ఇంతకీ ఎవరు మేధావులు? బాగా చదువుకొని పీహెచ్డీ పట్టా పొందినవారా? సామాజిక స్పృహతో సమాజంలో ఉన్న, సమాజానికి పట్టిన రుగ్మతలను ఎలా నయం చేయాలనే సంకల్పం గలవారా? అలాంటి రుగ్మతలను కలిగిఉన్న, వ్యాధిగ్రస్థమైన అవయవానికి లేదా వ్యక్తికి ఇక మందులు పనిచెయ్యవు, శస్త్రచికిత్స ఒక్కటే మార్గమని, అవయవ ఛేదనే దానికి సరైన చికిత్స అని నిర్ణయం తీసుకునేవారా? లేదా ఒక వ్యవస్థకు, ఒక వ్యక్తికి బందీ అయిపోయి వారి వ్యతిరేక వర్గాన్ని పొద్దునలేచిన దగ్గర్నుంచి విమర్శిస్తూ (తిడుతూ) బాగుపడేవారా? (బతకనేర్చినవారా?). వీరిలో ఎవరు మేధావులు? ఒక దృశ్య మాధ్యమం వారి వ్యతిరేకులను ఎలా ఉతికిపారేసిందో మొన్నటివరకు మనం చూశాం. అలాంటి కొందరు వ్యతిరేకులను కూడా మనం ఇంకా చూస్తున్నాం.
నేతన్నలకు ఒక పథకం, దళితులకు ఒక పథకం, గొల్లకుర్మవారికి ఒక పథకం అంటూ సమాజానికి ఏదో చేయబోతే.. గడీల పాలన, దొరల పాలన అంటూ కల్లబొల్లి మాటలతో ఊదరగొట్టిన నోర్లు ఇప్పుడెందుకు మూతబడ్డాయో మరి! మేధావుల మెదళ్లలో ఉన్న తెలివి అయిపోయిందా, లేక మేత మేస్తున్నా యా? ధర్మాన్ని మరిచి స్వార్థమొక్కటే రాజ్యమేలితే ఇటువంటి ఫలితాలే కనిపిస్తాయి.
Telangana | పొద్దునలేచిన దగ్గర్నుంచి సాయం త్రం దాకా ఏ మాధ్యమం దొరికితే ఆ మాధ్యమంలో వారి పోషకులకు అనుకూలంగా ఉతికివేయడం, ఇప్పటికీ ఆ చాకిరేవు ఇంకా నడుస్తుండటం కూడా చూస్తున్నాం. మేధావులంటే వీరేనా? కావొచ్చు. కాకపోతే నానారకాల ప్రజలకు నానా రకాల పథకాల్ని రచించి, నిరంతరం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే దాకా ఆలోచించినవారిని.. మాధ్యమాల్లో ఊదరగొట్టి దించేసేదాక వదల్లే దు కదా! ఆ మేధావుల మూతులు కొన్ని ఇప్పుడు మూతబడ్డాయి. ఎందుచేత? అది వారికి తెలుసు, మనకు తెలుసు. ఇక్కడో రకం మేధావులున్నారు.
నేతన్నలకు ఒక పథకం, దళితులకు ఒక పథకం, గొల్లకుర్మవారికి ఒక పథకం అంటూ సమాజానికి ఏదో చేయబోతే.. గడీల పాలన, దొరల పాలన అంటూ కల్లబొల్లి మాటలతో ఊదరగొట్టిన నోర్లు ఇప్పుడెందుకు మూతబడ్డాయో మరి! మేధావుల మెదళ్లలో ఉన్న తెలివి అయిపోయిందా, లేక మేత మేస్తున్నా యా? ధర్మాన్ని మరిచి స్వార్థమొక్కటే రాజ్యమేలితే ఇటువంటి ఫలితాలే కనిపిస్తాయి.
సమాజానికి ధర్మం చెప్పి, ధార్మిక చింతన నేర్పే కర్తవ్యమున్నవారు ఇంకొక రకం మేధావులు. వారి మేధల్ని అమ్మకానికి పెట్టారా? మరి చేతి ఐదు వేళ్లకు ఐదు ఉంగరాలు కావా లి, మెడలో బంగారు హారాలు కావాలి, ముం జేతి కడియాలు కావాలి. అయినా సమాజమంతా అలానే పోతుంటే వారు మాత్రం ఏం చేస్తారు? కానీ, నాకొక అనుమానం. సమాజంలో విలువ వీటిని ధరిస్తేనే వస్తుందా? గతంలో మహామహోపాధ్యాయుల్ని చూశాం, పుంభావ సరస్వతుల్ని చూశాం. వారికి ఏం లేవు. వారిప్పుడు లేకున్నా వారిని తలుచుకుంటున్నాం. ఇదిగో మేధావులు ఒక్కడ కొందరున్నారు. ‘నాకిదివ్వు, నీకిదిస్తా’ అనే ఒక రకం మేధావి వర్గం దేవునితో బేరమాడుతూ, ఆయన ఇంటర్వ్యూ కోసం వెంపర్లాడుతూ దేవాలయాల్ని నింపేస్తున్నది.
ఇదొక రకం మేధావివర్గం. ఇదిగో ఇక్కడుంది. చాలా రోజుల కిందట ఒక కవిత చదివాను. దాని కింద రాసిన కామెంట్ వల్ల జ్ఞాపకం వస్తూ ఉంటుంది. పుచ్చిపోయిన సమాజాన్ని విమర్శించిన కవిత కింద ఒక మేధావి రాసిన కామెంట్ ఇలా ఉంది. ‘కవిత బాగుంది! చదువుకోవడానికి హాయిగా ఉంది. యతిప్రాసలు, భాష అద్భుతం. కానీ, ఆయన వివరించిన సమస్యకు జవాబు లేదు. ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి? ఎవరు పరిష్కరించాలి? చెప్పలేదు. కవితాప్రియులు చదివి అనుభవించారు. అంతే, మరిచిపోయారు. కొందరు పాపం! సమస్యల్ని పరిష్కరిద్దామని సమాజంలో ఉంటూ కాదు, అడవిలో ఆలోచిద్దామని అడవికి వెళ్లారు. ఏదేదో చేశారు. ఏమైంది. కొందరు ఆ రుగ్మతలు వారికంటుకొని కనుమరుగయ్యారు. మానవులకున్న సహజ బలహీనతలు కొందర్ని బలిచేశాయి. కొందరు చట్టానికి బలైపోయారు. ఇదొక రకం మేధావి వర్గం.
ఒక పెగ్గు వేసి, ఒక సిగరెట్ వెలిగించి కొందరు మేధావులు అర్థవంతమైన కవితలు వెలువరించారు (నిజంగా బాధతోనే కావొచ్చు). కానీ, అవి కాలగర్భంలో కలిసిపోయాయి. వారూ వెళ్లిపోయారు. కానీ, సనాతన కావ్యాలు రామాయణ, భారతాలు కనుమరుగు కాలేదు. అవి నిత్యనూతనంగా (కొందరికి) వెలుగుతూనే ఉన్నాయి. కొందరికి అధికార పీఠమెక్కడానికి సోపానాలుగా కూడా పనికొస్తున్నాయి. అవి కనుమరుగు కాకపోవడానికి కారణం అందులో సమాజ రుగ్మతల్ని వర్ణిస్తూ వాటి నివారణకు, చికిత్సలకు మార్గా ల్ని కూడా చూపుతున్నాయి. ఇదీ కారణం. మరి వీటిని విరివిగా ప్రచారం చేద్దామని ఎవరికైనా తడుతున్నదా? (ప్రచారం చేసే కర్తవ్యమున్న మేధావులు దీనికి జవాబులు చెప్తారా?) ఇదొక రకం మేధావి వర్గం.
రాజమండ్రిలో గోదావరి ఆనకట్టను కట్టిన కాటన్ దొర పేరును ఇప్పటికీ చాలామంది తలుచుకుంటారు. కొందరైతే నిత్య పూజలో ఆయన పేరును చేర్చి సంకల్పం చెప్పుకుంటారట. ‘కావేరి వర్ధతాం, గోదావరి వర్ధతాం, కాటన్ దొర వర్ధతాం, కాలేవర్షతు వాసవా శ్రీరంగనాథో జయతు శ్రీరంగవర్ధతాం’ అంటూ. వీరు తెలివికలవారు కానీ, మేధావులు కారు.
మరి మన మేధావులు ‘కావేరి వర్ధతాం! కాళేశ్వరం వర్ధతాం, కేసీఆర్ వర్ధతాం, కాలేకాలేవర్షతు వాసవా’ అంటూ సంకల్పం చేస్తా రా? ఎందుకు చేయరు? ‘తొక్కేస్తాం, బొంద పెడతాం, పేరు లేకుండా చేస్తాం’ అనే సంక ల్పం మాత్రం చెప్తారు. ఎందుకంటే, వీరు ‘కావేరి వర్ధతాం, కాళేశ్వరం వర్ధతాం, కేసీఆర్ వర్ధ తాం’ అని అంటే ఇంకేమన్నా ఉందా? అబ్బో బ్రహ్మాండం బద్దలైపోదు!
ఆశలు తప్ప, ఆశయాలకు దూరమైపోతే మేధోసంపత్తి ఇలానే భ్రష్టుపడుతుంది. ఇక యువ మేధావులు.. వారి ఆశలు ఎలా అయి నా నెరవేరాలి తప్ప, ఇంకో మార్గం లేదంటారు. అయితే ఎదుటివారిని చంపుతారు, లేదా వారే ఆత్మహత్య చేసుకుంటారు. వీరితో మాట్లాడి వారిని సముదాయపరిచే వయసు మళ్లిన మేధ ఎక్కడుంది? తల్లిదండ్రులైతే వారి యువత జీవితంలో స్థిరపడితే చాలంటారు. ఆ తర్వాత వారు (యువత) ఎదుర్కొ నే సమస్యల్ని మొదటే వారికి చెప్పి, వాటిని ఎదుర్కొన్నప్పుడు ఎలా పరిష్కరించుకోవాలనే చెప్పే సోయి ఎంతమంది పెద్దలకుంది? మొదట జీవితం గురించి చెప్పి (ఇది అందరికీ వడ్డించిన విస్తరి కాదని) ఆ తర్వాత పరికర్త వ్యం గురించి వివరించి, కొంత ధర్మం గురిం చి చెప్పి వారిని సమాజంలో వదిలిపెడితే యువత ఇంత ఒత్తిడి ఎదుర్కోదు. కానీ, చెప్పే వారెవ్వరు? వారిని, వారి ఉద్రేకాన్ని రెచ్చగొట్టి తమ స్వార్థం కోసం వాడుకునేవారు కొందరైతే, వారి బాధలను అర్థం చేసుకోకుండా ‘ఎందుకు?, బలిసి, ఒళ్లు పొగరని, తెలివితక్కువని’ రకరకాలుగా కామెంట్ చేసేవారే అధి కం కాదా? ఒక్కసారి సమాజంలోకి వెళ్లండి. ఎన్ని కుటుంబాలు సంతోషంగా ఉన్నాయో సర్వే చేయండి. ఆర్థికంగా బాగానే ఉంటారు. కానీ, సంతోషంగా ఎందరున్నారు? అసలు సంతోషం, సుఖం, ఆనందం అన్న భావాల్లో తేడా ఎంతమందికి తెలుసు. ఈ విషయమై మేధావులు ఆలోచించారా?
‘ధర్మం, ధర్మం’ అని మాట్లాడుతున్నారు అదెక్కడుందని అంటారా. చూడాలనుకుంటే మన జీహెచ్ఎంసీలో స్వీపర్ నారాయణమ్మను చూడండి. ఆమె ఏం చదువుకోలేదు. వెనుకబడినవర్గానికి చెందిన మహిళ. ఆమెతో మాట్లాడితే ధర్మం అంటే ఏమిటో చెప్తుంది ఆమె ఆచరిస్తూ. కల్లు గీసుకుంటూ బతుకువెళ్లదీసి అంతటా పరతత్తాన్నే చూసిన భూమాగౌడ్ గురించి తెలుసుకోండి. చిన్న ఉద్యోగం చేసి, శతకం రాసి, అక్షరాలతో పరతత్తాన్ని వర్ణించిన రామస్వామిని చదవండి. రూ.47 జీతంతో చప్రాసి ఉద్యోగం చేసి, తన క్రమశిక్షణ, తన కర్తవ్య నిర్వహణ, తాను పనిచేస్తున్న బడి, పిల్లల బాగోగులు తప్ప వేరొకటి పట్టక, ఊరి వారందరితో ‘చప్రాసి సార్’ అని పిలిపించుకున్న అటెండర్ గజ్జెల బాలయ్య గురించి తెలుసుకోండి. ధర్మమంటే ఏమిటో తెలుస్తుంది. (వీరిలో కొందరున్నారు, కొందరు పరమపదించారు) అది (ధర్మం) నిరంతరంగా తనను ఆశ్రయించుకున్న వాళ్లను రక్షించుకుంటూ పయనిస్తూనే ఉంటుంది. ఎందుకంటే, ‘ధర్మో రక్షతి రక్షితః’ కాబట్టి. కాకపోతే మనం (మేధావులం) దాని గురించి ఆలోచించాలంతే. మన పిల్లలకు వారి చిన్నతనం నుంచి చెప్పాలంతే.
చెప్పేవారు లేక, సమాజంలో కనిపించిన ఆకర్షణలకు లోబడి భోగలాలసత్వం పెరిగి, దాని కోసం డబ్బు ఎలా సంపాదించాలా? అనే ఆలోచన తప్ప ఇంకే ఆలోచన లేకుండా యువత పోతుంటే మనం ఏం చేస్తున్నాం? ఈ ఒకవడిలో 27 సార్లు బంగారు హారం మెడల్లో నుంచి దొంగిలించి, జైలుకు వెళ్లి, తిరిగి వచ్చాక 28వ సారి మళ్లీ దొంగిలిస్తే! మార్గం ఏమిటి? మేధావులమైన మనకు ఇవేవీ పట్టవు. ఎందుకంటే, అది మన బాధ్యత కాదు, ప్రభుత్వానిదని అనుకుంటాం.
మేధావులంతటా ఉన్నారు. కర్తవ్యం, బాధ్య త అనే విషయాలు మనవి కావని అనుకుంటూ, మన జీవితాలు మనవి, ఇంకొకరి విష యం మనకెందుకంటూ, కబుర్లు చెప్తూ, ఉన్నతవర్గాల్లో తిరగాలని ఆశిస్తూ ప్రయాణం చేస్తు న్నాం.‘ఇక్కడ ఓ మేధావి వర్గం ఉంది’ అంటూ టంకశాల వారు మేధావుల గురించి మధనం చేస్తూ తిరుగాడుతుంటే ఈ వ్యాసం రాయాలనిపించింది. వారికి కృతజ్ఞతలతో.
(వ్యాసకర్త: రిటైర్డ్ సర్జన్)
-డాక్టర్ చెన్నమనేని హన్మంతరావు
98490 18120