సురేశ్, కల్యాణ్‌రామ్‌కి జోడీగా కృతి శెట్టి నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రిన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. 40ఏండ్ల సినీ ప్రస్థానాన్ని వెంకటేశ్ పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం ఆయన ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఇండియన్ ఆర్మీ యూనిఫామ్‌లో, సన్ గ్లాసెస్, స్కార్ఫ్ ధరించి పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్న వెంకటేశ్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు.
ఓ స్పోర్ట్ యుటిలిటి వెహికల్ పక్కన నిల్చుని సీరియస్‌గా చూస్తున్న ఆయన లుక్‌ని బట్టి ఇందులో రగ్గ్డ్ మిలటరీ ఆఫీసర్‌గా వెంకటేశ్ కనిపించబోతున్నారనే విషయం అర్థమవుతున్నది. కౌంటర్ టెర్రరిజం, హోస్టేజ్ నెగోషియేషన్‌లో నిపుణుడైన ‘కర్నల్ వెంకట్‌రెడ్డి’గా ఈ పోస్టర్ ద్వారా వెంకటేశ్‌ని పరిచయం చేశారు.
వెంకీ, కల్యాణ్‌రామ్ మధ్య ఉండే కెమిస్ట్రీ, కామెడీ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చనున్నాయని, హ్యూమర్, ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాతో సాగే అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైనర్ ఇదని మేకర్స్ చెబుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, సమర్పణ: సురేశ్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, శ్రీమతి అర్చన.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

