నాశనమవుతున్న వ్యవస్థను కాపాడటానికి ఒకరు వస్తారు. ఆయనే కేసీఆర్. ‘ఏక్ కేసీఆర్.. సబ్ కా దీదార్’. ఇది యావత్ దేశ ప్రజలు అంటున్న మాట. పతనమవుతున్న రూపాయి, పాతాళానికి తొక్కేయబడిన జీడీపీ, లౌకికత్వం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ, మానవతా విలువలు, పేదరికం కేసీఆర్ చేయూత కోసం ఎదురుచూస్తున్నాయి. రాబందుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న దేశాన్ని ఆయనే విముక్తం చేస్తాడని, ఆదుకుంటారని వారి నమ్మకం.
అచ్చే దిన్ ఆయేంగే’ వంటి మోసపూరిత నినాదాలను నమ్మి నట్టేట మునిగామంటూ ఇప్పుడు దేశ ప్రజలు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. విద్వేషాన్ని రగిల్చి విషం గక్కుతూ, పేద ప్రజలను అరిగోస పెడుతున్న పాలకులకు చెక్ పెట్టే సామర్థ్యం ఒక్క కేసీఆర్‌కే ఉన్నదని దేశ ప్రజలు విశ్వసిస్తున్నారు. యువతను రెచ్చగొడుతూ, మతాల మధ్య చిచ్చుపెడుతూ, పేదోళ్లను దోచి, ఉన్నోడికి ఊడిగం చేస్తున్నవారికి చరమగీతం పాడేదెవరు? ప్రశ్నించేవారిని జైళ్లపాలు చేసి రాక్షసానందం పొందే ఈ దురహంకార, ఫాసిస్టు పాలనను అంతమొందించేదెన్నడని మేధోవర్గం ఆతృతగా ఎదురుచూస్తున్నది. మసక బారుతున్న చీకట్లను చీల్చుకుని నేనున్నానని భరోసా ఇస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. కుక్కలు చింపిన విస్తరిలా మారిన దేశాన్ని గాడిలో పెట్టేందుకు పిడికిలి బిగించి కదులుతున్నారాయన. ఈ నీచ రాజకీయాలను ప్రక్షాళన చేసి ‘నయా భారత్’ నిర్మిస్తానంటున్న కేసీఆర్‌కు అండగా దేశ ప్రజలు నిలువాల్సిన అవసరం ఎంతో ఉన్నది.
తెలంగాణ భౌగోళిక, ఆర్థిక స్థితిగతులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి రాష్ర్టాన్ని అభివృద్ధి బాట పట్టించిన ఘనత కేసీఆర్‌ది. తెలంగాణను కేసీఆర్ ఏం అభివృద్ధి చేశారని బీజేపీ నేతలు పైకి తప్పుడు ఆరోపణలు చేస్తుండవచ్చు. కానీ వారికి తెలియదా ఊరూరా, ఇంటింటా.. ‘మిషన్ భగీరథ’ మంచినీళ్లు వస్తున్నాయని? పూడుకుపోయిన చెరువులు ‘మిషన్ కాకతీయ’తో పూర్వకళను సంతరించుకొని రైతులకు ఆదెరువుగా మారాయని? ‘రైతుబంధు’, ‘దళితబంధు’, ‘రైతుబీమా’ వంటి పథకాలు నేరుగా లబ్ధిదారులందరికీ ఆపన్నహస్తం అందిస్తున్నాయని వారికి తెలియదా? రాష్ట్రంలో 24 గంటల నిరంతర, నాణ్యమైన విద్యుత్ అందుతున్నది. కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ ఎందరో పేదింటి ఆడబిడ్డలకు ఆసరాగా నిలుస్తున్నది. వృద్ధాప్య పింఛన్లు, ‘కేసీఆర్ కిట్’ లాంటి బృహత్తర పథకాలను చూస్తున్న బీజేపీ నాయకులు ఆరోపణలు చేయాలనే చేయడం తప్ప, తమ పార్టీ పాలిస్తున్న ఇతర రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు లేవని వాళ్లకు మాత్రం తెలియదా? కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ప్రజా సంక్షేమ పథకాలను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలే కాదు, చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టింది.
కేసీఆర్‌కు ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నది, దానికి అడ్డుకట్ట వేయాలంటే ఏదో ఒకటి చేయాలి. అందుకోసమే తెలంగాణ ప్రజల్లో విద్వేషం రగిల్చాలి, మతచిచ్చులు రేపాలి. బీజేపీ ఆదినుంచి అవలంబిస్తున్న తీరు అదే. ఐక్యంగా ఉన్న ప్రజల నడుమ చిచ్చురేపుతూ రాజకీయ లబ్ధి పొందజూస్తున్నది. హిందూ, ముస్లిం.. మందిర్, మసీదుల చుట్టూ బీజేపీ నాయకులు రాజకీయం చేస్తూ ప్రశాంతంగా, పచ్చగా ఉన్న తెలంగాణను భగ్గుమని మండించేందుకు కాలకేయ సైన్యంలా పావులు కదుపుతున్నారు. హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకొని నియంతగా వ్యవహరిస్తున్న మోదీ పాలనకు గుడ్ బై చెప్పే రోజులు దగ్గర పడ్డాయి.
సబ్జెక్టు లేనివాళ్లు ఏం చేస్తారు? విషయాన్ని దారి మళ్లిస్తారు. బీజేపీ నేతలు కూడా అదే చేస్తున్నారు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పలేక ముస్లింల మీద పడుతున్నారు. ముస్లింలు ఏం పాపం చేశారు. టైర్ పంక్చర్లు చేస్తూ.. మిషన్లు కుట్టుకుంటూ వారి బాధలేవో వారు పడుతున్నారు.దేశవ్యాప్తంగా బీజేపీ నేతల స్టేట్మెంట్లు అభివృద్ధి గురించి ఉండవు. కేవలం ముస్లింల మీద విద్వేషమే. అలా వారు పెంచిపోషిస్తున్న విద్వేషం దేశాన్ని గత ఎనిమిదేండ్లుగా అధోగతి పాల్జేస్తున్నది. మన దేశానికి ఇప్పుడు ప్రేమ కావాలి. విశ్వవ్యాప్తమైన మన భారతావని ప్రేమ, మానవత, లౌకికత్వాన్ని మళ్లీ పునఃప్రతిష్ఠించే ఏకైక నేత కేసీఆర్. ఆయన ఈ దేశానికి ప్రధాని అయితే తప్ప వందేండ్లు వెనక్కు వెళ్లిన దేశాన్ని గాడిలో ఎవరూ పెట్టలేరు.
తెలంగాణ అభివృద్ధి గురించి పల్లెత్తు మాట మాట్లాడని బీజేపీ నాయకులు తెలంగాణను ఉద్ధరిస్తారా? ఉద్యమ నాయకుడు, తెలంగాణ గాంధీ కేసీఆర్‌ను విమర్శిస్తారా? ఆయనకు ఎంతో ముందుచూపున్నది. దేశంలోని ప్రతి రాష్ట్రంపై లోతైన అవగాహన ఉన్నది. దేశానికి ప్రధాని కావడానికి గల అర్హతలన్నీ కేసీఆర్‌లో ఉన్నాయి. అందుకే కదా దేశ ప్రజలు ‘తెలంగాణ మోడల్’ అని నినదిస్తున్నారు. వక్త, విషయ పరిజ్ఞానం ఉన్న మేధావి. అన్నివర్గాల ప్రజలను కలుపుకొని పోయే నైజం కేసీఆర్ సొంతం. ఒక నికార్సైన నాయకునికి ఉండాల్సిన లక్షణాలు ఆయనలో పుష్కలం. హైదరాబాద్‌లో అడుగుపెట్టిన మోదీ కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు జవాబు లు చెప్పలేకపోయారు. బీజేపీ నాయకులకు తెలిసిం ది కేవలం హిందూ ముస్లింల మధ్య అగ్గిరాజేయడమే. కానీ దేశ ప్రజలు అమాయకులు కాదు కదా, బీజేపీ నేతలు చేసే ఆగడాలను గమనిస్తున్నారు.
సబ్జెక్టు లేనివాళ్లు ఏం చేస్తారు? విషయాన్ని దారి మళ్లిస్తారు. బీజేపీ నేతలు కూడా అదే చేస్తున్నారు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పలేక ముస్లింల మీద పడుతున్నారు. ముస్లింలు ఏం పాపం చేశారు. టైర్ పంక్చర్లు చేస్తూ.. మిషన్లు కుట్టుకుంటూ వారి బాధలేవో వారు పడుతున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ నేతల స్టేట్మెంట్లు అభివృద్ధి గురించి ఉండవు. కేవలం ముస్లింల మీద విద్వేషమే. అలా వారు పెంచిపోషిస్తున్న విద్వేషం దేశాన్ని గత ఎనిమిదేండ్లుగా అధోగతి పాల్జేస్తున్నది. వారిలో పేట్రేగిపోతున్న ద్వేషం ఆ ఎరుకను కప్పేస్తున్నది. అందుకే మన దేశానికి ఇప్పుడు ప్రేమ కావాలి. విశ్వవ్యాప్తమైన మన భారతావని ప్రేమ, మానవత, లౌకికత్వాన్ని మళ్లీ పునఃప్రతిష్ఠించే ఏకైక నేత కేసీఆర్. ఆయన ఈ దేశానికి ప్రధాని అయితే తప్ప వందేండ్లు వెనక్కు వెళ్లిన దేశాన్ని గాడిలో ఎవరూ పెట్టలేరు. దేశానికి పూర్వవైభవం, అంతకుమించిన అభివృద్ధిని కాంక్షిస్తున్న మనం కేసీఆర్‌కు జై కొట్టాల్సిందే. ‘జై కేసీఆర్..’ తూహీ హై ఇస్ దేశ్ కా సికిందర్.
– హుమాయున్ సంఘీర్