ఎంపీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తున్నామంటున్నారు. ఆ గెలుపు గుర్రాలు పార్టీలో లేవని పక్క పార్టీల నుంచి తెస్తున్నారా? మరి పార్టీలో ఉన్నవారు ఏమైనా గుడ్డి గుర్రాల వలె కనిపిస్తున్నారా? ఈ ప్రశ్న, కాంగ్రెస్ అంటే గిట్టని పార్టీ వారు అంటే పెద్దగా పట్టించుకోనవసరం లేదు.
ఎంపీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తున్నామంటున్నారు. ఆ గెలుపు గుర్రాలు పార్టీలో లేవని పక్క పార్టీల నుంచి తెస్తున్నారా? మరి పార్టీలో ఉన్నవారు ఏమైనా గుడ్డి గుర్రాల వలె కనిపిస్తున్నారా? ఈ ప్రశ్న, కాంగ్రెస్ అంటే గిట్టని పార్టీ వారు అంటే పెద్దగా పట్టించుకోనవసరం లేదు. కానీ, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఏకంగా ఇదే ప్రశ్న వేస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాయడం పార్టీలో హాట్ టాపిక్.
కరుణించు స్వామి!
ఎన్నికల్లో అభ్యర్థులు తమను గెలిపించమని భగవంతుడిని ప్రార్థిస్తారు. గెలిచాక వెళ్లి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. కానీ, దానం నాగేందర్ మాత్రం దేవుడా నన్ను ఓడించి కాస్త పుణ్యం కట్టుకోమని వేడుకుంటున్నారట. ఎందుకంటే ఎంపీగా ఓడిపోతే హైదరాబాద్ కోటాలో మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారట. దీంతో ఎంపీ పదవి కంటే మంత్రి పదవే బెటర్ అని ఆయనా, ఆయన సన్నిహితులు వేనోళ్ల మొక్కుకుంటున్నట్టు వినికిడి.
మరక మంచిదే
ఒక్కోసారి మరక కూడా మంచిదేనన్న ట్రెండ్ వర్తమాన రాజకీయాల్లో నడుస్తున్నది. నేను సీఎం రేసులో ఉన్నట్టు మీడియా రాస్తున్నది. కానీ, నాకు సీఎం కావాలని ఏ కోశానా లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి మరీ స్పష్టం చేశారు. రేసులో లేకపోతే వదిలేయండి, లేనని చెప్పడానికి ప్రెస్ మీట్ ఎందుకని ఆయన సన్నిహిత జర్నలిస్టు మిత్రులన్నారట. గతంలో సీఎం రేసులో ఉన్నట్టు భట్టి, కోమటిరెడ్డి, ఉత్తమ్ పేర్లే మీడియా రాసేది. ఇప్పుడు ఆ జాబితాలో నన్ను కూడా చేర్చడంతో ఆ విషయం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడం మంచిదే కదా అని సదరు అమాత్యులు ఎదురు ప్రశ్నించారట.
పవర్ గ్యారెంటీ
ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పక్షంలో చేరుతున్న నాయకులకు ఏం చెప్పాలో తెలియక ప్రజాపాలన కోసమని చెప్తున్నారు. ‘ఈ నినాదమేమీ బాగాలేదు, మరీ పేలవంగా ఉంది. మరేదైనా కొత్తగా ట్రై చేయకూడదా?’ అని కాంగ్రెస్ నాయకులే వారికి సూచిస్తున్నారట. గతంలో అయితే బంగారు తెలంగాణ కోసమని చెప్పేవాళ్లం.. ఇప్పుడు అలాంటి బలమైన నినాదమేమీ లేకపోవడంతో ఏం చెప్పాలో అర్థం కావడం లేదని వాపోతున్నారట. పోనీ గ్యారెంటీ హామీల కోసమని చెప్పకపోయారా? అంటే, పార్టీ గెలిచినా, ఓడినా… పవర్ గ్యారెంటీ అని నెటిజన్లు ట్రోల్ చేస్తారేమోనని సదరు నాయకుడు అనుమానం వ్యక్తం చేశారు.