అశోక్ గల్లా, శ్రీగౌరీప్రియ జంటగా నటిస్తున్న యువతరం రొమాంటిక్ ప్రేమకథ ‘VISA – వింటారా సరదాగా’. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, హర్ష చెముడు కీలక పాత్రధారులు. ఉద్భవ్ రఘు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానున్నది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా రెండో టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
పూర్తిగా కథానాయకుని కోణంలో ఈ టీజర్ సాగింది. అమ్మాయిల వల్ల అబ్బాయిల జీవితాల్లో ఎదురయ్యే ట్రబుల్స్ గురించి అశోక్ గల్లా పాత్ర తనదైన శైలిలో చెప్పే మాటలు టీజర్‌కి మరింత క్రేజ్‌ని తెచ్చిపెట్టింది. సహజమైన సంభాషణలు, చురుకైన హాస్యం, మనసులను హత్తుకునే భావోద్వేగాలతో ఈ టీజర్ సాగింది. సత్య, వైవా హర్ష, గుండు సుదర్శన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, నిర్మాణం: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్.