కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
ఎల్ నినో అంటే కేవలం వాతావరణ పరిణామం కాదు, అది వ్యవసాయం, నీటి భద్రత, ఆహార భద్రత, ప్రజల జీవనంపై ప్రభావం చూపే సవాల్. కానీ ప్రభుత్వం ఎల్ నినో హెచ్చరికకలను లెక్క చేయకుండా సంక్షోభం వచ్చే వరకు కాలయాపన చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయంలో విలువైన సమయం వృథా చేసింది. సాగు, తాగునీటి భద్రతపై చర్యలు చేపట్టలేదు. వాతావరణశాఖ అంచనాల ప్రకారం ఎల్ నినో గతంలో నమోదైన అత్యధిక స్థాయిని మించే అవకాశం ఉన్నది.
ఎల్ నినో అంటే కేవలం వాతావరణ పరిణామం కాదు, అది వ్యవసాయం, నీటి భద్రత, ఆహార భద్రత, ప్రజల జీవనంపై ప్రభావం చూపే సవాల్. కానీ ప్రభుత్వం ఎల్ నినో హెచ్చరికకలను లెక్క చేయకుండా సంక్షోభం వచ్చే వరకు కాలయాపన చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయంలో విలువైన సమయం వృథా చేసింది. సాగు, తాగునీటి భద్రతపై చర్యలు చేపట్టలేదు. వాతావరణశాఖ అంచనాల ప్రకారం ఎల్ నినో గతంలో నమోదైన అత్యధిక స్థాయిని మించే అవకాశం ఉన్నది. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరమున్నది. లేకపోతే సాగు ఆగమై, ప్రజల జీవనం దుర్భరంగా మారుతుంది.
కరువు ఒక రంగానికి సంబంధించిన సమస్య కాదు. సాగునీరు, వ్యవసాయం, విద్యుత్తు, తాగునీరు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అన్నింటినీ ప్రభావితం చేసే గొలుసు ప్రభావం. ఈ ప్రమాదం రానున్నదని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. కరువును ఎదుర్కొనేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అసలు ప్రశ్న ప్రభుత్వం హెచ్చరికను గుర్తించిందా లేదా అనేదే ముఖ్యం కాదు, ఆ హెచ్చరికకు తగిన వేగంతో చర్యలు తీసుకుంటున్నదా అనే ముఖ్యం. తెలంగాణకు ఆధారమైన అతిపెద్ద సహజ వనరు గోదావరి. ముఖ్యంగా ప్రాణహితగోదావరి సంగమం తర్వాత కన్నేపల్లి ప్రాంతంలో అందుబాటులోకి వచ్చే నీటిని సురక్షితంగా వినియోగించుకునే అవకాశాలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించాలి. కానీ ఈ విషయంలో ప్రభుత్వం విలువైన సమయాన్ని కోల్పోయింది. గోదావరిలో లభిస్తున్న నీటిని సాధ్యమైన మేరకు వినియోగించుకోవాలని, కన్నేపల్లి పంప్ హౌస్‌తోపాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వ్యవస్థలో సురక్షితంగా ఉపయోగించగల భాగాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని వానకాలం ప్రారంభంలోనే రిటైర్డ్ ఇంజినీర్లు, నీటిపారుదల నిపుణులు సూచించారు. కానీ ప్రభుత్వం పెడచెవినపెట్టింది. మరోవైపు కండ్లముందుగా ప్రవహిస్తున్న గోదావరి నీటిని సురక్షితంగా వినియోగించుకునే అవకాశాలను కోల్పోవడం పరిపాలనా దూరదృష్టి లోపంగానే కనిపిస్తున్నది.
ఎల్ నినో ప్రభావం తీవ్రమైతే ప్రభుత్వం పంటలు, జిల్లాల వారీగా నీటి భద్రతా ప్రణాళిక రూపొందించాలి. ఇప్పటికే సాగులో ఉన్న పంటలను ముందుగా రక్షించాలి. ఏ ప్రాజెక్టులో ఎంత నీరున్నది? ఆ ప్రాజెక్టుల కింద ఎంత ఆయకట్టు ఉన్నది? ఎంత నీరు అవసరం ఉన్నది? అనే వివరాలను ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించాలి. అంతేకాకుండా చెరువుల పునరుద్ధరణ, భూగర్భజలాల సంరక్షణ వంటి చర్యలను చేపట్టాలి. రైతులకు కేవలం సలహాలు ఇవ్వడం సరిపోదు.
నీటి లభ్యత ఆధారంగా పంటల ప్రణాళికను రూపొందించి, ఆ ప్రణాళికను అమలు చేయడానికి ప్రభుత్వం ఆర్థిక, సాంకేతిక సాయం అందించాలి. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గితే గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల మీదా ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరానికి వేసవిలో తాగునీటి అవసరం మరింత పెరుగుతుంది. అందువల్ల ప్రభుత్వం తాగునీటి భద్రతా ప్రణాళిక రూపొందించాలి. ప్రతి ప్రధాన రిజర్వాయర్‌లో ప్రస్తుతం ఎంత నీరు ఉన్నది? సాధారణ వినియోగంతో అది ఎన్ని నెలలకు సరిపోతుంది? ప్రత్యామ్నాయ వనరులు ఏమిటి? అత్యవసర పరిస్థితిలో ఏ వనరుల నుంచి నీటిని తీసుకురావచ్చు? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఉండాలి. హైదరాబాద్‌తోపాటు అన్ని మున్సిపాలిటీలకు ప్రధాన నీటి వనరు, ప్రత్యామ్నాయ వనరు, అత్యవసర వనరు అనే మూడు స్థాయిల నీటి భద్రతా వ్యవస్థ ఉండాలి.
వర్షాభావ పరిస్థితుల్లో విద్యుత్తు రంగం మీదా ప్రభావం పడుతుంది. నీటి కొరత వల్ల జల విద్యుత్తు ఉత్పత్తి తగ్గుతుంది. అదే సమయంలో వేసవి వేడి పెరిగితే గృహాలు, వ్యవసాయం, పరిశ్రమల నుంచి విద్యుత్తు డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి విద్యుత్తు కొనుగోలు, థర్మల్ విద్యుత్తు ఉత్పత్తికి అవసరమైన ఇంధన నిల్వలు, వ్యవసాయానికి నిరంతర సరఫరా వంటి అంశాలపై ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే లేదా ఏర్పాటు చేసిన వార్ రూమ్ కేవలం అధికారుల సమావేశాలకు పరిమితం కాకూడదు. ప్రతి వారం ప్రజలకు ఒక స్పష్టమైన పరిస్థితి నివేదిక ఇవ్వాలి:
జిల్లాల వారీగా వర్షపాతం, ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు, గోదావరి, కృష్ణా నదుల ప్రవాహాలు, తాగునీటి లభ్యత, సాగునీటి విడుదల, పంటల సాగు విస్తీర్ణం, భూగర్భజల పరిస్థితి, విద్యుత్తు డిమాండ్, సరఫరా వంటి అంశాలపై ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలి. రానున్న వారాల్లో వాతావరణ అంచనాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండాలి.
ఎల్ నినో అనేది ప్రకృతి పరిణామం. దాని ప్రభావాన్ని ఎంతవరకు తగ్గించగలమో అని అలోచించాల్సింది మాత్రం ప్రభుత్వమే. ప్రజలపై కరువు ప్రభావం ఏ మేరకు పడుతుంది అనేది పాలక పెద్దలు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుం ది. అందుకే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పునరుద్ధరణకు ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకూడదు. పనులకు కచ్చితమైన గడువు నిర్ణయించి, పురోగతిని ప్రజలకు తెలియజేయాలి. నీటి భద్రతను వాయిదా వేయడం ప్రజల ప్రయోజనాలకు విరుద్ధం.
కొన్ని నెలల్లో రాజకీయ వివాదాలు, పరస్పర ఆరోపణలు, అనవసరమైన అంశాలపై సమయం కేటాయించిన పాలకులు, నీటి సమస్య పరిష్కారం మీదా దృష్టి పెట్టాలి. ఇప్పటికే తగిన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. కానీ కాంగ్రెస్ పాలక పెద్దలు ఆ దిశగా ఎందుకు పట్టించుకోలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. అది మాటలతో కాదు, చేతల్లోనే చూపించాలి. అదే ప్రభుత్వం ముందున్న తక్షణ బాధ్యత. ఇన్నాళ్లూ కరువుపై చోద్యం చూసిన పాలకులు ఇకనైనా స్పం దించాలి. కరువును ఏ విధంగా ఎదుర్కొంటారో కచ్చితమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలి.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ మాజీ ఎంపీ)
బోయినపల్లి వినోద్ కుమార్
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

