‘ఎదలోన బాధతొలగి ధన్యమాయరో..
మా కేసీఆర్ సారువల్ల సల్లగుంటిమి..
మేము సల్లగుంటిమి మా ఇరువై ఏండ్ల ఎట్టి మార్చి గట్టి చేసి నిలిపినాడు‘ఎదలోన బాధ తొలిగి ధన్యమాయరో.. మా కేసీఆర్ సారువల్ల సల్లగుంటిమి.. సల్లగుంటిమి..
సదువులెన్నో సదివినాము.. పల్లెడెల్ల తిరిగినాము.. సదువులెన్నో సదివినాము..
పల్లెడెల్ల తిరిగినాము..
పేద మహిళ బతుక మార్చా..
గల్లిగల్లి తిరిగినాము..
ఎదలోన మహిళా సంఘాలు జేసి మంచిబాట లేసినాము.. మహిళా సంక్షేమమే..
మా ధ్యేయమని నిలిచినాము..
సామాజిక విలువలను గట్టిజేసి చెప్పినాము.. మహిళ బతుకు బాటలోన వెలుగులై నిలిచినాము..
మహిళా సాధికారతకే..
సమిధలై నిలిచినాము..
ఎదలోన బాధతొలగి ధన్యమాయరో..
మా కేసీఆర్ సారువల్ల సల్లగుంటిమి..
మేము సల్లగుంటిమి..
మా ఇరువై ఏండ్ల ఎట్టి మార్చి గట్టి చేసి నిలిపినారు.
సెర్ప్ ఉద్యోగులకు పేస్కేల్ వర్తింపజేసినందుకు గాను తెలంగాణ నాట్యమండలి కళాకారుడు, ఉద్యమకారుడు ఎల్లప్ప రాసిన గేయాన్ని సెర్ప్ ఉద్యోగులు ప్రతిరోజు ప్రతిజ్ఞలా ఆలపిస్తున్నారు.