‘ముందు హత్యలు చేయండి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి రండి’.. ఆప్‌లో గ్యాంగ్‌స్టర్ చేరడంపై సిద్ధూ మూసేవాలా తండ్రి విమర్శలు
Sidhu Moosewala's Father Slams AAP | నేరస్తులు ముందు హత్యలు చేసి ఆ తర్వాత రాజకీయాల్లోకి వస్తున్నారని హత్యకు గురైన పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ విమర్శించారు. గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన గుర్ప్రీత్ సింగ్ సెఖోన్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేర్చుకోవడంపై ఆయన మండిపడ్డారు.
చండీగఢ్: నేరస్తులు ముందు హత్యలు చేసి ఆ తర్వాత రాజకీయాల్లోకి వస్తున్నారని హత్యకు గురైన పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ విమర్శించారు. గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన గుర్ప్రీత్ సింగ్ సెఖోన్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేర్చుకోవడంపై ఆయన మండిపడ్డారు. (Sidhu Moosewala’s Father Slams AAP) నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు ప్రధాన రాజకీయాల్లో చోటు కల్పిస్తున్నారని అధికార పార్టీని ఆయన తప్పుబట్టారు. మాన్సాలో జరిగిన సమావేశంలో సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ మాట్లాడారు. గ్యాంగ్స్టర్లతో సంబంధం ఉన్న వ్యక్తిని పార్టీలో చేర్చుకోవాలన్న ఆప్ నిర్ణయాన్ని ఆయన ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో సుమారు 15 మంది గ్యాంగ్స్టర్లు పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు.
కాగా, ఆప్‌లో ప్రజా సేవకులు తక్కువగా, గ్యాంగ్స్టర్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎక్కువగా ఉన్నారని బల్కౌర్ సింగ్ ఆరోపించారు. ‘ముందు రెండు-నాలుగు హత్యలు చేయండి, ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి నేరుగా అసెంబ్లీకి వెళ్లండి’ అని ఎద్దేవా చేశారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను అసెంబ్లీకి పంపాలా లేక ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రజల హక్కుల కోసం పోరాడగలిగే నిజాయితీ గల, సమర్థులైన ప్రతినిధులను ఎన్నుకోవాలా అనేది పంజాబ్ ప్రజలే నిర్ణయించుకోవాలని బల్కౌర్ సింగ్ అన్నారు. రాజకీయాల్లో నేరపూరిత శక్తుల ప్రభావం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 2027లో జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత హింసాత్మకంగా మారవచ్చని ఆయన అంచనా వేశారు.
మరోవైపు 2016లో నాభా జైలు నుంచి పరారైన ఘటనలో ప్రధాన నిందితుడు, గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన గుర్ప్రీత్ సింగ్ సెఖోన్, ఆప్‌లో చేరడంపై వివాదం చెలరేగింది. ఆదివారం ఫిరోజ్‌పూర్ జిల్లాలోని జిరాలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో సీఎం భగవంత్ మాన్ సింగ్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో త్వరలో జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో జిరా స్థానం నుంచి ఆప్ తరుఫున గుర్ ప్రీత్ సింగ్ సెఖోన్ పోటీ చేయవచ్చని తెలుస్తున్నది. ఇప్పటికే ఆయన తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రచారం కోసం సన్నద్ధమవుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

