Kevin Pietersen | వరల్డ్‌కప్ సన్నాహకాల్లో ఇంగ్లండ్.. మాజీ కెప్టెన్‌కు కీలక బాధ్యతలు.. !
Kevin Pietersen : ఇటీవల టెస్టు జట్టుకు కొత్త కోచ్ నియామం చేపట్టిన ఇంగ్లండ్ వేల్స్ బోర్డు(ECB) మరో కీలక నిర్ణయం తీసుకుంది. వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా మాజీ ఆటగాడైన కెవిన్ పీటర్సన్(Kevin Pietersen)కు మెంటర్‌గా బాధ్యతలు అప్పగించింది ఈసీబీ.
Kevin Pietersen : ఇటీవల టెస్టు జట్టుకు కొత్త కోచ్ నియామం చేపట్టిన ఇంగ్లండ్ వేల్స్ బోర్డు(ECB) మరో కీలక నిర్ణయం తీసుకుంది. వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా మాజీ ఆటగాడైన కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen)కు మెంటర్‌గా బాధ్యతలు అప్పగించింది ఈసీబీ. తమ వైట్ బాల్ జట్టుకు పీటర్సన్ స్పెషలిస్ట్ మెంటర్‌గా కొనసాగుతుడని వెల్లడించింది. 12 ఏళ్ల క్రితం అనూహ్య పరిణామాల మధ్య అంతతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ వెటరన్ మళ్లీ జాతీయ జట్టుకు సేవలందించనున్నాడు.
వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ కోసం సన్నద్ధమవుతున్న ఇంగ్లండ్‌కు కెవిన్ పీటర్సన్ కీలక సేవలు అందించనున్నాడు. మాజీ కెప్టెన్ అయిన పీటర్సన్ వన్డే, టీ20 జట్లకు స్పెషలిస్ట్ మెంటర్‌గా వ్యవహరించనున్నాడు. సోమవారం ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అతడికి ఈ బాధ్యతలు అప్పగించింది. దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వేలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వన్డే వరల్డ్‌కప్‌లో పీటర్సన్ సేవలు ఇంగ్లండ్‌కు కీలకం అవుతాయని బోర్డు వెల్లడించింది.
JUST IN: Kevin Pietersen will make an extraordinary return to the England set-up as a ‘specialist mentor’ for their white-ball teams ahead of next year’s ODI World Cup, 12 years after his international playing career came to a controversial end
Full story:… pic.twitter.com/RLz8sz7W7c
— Cricinfo (@cricinfo) September 7, 2026
‘చిన్నప్పుడు దక్షిణాఫ్రికాలో పెరిగినందుకు పీటర్సన్‌కు అక్కడి వాతావరణం బాగా తెలుసు. అందుకని వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగానే అతడిని ఇంగ్లండ్ జట్టుకు స్పెషలిస్ట్ మెంటర్‌గా నియమించాం’ అని సోమవారం ఈసీబీ పేర్కొంది.
ఐపీఎల్లో అనుభవం
వైట్‌బాల్ కోచ్ బెండన్ మెక్కల్లమ్తో కలిసి సహాయ బృందంలో ఒకడిగా కొనసాగనున్నాడీ దిగ్గజం. స్వదేశంలో శ్రీలంకతో మూడేసి వన్డే, టీ20 సిరీస్‌తో పీటర్సన్ తొలి పరీక్ష ఎదుర్కోనున్నాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్టుకు మెంటర్‌గా పనిచేసిన అనుభవం పీటర్సన్‌కు ఉంది. అంతేకాదు 2023లో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ సమయంలో ఇంగ్లండ్ ఆటగాళ్లకు సూచనలు ఇచ్చాడీ మాజీ సారథి. వైట్‌బాల్ క్రికెట్‌పై అతడికున్న పట్టు, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని స్పెషలిస్ట్ మెంటర్‌గా తీసుకుంది ఈసీబీ.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

