తెలంగాణ ఆత్మ ఘోష వెంకటమ్మ
పురిటి నొప్పులతో పోరాడి…
భూమ్మీద పడ్డ కోట్ల మంది
ఆత్మగౌరవానివి నువ్వు…..
నువ్వు ఏ ఘడియల పుట్టినవో కానీ
తెలంగాణ గండాల నుంచి గట్టెక్కింది….
నువ్వు ఏ సూరు కింద పెరిగినవో కానీ..
మూలకున్న తెలంగాణను నడిమిట్ల కూకోవెట్టినవ్….
తెలంగాణ పల్క మీద మా సెయ్యివట్టి
ఉద్యమ ఓనమాలు దిద్దించి…
పోరాటాల పోయ్యెలిగించి
కన్నీళ్ల ఎసరు పెట్టించి…
చితికి పోయిన మా బతుకులను
అన్నం మెతుకులుగా ఉడికించి కడుపు నింపినవ్….
ఉప్పు నీళ్ళు తాగి తాగి శిలువెక్కిన
మా గొంతులతో జై తెలంగాణ అనిపించి…
పరాయి పాలనలో ఇలుటం పోయిన
మా బతుకులను గులాబీ జెండావట్టి
సొంత గూటికి ఇగ్గుకస్తే….
ఇంటి మీద గుమ్మడి తీగ పారింది…
తెలంగాణ తల్లి బతుకమ్మాడింది…
పాశిపోయినట్లున్న పండగలన్నీ
పందిరి కిందికి తెచ్చి తీయ్యగ జేసినవ్….
మూడు కాళ్ళ అవ్వకు ఆసరా పింఛను అప్పజెప్పినవ్…
ఆడ బిడ్డకు కల్యాణ లక్ష్మి కట్నం ముట్ట జెప్పినవ్…
నాగలి వట్టే రైతన్నలకు భుజాన
రైతుబంధు తువ్వాల కప్పినవ్….
దళిత బంధువెట్టి ఓ దారి సూపినవ్….
సర్కారు బళ్ళను శుద్ధి చేసినవ్…
ఎన్నని చెప్పమంటవ్ సారు..
కట్టాల తెలంగాణను కళ్ళకద్దుకొని నువ్వు దిద్దుకస్తే…
ఓర్వలేనోల్ల మాటలు తుమ్మముల్లు లెక్క గుచ్చుతాంటే సుతం
ఈ గడ్డ కోసమే ఈ బక్కపానమనే
నీ మంకు పట్టు జన్మ
మా అందరి కోసమే కదా….
-తుమ్మల కల్పన రెడ్డి
96404 62142