జనార్దనా! జన విమోచకా!
శిశుపాలుని
వంద తప్పులు పూర్తయినవి
పన్నెండు మాసాల
అరణ్యవాసం
ఒక మాసం అజ్ఞాతవాసం గడిచిపోయినవి!
ఏ గ్యారెంటీల్లేక
జనాలు రుణ విముక్తి కోసం
నిత్యం ఒకటే తండ్లాట
అడుసు తొక్కిన కాళ్లు
ఆశపడ్డ మనసు
పాతాళం లోతులు చవిచూసినవి
యుద్ధం లేకుండానే
విధ్వంసం మొదలైంది!
త్యాగాల మునివాకిట
పెరికి కంప విస్తరిస్తున్నది
మరోసారి పోరు పిలుపుకై
సమూహాలన్నీ సర్వం
సిద్ధంగా ఉన్నాయి
విముక్తి ప్రదాతా!
మీరు గర్జిస్తే కానీ
పొడుస్తున్న పొద్దు మీద
తెలంగాణ ఉదయించదు!!
-కోట్ల వెంకటేశ్వర రెడ్డి
94402 33261