కేసీఆర్ను మన కాలపు స్వాప్నికునిగా ఎందుకు భావించాలి? దేశంలోని ప్రతి ఎకరం తడిసి, ప్రతి కడుపు నిండాలని, దేశంలో సమృద్ధిగా గల సహజ వనరులు, మానవ వనరులు వినియోగంలోకి వచ్చి ఈ దేశం అగ్ర రాజ్యాల సరసన నిలవాలని తపిస్తూ, అందుకోసం తనతో ఏకీభవించే శక్తులను దేశవ్యాప్తంగా ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నందున ఆయన తప్పకుండా ఒక స్వాప్నికుడవుతారు. స్వతంత్ర భారతంలో ఒక దేశవ్యాప్తమైన స్వప్నం ఉండిన నెహ్రూ తర్వాత, తిరిగి అటువంటి కలలు కంటున్న నాయకుడు కేసీఆర్ తప్ప మరొకరు ఎంత వెతికినా కన్పించరు. ఆ విధంగా ఆయన, గతకాలపు నెహ్రూ తర్వాత మనకాలపు స్వాప్నికుడవుతున్నారు.
ఒకసారి ఈ 75 ఏండ్ల రాజకీయ చరిత్రను తరచి చూడాలి. కేంద్ర స్థాయిలో, రాష్ర్టాల్లో మంచి నాయకులు, బలమైనవారు అనేకులు కన్పిస్తారు. బాగా పాలించినవారు, అభివృద్ధిని సాధించినవారు, సగ టు మనిషికి తగినంత మేలు చేసినవారు కూడా ఉన్నారు. అసమర్థులకు, స్వార్థపరులకు, అవినీతిపరులకు, ప్రజలకు హాని చేసినవారికి కొరత లేదు. అదే సమయంలో మరొకవైపు మంచి పాలకులు కూడా కన్పిస్తారు. అయితే, మంచి పాలకులు కావటం వేరు, స్వాప్నికులు కావటం వేరు. మంచి పాలకులు తమ పరిధిలో తాము బాగా పాలిస్తారు. నూటికి నూరు శాతం కాకున్నా తగినంత చేసి నవారున్నారు. అదేవిధంగా తమ పరిధి అనేది ఒక రాష్ట్రం తరహాలో భౌగోళికమైనది కావ చ్చు, లేదా ఒక శాఖ తరహాలో పరిపాలనా సంబంధమైనది కావచ్చు. వీటన్నింటికి భిన్నం గా మొత్తం దేశవ్యాప్తమైన స్థితి గురించి మనం ఇక్కడ ఆలోచిస్తున్నాం. అంతే ముఖ్యంగా, బాగా పాలించటం వేరు, ఒక దార్శనికతతో మొత్తం దేశం కోసం కలలు కనటం వేరు. తమ పరిధిలో తాము కలలు కనటానికి మిం చినది ఇది. ఒక పరిమితికి లోబడి కలలు కనటం వేరు, పరిమితులు లేని కలలు కనడం వేరు. ఆ వివరాలను కింద చూద్దాము.
జాతీయ స్థాయిలో చూసినపుడు ఈ 75 ఏండ్లలో నెహ్రూ నుంచి నరేంద్ర మోదీ వరకు 15 మంది ప్రధానమంత్రులు కన్పిస్తారు. వారిలో నికరంగా తగినంత కాలం ఉన్నవారు నెహ్రూ, ఇందిర, రాజీవ్, నరసింహారావు, వాజపేయి, మన్మోహన్, మోదీ. నెహ్రూ మినహా తక్కినవారికి కొన్ని మంచి రికార్డులు, కొన్ని అవాంఛనీయమైన రికార్డు లు రొటీన్ పద్ధతిలో అయితే ఉన్నాయిగాని వారిలో ఎవరినీ నెహ్రూ వలె స్వాప్నికుడని అనలేం.
నెహ్రూ కన్న కలలనే తిరిగి ఇపుడు కంటున్న నాయకుడు కె.చంద్రశేఖరరావు. ఆ లక్ష్యాలేమిటో సమగ్రమైన రీతిలో చిత్రీకరించే మేనిఫెస్టో వంటిది ఇంకా వెలువడవలసి ఉన్నా, వాటిని రేఖామాత్రంగా అయినా స్పష్టంగా సూచించే ప్రసంగాలు తగినన్ని ఆయన ఇప్పటికే చేశారు.
రాజీవ్ కలలు టెక్నాలజీకి, పీవీ, మన్మోహన్ల కలలు పెట్టుబడిదారీ వ్యవస్థకు పరిమితమయ్యాయి. మోదీ కలలు ఆశ్రిత పెట్టుబడిదారి విధానంతో పాటు మత తత్వ రాజ్యస్థాపనకు సంబంధించినవి. అంతే తప్ప వీరెవ్వరూ, పైన చెప్పుకొన్నట్లు, దేశంలోని ప్రతి గొంతు ప్రతి ఎకరం తడిసి ప్రతి కడుపు నిండాలని గాని, దేశ వనరులను మనమే పట్టుదలగా వినియోగంలోకి తెచ్చుకొని ఒక అగ్రరాజ్యంగా నిలిచి తీరాలని గాని కలలు గని అందుకోసం తపించి శ్రమించినవారు కాదు. ఆ విధంగా తపిం చి, శ్రమించినప్పటికీ పరిస్థితుల కారణంగా పాక్షిక విజయాలే సాధ్యం కావచ్చు గాక. కానీ ఆ దిశలో ఒక దార్శనికతతో కృషిచేశారా లేదా అన్నదే మాలికమైన ప్రశ్న.
ఇక రాష్ర్టాల విషయానికి వస్తే.. కొన్ని విషయాల్లో జాతీయస్థాయి వారి కన్నా గొప్ప నాయకులు కనిపిస్తారు. అణగారిన సామాజికవర్గాలను, పీడనకు గురయ్యే వర్గాలను, వివిధ వృత్తి వర్గాలను, ప్రాంత పరమైన, భాషా సాంస్కృతిక పరమైన, జాతుల పరమైన వర్గాలను ఏకం చేసేందుకు, వారి హక్కులను కాపాడేందుకు, వారికి అధికారం లో భాగస్వామ్యం సంపాదించేందుకు, వారి కోసం అభివృద్ధినీ, సంక్షేమాన్ని సాధించేందు కు ఉద్యమించినవారు, పార్టీలు స్థాపించినవారు ఎందరో ఉన్నారు. వారిలో కొందరు ప్రభుత్వాలు ఏర్పాటుచేసి తమ లక్ష్యాల కోసం తగినంత పాటుపడ్డారు. ఇంకొందరు రాష్ర్టాల ఫెడరల్ అధికారాల కోసం గట్టిగానే పట్టుబట్టారు. ఇవన్నీ నేటికీ కొనసాగుతున్నా యి. ఇవన్నీ కూడా లక్ష్యాలు, వాటితో కూడిన కలలే. కానీ ఆయా అంశాలకు పరిమితమైన కలలు. మొత్తం అన్ని అంశాలకు, యావత్ దేశమంతటికీ, సుదూర భవిష్యత్తుకూ వర్తించే సమగ్రమైన దార్శనికతతో కూడిన భారతీయ స్వప్నం కాదది.
నెహ్రూ మినహా తక్కినవారికి కొన్ని మంచి రికార్డులు, కొన్ని ఆవాంఛనీయరికార్డులు ఉన్నాయి. వారిని నెహ్రూ వలె స్వాప్నికుడని అనలేం. రాజీవ్ కలలు టెక్నాలజీకి, పీవీ, మన్మోహన్ల కలలు పెట్టుబడిదారీ వ్యవస్థకు పరిమితమయ్యాయి. మోదీ కలలు ఆశ్రిత పెట్టుబడిదారి విధానంతో పాటు మత తత్వ రాజ్యస్థాపనకు సంబంధించినవి.
వందల ఏండ్ల దేశ చారిత్రక, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ నేపథ్యాలు, ప్రజ ల నిరంతర ఉద్యమాల ఫలితంగా రూపు తీసుకున్న దేశ స్వాతంత్య్రం, ఆధునిక పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ఒక మహత్తర రాజ్యాంగాల సారాంశమే నెహ్రూ ఈ దేశం కోసం కన్న కలలలో ప్రతిఫలించింది. నెహ్రూ కన్న కలలనే తిరిగి ఇపుడు కంటున్న నాయకుడు కె.చంద్రశేఖరరావు. ఆ లక్ష్యాలేమిటో సమగ్రమైన రీతిలో చిత్రీకరించే మేనిఫెస్టో వంటిది ఇంకా వెలువడవలసి ఉన్నా, వాటిని రేఖామాత్రంగా అయినా స్పష్టంగా సూచించే ప్రసంగాలు తగినన్ని ఆయన ఇప్పటికే చేశారు. శ్రద్ధగా వినేవారికి, చదివేవారికి ఆ సారాంశం ఇప్పటికే బోధపడి ఉండాలి. ఒకసారి ఆ పని జరిగితే అందులోని కొత్తదనం ఏమిటో, అది ఏ విధంగా కేవలం అధికార రాజకీయాలకు, అధికార సాధనకు, అందుకోసం కూటముల ఏర్పాటుకు పరిమితమయ్యే గతకాలపు రాజకీయం వంటిది కాదో, మొదట చెప్పిన కలల అజెండాను కేంద్రంగా చేసుకొని ప్రజల కోసం, దేశం కోసం మౌలికమైన రీతిలో ఆలోచించేదో అర్థం కాకమానదు. నెహ్రూ తర్వాత తిరిగి మన కాలంలో సాగుతున్న ఈ ఆలోచన ఫలించటం ఈ దేశానికి అవసరం.
-టంకశాల అశోక్ , 98481 91767