అతడు సామాన్యుడే, కానీ..!
అణగారిన జాతిలో జ్యోతిలా వెలిశాడు.
పదునెక్కిన బాణానికి పర్యాయపదమై నిలిచాడు
ఎత్తిన పిడికిలినే జెండా చేసి
పల్లె నుంచి ఢిల్లీ దాకా…
గులాబీ జెండాలను ఎగరేశాడు
అవును…
అతడు సామాన్యుడే, కానీ…!
మట్టుబెట్టాలనుకున్న ప్రతిసారి గట్టిపడి
విసిరి కొట్టాలనుకున్న ప్రతిసారి
రబ్బరు బంతిలా లేచి,
ఏకుల్లా ఉన్న పీడిత జనాలను మేకులను చేశాడు.
మాటలనే తూటాలుగా మలిచి,
నేల నేలంతా యుద్ధభూమిని చేసి,
తాను బలి పీఠమెక్కినా…
రక్తం బొట్టు రాలకుండ,
ఆకుపచ్చ తెలంగాణను తెచ్చిండు.
నిజమే..
అతడు సామాన్యుడే, కానీ…!
చూపును ఆయుధాంగా తోసి,
గొంతును సైరన్ మోతను చేసి,
నదులను నిలిపి నడిగడ్డకు మలిపి
ఏండ్లకేండ్లుగా ఎండిన ఎడారి
పల్లె తల్లుల కాళ్లను గోదారి నీళ్లతో కడిగాడు.
తడిదేరిన గొంతులపై
నెర్రలు వారిన నేలలపై
నీటి పువ్వులు చల్లి,
ఎండిపోయిన చెరువులను
నిండు నీళ్లకుండల్లా చేశాడు.
బీడు చెలకలను పంట భూములుగా మలిచాడు
అయ్యో…
అతడు సామాన్యుడే, కానీ..!
చీకటి పల్లెలకు నిరంతర..! కరెంటును కానుకగా ఇచ్చి
పెళ్లి కాని చెల్లెలికి కల్యాణలక్ష్మిని కానుకగా ఇచ్చి,
అనాథ తల్లులకు, చేతగాని పెద్దలకు
దివ్యాంగులకు ఆసరాగా నిలిచాడు.
గోసపడ్డ రైతన్నకు, వెతలు పడ్డ నేతన్నకు బాంధవుడై వెలిసి,
పిల్లలకు సన్నబియ్యాన్ని తల్లులకు అమృత
ఆహారాన్ని చీరలను సారెలనుకానుకగా ఇచ్చాడు.
కూడులేని పేదలకు తోడుగా నిలిచి,
నిలువ గూడులేని పేదలకు డబల్ బెడ్రూం ఇల్లయి వెలిశాడు.
అవును…
అతడు సామాన్యుడే, కానీ…!
నిలువెత్తు మానవత్వానికి నిజరూపం
మంచితనాన్ని పంచిన మా
తెలంగాణ మట్టి సంతకం
-దాసరి శాంతకుమారి
96524 83644