నిజమే తెలంగాణ రాష్ట్రం కన్నా ఈ బీజేపీ ప్రధాని గొప్పేమీ కాదు. ఆత్మగౌరవం కోసం పోరాడి గెలిచిన రాష్ట్రం మీద వివక్ష చూపితే ప్రధానికి స్వాగతమెందుకు పలుకాలి? పార్లమెంట్ లో తెలంగాణ పుట్టుకనే అవమానించిన రోజును ఏ విధంగా మరిచిపోతాం? తెలంగాణ మట్టిని ముడితే గొప్ప పాటవుతుంది. తెలంగాణ మనిషిని ముడితే బతుకు పాఠమవుతుంది. అలాంటి తెలంగాణ అభివృద్ధికి అడ్డం పడుతూ దేశ సంపదను మీ బీజేపీ పాలిత రాష్ర్టాలకు తరలిస్తే ఎవరు ఊరుకుంటారు. అందుకే మా సీఎం కేసీఆర్ మీకు స్వాగతం పలుకలేదు. పలకరు కూడా. అయినా మీరు మా రాష్ర్టానికి వచ్చినా మా సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవాలకు ఎందుకు రాలేదో ప్రధాని ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
తెలంగాణ అభివృద్ధికి అనేక అంశాల్లో అడ్డుపడుతూ నిధులు ఇవ్వకుండా మోసం చేస్తున్నది ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం. అలాంటి ప్రధాని తెలంగాణకు వచ్చి ప్రభుత్వాన్ని తిడుతూ సీఎం కేసీఆర్‌ను పిలిస్తే ఎలా వెళ్తారు. కేసీఆర్‌కు ప్రాణం తెలంగాణ.అలాంటి తెలంగాణను అవమానిస్తే ఎవరితోనైన తలపడటంలో వెనుకాడరు. తెలంగాణపై కేంద్రం ప్రదర్శిస్తున్న వివక్షను సహిస్తూనే దేశంలో గొప్ప చైతన్యం కోసం ఉద్యమిస్తున్నారు కేసీఆర్. రాష్ర్టాల సముదాయమైన దేశంలోని కొన్ని రాష్ర్టాలను తిడుతూ, మరికొన్ని రాష్ర్టాల కు పెడుతున్న కేంద్రవైఖరిపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరుగుతున్నారు.
చెప్పేవి ధర్మ సూత్రాలైనప్పుడు పాటించేవి కూడా అలాగే ఉంటే బాగుండే ది. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది కనుకే పోరాడి ప్రత్యేక రాష్ర్టా న్నే తెచ్చుకున్నాం. అలాంటి రాష్ట్రం మీద ఇంకా వివక్ష కొనసాగితే అనుకున్న లక్ష్యాలను చేరడానికి మరో ఉద్యమం తప్పదు. అందుకే బీఆర్ఎస్ రూ పంలో మరో పోరాటానికి సిద్ధపడింది తెలంగాణ. కేంద్రం ప్రదర్శిస్తున్న వివక్షను ప్రజల ముందుంచుతూనే రాష్ట్ర అభివృద్ధి విషయంలో మాత్రం రాజీ పడలేదు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్ట్ గమనిస్తే చాలు ఆ విషయం స్పష్టమవుతుంది. కేంద్రం ఒక్క రూపా యి ఇవ్వకున్నా వేల కోట్లతో ప్రాజెక్ట్ నిర్మించి రైతుల కన్నీరు తుడిచారు కేసీఆర్. ఎనిమిదేండ్ల కేంద్ర పా లన ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సరితూగదు.
రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, దళితబంధు ఇలా అనేక పథకాలతో తెలంగాణ పాలన దేశాని కే ఆదర్శంగా నిలుస్తున్నది. అలాంటపుడు తెలంగాణ పాలన అన్ని రాష్ర్టాల్లో కావాలని ఆయా రాష్ట్రాల ప్రజలు కోరుకోవడంలో తప్పేమున్నది. తెలంగాణ లెక్క ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారు. దానికి తగినట్టే ఆయా రాష్ర్టాల్లో ఇప్పటికే నిర్వహించిన సభలు విజయవంతమయ్యాయి. ఇప్పుడు దేశంలో స మూల మార్పుకోసం సీఎం కేసీఆర్ బయలుదేరుతుంటే కేంద్రానికి వె న్నులో వణుకు మొదలైంది.అం దుకే అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నది.
దేశ రాజకీయాలను సమూలంగా మార్చే శక్తి కేసీఆర్‌లో ఉన్నది. కేసీఆర్ ఒక వ్యక్తి అనుకుంటే తప్పు లో కాలేసినట్టే. ఆయన ఒక సమూహ శక్తి అనేది భవిష్యత్‌లో మీకే అర్థమవుతుంది. దేశం మీద దొంగభక్తితో నినాదాలు ఇవ్వడం కాదు ఆ నినాదా లు విధానాలై దేశ అభివృద్ధికి బాటలు వేయాలి. దేశ భవిష్యత్తుకు పునాది కావాలి. అప్పుడే దేశాభివృద్ధి సాధ్యం అది కేసీఆర్‌తోనే అవుతుందని దేశం మొ త్తం విశ్వసిస్తున్నది.
ఏ రాజకీయ పార్టీ అయినా మతాల పేరుతో ఎన్నటికీ జాతిని ఒక్కటి చేయలేదు. ఒక గొప్ప భారతాన్ని నిర్మించలేదు. అల్లర్లు చేయడం, విద్వేషాలు సృష్టించడం తప్ప బీజేపీ దేశం కోసం శాంతిని ఎన్నటికీ నెలకొల్పలేదు. పార్టీకి మతం రంగు లు వేసుకొని పూటకోవేషం వేసే బీజేపీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నది నిజం. అందుకే రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పడం కోసం ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్ ’ అం టూ గొప్ప నాయకుడు బయలుదేరుతున్నాడు. విజయం సాధించే వర కు వెన్ను చూపని ఒక ప్రజానాయకుడు బయలుదేరుతున్నాడు.
కళ్లెం నవీన్ రెడ్డి
99636 91692