కేటీఆర్.. జన్మతః నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్న నాయకుడు. రాష్ర్టాభివృద్ధి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఎంతకైనా తెగించి అనుకున్నది చేసి చూపే మొండితనం ఆయనది. అందుకే ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడమే ఆలస్యం.. ప్రపంచంలోని పలుదేశాల పారిశ్రామివేత్తలను తన వాక్పటిమతో మెప్పించి, ఒప్పించి రాష్ర్టానికి రప్పిస్తున్నారు. ఇప్పుడు ఆయన కృషితోనే తెలంగాణకు పెట్టుబడులు వరదలా వెల్లువెత్తుతున్నాయి.
మచ్చుకు ఒకటి తీసుకుంటే.. మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలో భాగంగా 2022 మే 18న తొలుత లండన్ వెళ్లారు. బ్రిటన్-భారత్ వాణిజ్య మండలి రౌండ్‌టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానించారు. భారత రాయబారి ఏర్పాటుచేసిన వాణిజ్యవేత్తలు, ఎన్నారైల సమావేశాల్లోనూ పాల్గొన్నారు. దావోస్ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు లండన్ నుంచి స్విట్జర్లాండ్ బయల్దేరారు. 2022 మే 23న దావోస్ సదస్సుకు హాజరయ్యారు. 28 వరకు జరిగిన ఈ సదస్సులో భాగంగా కేటీఆర్ తెలంగాణ పెవిలియన్‌లో 45 మంది పారిశ్రామికవేత్తలు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కుదిర్చారు. దీంట్లో భాగంగా దాదాపు రూ.4,200 కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ర్టానికి వచ్చాయి. ప్రపంచ ఆర్థికవేదికపై తెలంగాణ ప్రభుత్వ విధానాలను వివరించి పెట్టుబడులను సాధించడంలో కేటీఆర్ చేసిన ఈ పర్యటన ఎంతగానో దోహదపడింది.
తెలంగాణ రాష్ర్టాభివృద్ధికి అవిరళ కృషి చేస్తున్నారు కేటీఆర్. టీఎస్ఐపాస్ లాంటి వినూత్న, విప్లవాత్మక ఆలోచనల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఐటీ అభివృద్ధి కేవలం రాజధానికే పరిమితం కాకుండా రాష్ట్ర నలుదిశలా విస్తరించడంలో కేటీఆర్ పాత్ర అద్వితీయం. టీఎస్ఐపాస్ ద్వారా ఇప్పటివరకు సుమారు 16 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభించాయి. కేసీఆర్ పాలనాదక్షత, కేటీఆర్ ఆధునిక దృక్పథంతో అన్నిరంగాల్లో తెలంగాణ దేశంలోనే విజయవంతమైన రాష్ర్టాల్లో ముందువరుసలో ఉన్నది. ఈ విధంగా తెలంగాణను అభివృద్ధి బాటలో ముందుకుతీసుకెళ్తున్న రామన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
-పాలె నిషా ,87908 75393