అదిగదిగో మహాఋషి బోయ (పల్లవి)
రత్నాకర వాల్మీకి మహర్షి అదిగో
వల్మీకం నుంచి ఉద్భవించిన మహాజ్ఞాని అతడే
శోకంలో శ్లోకం దర్శించిన అపర మహారచయిత అతడే
అజరామర నిత్యనూతన రామాయణ
కల్పవృక్ష కథకుడు అతడే. (అదిగదిగో)
మహామహా మహితాత్ముడు
ప్రథమ విజ్ఞానసంగ్రహ అక్షరలక్ష రూపకర్త అతడే
భారతసాహిత్యపు ఆదికవి అతడే
లవకుశుల ఆదిగురువు అతడే
సీతామాత వనవాస రక్షకుడు అతడే (అదిగదిగో)
కౌసల్యా సుప్రజా రామా సృష్టికర్త అతడే
ఆదిత్యహృదయ ఆవిష్కర్త అతడే
జ్ఞాన సంపద సిద్ధహస్తుడతడే.
ఓం హీం క్రీం పద సృష్టి కర్త అతడే (అదిగదిగో)
కృషి ఉంటే మనుషులు మహా పురుషులు అవుతారని
తన జీవితాన నిరూపించిన ధన్యజీవి అతడే
సంకల్ప బలశక్తి తార్కాణం , ప్రబలశక్తి అతడే
నిరక్షర వ్యక్తి నుంచి పరమ పూజ్య గురువైంది అతడే
ఆ మహనీయ జ్ఞాన గురువు స్మరణే మనకు వరం
ఆ పావనమూర్తి పూజయే ఓ యాగఫలం
ఆ ఆదికవి వరవడియే మన గమ్యం
ఆ మహితాత్ముని జన్మదినమే మన పండుగ భాగ్యం
భగవాన్ వాల్మీకి పాదపద్మాలే మనకు శుభకరం. (అదిగదిగో)
(నేడు వాల్మీకి మహర్షి జయంతి)
రచన: బుర్రా వెంకటేశం, ఐఏఎస్
రామాయణ పరివారం గ్రంథ కర్త