అవునబ్బా మనం చేసింది చిన్న గాయం కాదు
అతను వెంటపడి ప్రేమిస్తుంటే
నిర్హేతుకంగా బ్రేకప్ చెప్పేస్తిమి!
మన ఆపతి గుర్తెరిగిన వాడిని
ఆపద కాలంలో స్మరిస్తుంటే
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లున్నది!
పెద్ద కాలం ఏం కాలేదు కానీ
కొంపలు కూల్చడం చూశాం
మూసీ నది మీద ఎనలేని ప్రేమలు చూశాం
ఇంకా ముక్కు మూసుకొని కూర్చోవాలా?
నమ్మడం తప్పు కాదు
నమ్మించి మోసం చేయడమే తప్పు
గ్రాఫ్ పడిపోతున్నప్పుడు
దబాయింపులు వెకిలి చేష్టలే!
రాజకీయాలు
ఎప్పటికీ శాశ్వతం కావు
మనిషిని మట్టిని నమ్ముకున్న వాడు
రీయెంట్రీ ఇస్తానంటే వెల్కమ్ చెప్పాల్సిందే!
-కోట్ల వెంకటేశ్వర రెడ్డి,
94402 33261