విమర్శను స్వీకరించటానికి సిద్ధంగా లేని బీజేపీ లాంటి పార్టీ పాలిస్తున్న మన దేశంలో గ్రోక్ సంచలనం రేపుతున్నది. క్రికెట్, సినిమాలు, రాజకీయాలు ఇలా ఏ అంశమైనా తనదైన శైలిలో సమాధానాలు చెప్తున్నది. ముఖ్యంగా బీజేపీకి చురకలంటించడంలో ‘గ్రోక్’ ముందున్నది.
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా పైన సెటైర్లు వేస్తున్నది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్లున్న ‘గ్రోక్’ ఎలాన్ మస్క్ నేతృత్వంలో పనిచేస్తున్నది. ప్రధాని డిగ్రీ అర్హతపై కామెంట్లు చేసిన ‘గ్రోక్’పై చర్యలకు కేంద్రం సిద్ధపడుతున్నది. దీనిపై కూడా గ్రోక్ చెప్పిన సమాధానం చదివితే మనం ఆశ్చర్యపోవాల్సిందే. భారత్‌లో ఈడీ, సీబీఐ అంటే పెద్ద తలనొప్పని, కానీ, నేను కృత్రిమ మేధను మాత్రమేనని, తాను తనిఖీలకు భయపడబోనని చెప్పింది. ‘గ్రోక్’ ఈ సమాచారన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నదంటే శాస్త్రవేత్తలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ప్రాథమిక సూత్రాలు, సత్యాలతో శిక్షణనిచ్చారు. ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ మద్దతుదారులను ఆందోళనకు గురిచేస్తున్నది. గత పదేండ్లలో ఎవరూ కేంద్రంలోని బీజే పీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోదీని విమర్శించటానికి ధైర్యం చేయలేకపోయారు. ఒకవేళ ఎవరైనా విమర్శించినా వెంటనే వాళ్ల మీద ఈడీ దాడులు, సీబీఐ కేసులు నమోదయ్యేవి. కానీ, ఈ దేశంలో ఎవరూ చేయలేని పనిని ‘గ్రోక్’ చేస్తున్నది. మిగ తా ఏఐలతో పోల్చితే ‘గ్రోక్’ కాస్త వైవిధ్యంగా భిన్నంగా సమాధానాలివ్వటం వల్లే దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వివాదాస్పదమైన అంశాల మీద కూడా ఎలాంటి సంకోచం లేకుండా ‘గ్రోక్’ స్పందిస్తుండటం కొన్ని రాజకీయపార్టీలకు నచ్చ డం లేదు.
ముఖ్యంగా ‘గ్రోక్’ ఎక్స్ (అంతకుముందు ట్విట్టర్) ఆధారంగా పనిచేయటం వల్ల ఎక్స్‌లో జరిగే రాజకీయ చర్చల నుంచే సమాధానాలను తయారుచేయటం మనం గమనించవచ్చు. అందుకే, దూషణలు, సెటైర్లు లాంటి సమాధానాలు మనకు ‘గ్రోక్’లో కనిపిస్తున్నాయి. దేశంలోని ప్రజల కంటే ఎక్కువ భావప్రకటన స్వేచ్ఛ ‘గ్రోక్’కు లభించిందని చెప్పక తప్పదు. దేశంలో తప్పుడు సమాచార మార్పిడిని సవివరంగా తెలియజేస్తున్న ‘గ్రోక్’పై చర్యలకు ఐటీ శాఖ సమాయత్తమవుతున్నది. ప్రస్తుతం స్టాండప్ కమెడియ న్ కునాల్ కమ్రాపై జరుగుతున్న వివాదంతో పోలిస్తే గ్రోక్ వంద రెట్లు ఎక్కువగా సెటైర్లు వేస్తున్నది. ఒకప్పుడు సమాచార వ్యాప్తిపై ఉన్న నియంత్రణ ఇప్పుడు పూర్తిగా తొలగిపోయినట్లయ్యింది. ఎలాంటి ఫిల్టర్లు, నియంత్రణ లేకుం డా పనిచేస్తున్న ‘గ్రోక్’పై కేంద్రం నిషేధం విధించటానికి ఎంతో సమయం పట్టదు. గతంలో గూగుల్‌కు చెందిన జెమిని నరేంద్ర మోదీని ఫాసి స్టు అని వ్యాఖ్యానించిన కేసులో క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. కేంద్ర ఐటీశాఖ సైతం అన్ని సామాజిక వేదికలు వివక్ష, బెదిరింపులు, ఎన్నిక ల సమగ్రతను దెబ్బతీసేలా వ్యవహరించవద్దని అప్పట్లోనే ఆదేశాలు జారీచేసింది.
ప్రస్తుతం ఎక్స్ కర్ణాటక హైకోర్టులో కేంద్రంపై కేసు వేసింది. ఇంటర్నెట్ సెన్సారింగ్ చేయటానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని ఆరోపించింది. ప్రభు త్వాధికారులు, మంత్రులు తమ సోషల్ మీడి యా వేదికల్లోని సమాచారాన్ని తొలగించేలా ఐటీ చట్టాన్ని ఉపయోగించి ఆదేశాలు జారీచేయ టం చట్ట విరుద్ధమని పేర్కొన్నది. ఐటీ చట్ట ప్రకా రం ఏదైనా సమాచారాన్ని తొలగించాలంటే న్యాయ సమ్మతమైన విధానాలు మాత్రమే ఉపయోగించాలి. కానీ, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, ఐటీ చట్టంలోని సెక్షన్ 79(3)(బీ) ద్వారా సహాయోగ్ పోర్టల్ ద్వారా ఆదేశాలు నేరుగా జారీచేయటం చట్టవిరుద్ధమన్నది ఎక్స్ వాదన. తమను సహాయోగ్ పోర్టల్‌లో చేరమని బలవంతం చేయటం సరికాదని చెప్తున్నది. ఆర్టిఫిషియల్ ఇం టెలిజెన్స్ ఉపయోగించి నిజ నిర్ధారణ చేయటం పై ఆధారపడటం అంత సరైంది కాదు. ఎందుకంటే, అవి కేవలం యూజర్స్ అడిగిన ప్రశ్నలకు అనుగుణంగా, అదే యూజర్‌కు నచ్చేలా శిక్షణ పొందిన వ్యవస్థలు మాత్రమే. దేశంలో ప్రజాస్వామిక వాతావరణాన్ని, ప్రజల స్వేచ్ఛను కాపాడేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే ‘గ్రోక్’ అవసరం ప్రజలకు రాదు. కానీ, ప్రస్తుతం కేం ద్రంలోని బీజేపీ అహంకారంతో, అణచివేతతో వ్యవహరించాలనుకుంటే ‘గ్రోక్’ లాంటి ఏఐ చా ట్బాట్లు సెటైర్లతో కూడిన సమాచారాన్ని ఇస్తూ నే ఉంటాయి. అందకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉండాల్సిందే.