BRS MLAs | అసెంబ్లీ వద్ద పోలీసుల దాష్టీకం కారణంగా గాయపడి, నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందు తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గదుల ఎదుట రాక్షస కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను మోహరించింది. ప్రజాపాలన ముసుగులో బీఆర్ఎస్ నేతలను దవాఖానలోను నిర్బంధిస్తున్న కాంగ్రెస్ దద్దమ్మలు. ఇది ప్రజాపాలన కాదు.. రేవంత్ అరాచక పాలన అని ప్రజలు విమర్శిస్తున్నారు.
కాగా, సోమవారం కాంగ్రెస్ 1000 రోజుల పాలన వైఫల్యాన్ని నిరసిస్తూ నల్ల టీషర్టులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరి గింది. మహళా ఎమ్మెల్యేలు అని చూడా కూండా జుట్టు పట్టి, చీరలాగి అమానవీయంగా ప్రర్తించారు. పోలీసుల తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.