ఉద్యమ సమయంలో ‘సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి’ అంటూ రాష్ట్ర ఆవిర్భావ అనంతర తెలంగాణను కలలుగన్నాం. అచ్చం ఆ పాట వలె నేడు తెలంగాణ అన్నిరంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నది. రాదనుకున్న తెలంగాణను సాధించడమే గర్వించదగిన విషయమనుకొంటే,వచ్చిన తెలంగాణను దేశానికే తలమానికంగా అభివృద్ధి చేయడం ఒక గొప్ప అచీవ్మెంట్ అనే చెప్పాలి.
వైద్యాన్ని రాజధానికే పరిమితం చేయకుండా వరంగల్ లాంటి ద్వితీయ శ్రేణి నగరంలో 2200 పడకల సూపర్ మల్టీ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం చేపట్టి దసరాకు ప్రారంభించుకోనున్నాం.జిల్లా కేంద్రాల్లో జిల్లా దవాఖానలను అప్ గ్రేడ్ చేసి మెరుగైన వైద్య సేవలు అందే విధంగా చర్యలు చేపట్టింది సర్కార్. ఇది పేదలపై ప్రభుత్వానికి,ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.
ప్రపంచవ్యాప్తంగా అన్నిరంగాల్లో పోటీ పెరిగిం ది. ధనవంతులు ఎలాగైనా లక్షలు ఖర్చుచేసి గొప్పగా విద్య, వైద్యాన్ని పొందుతారు. కానీ పేద విద్యార్థులకు మెరుగైన విద్య, వైద్యం తీరని కోరికే. తెలంగాణలో అధిక శాతం మందికి వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరు. సమైక్య రాష్ట్రంలో అప్పుల సాగుతో రైతుల ఆత్మహత్యలు, వైద్యంలో అరకొర వసతులు, విద్యలోనూ వివక్షే ఎదురైంది. అన్నిరంగాల్లో తెలంగాణ వెనక్కి నెట్టివేయబడింది. తెలంగాణ ఏర్పాటుతో ఆ వెనుకబాటు మరుకలను తొలగిస్తూ వస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన చేపట్టాక ఉద్యమ లక్ష్యాలైన నీళ్లు, నిధులు, నియామకాలపై దృష్టి సారించారు. ముందుగా తెలంగాణ ఆదాయ వనరైన వ్యవసాయాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు.
వ్యవసాయం: దేశానికి రైతు వెన్నెముక కానీ దేశంలో రైతుకు వెన్నెముక విరిగే పరిస్థితి తీసుకువచ్చా రు ఈ దేశ పాలకులు. ‘ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం’ బాగుండదంటారు. ఈ దేశంలో రైతులపై అణచివేతలు, దాడులు.. హక్కులడిగితే వెక్కిరింతలు. కానీ తెలంగాణలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. స్వరాష్ట్ర సాకారం తర్వాత వ్యవసాయ అవసరాలను ఒక్కొక్కటిగా బాగుచేస్తూ వచ్చారు కేసీఆర్. అనతికాలంలోనే 24 గంటల ఉచిత, నిరంతరాయ విద్యుత్తునందించి దేశంలోనే ప్రకంపనలు సృష్టించారు. అంతటితో ఆగలే దు.
కరెంట్‌తో పాటు నీళ్లున్నప్పుడే పంటలు బాగా పం డుతయని మిషన్ కాకతీయతో 46 వేల చెరువుల పూడికతీత చేపట్టి నీటినిల్వ సామర్థ్యం పెంచారు. చెరువులకు పూర్వవైభవం తీసుకువచ్చారు. ఆ చెరువులు నిండాలంటే ప్రాజెక్టుల నిర్మాణమే మేలని గోదావరి నదిపై ‘కాళేశ్వరం లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు’ నిర్మించారు. అంతే కాకుండా రాష్ట్రంలో పెండింగులో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి మండే ఎండల్లో చెరువులు, చెక్‌డ్యామ్‌లు మత్తళ్లు దుంకేలా చేశారు కేసీఆర్.
పంట పెట్టుబడికి డబ్బుల్లేక రైతులు ఆత్మహత్యల పాలైన చరిత్రలెన్నో. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత రైతుబంధుతో ప్రభుత్వమే పంటకు పెట్టుబడి సాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దురదృష్టవశాత్తూ రైతు కాలం చేస్తే రూ.5లక్షల బీమా సహాయాన్ని ఆ కుటుంబానికి అందేలా సౌకర్యం కల్పించారు. ఇలా వ్యవసాయ రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన సంస్కరణలు ఫలించి దేశానికే నేడు తెలంగాణ అన్నం పెట్టే స్థితికి ఎదిగింది. దేశంలో పండే ధాన్యంలో అగ్రస్థానం తెలంగాణ పండిస్తున్నది. తెలంగాణ దేశానికే ధాన్య భాండాగారంగా నిలిచింది. ఇది కేసీఆర్ మార్క్ పాలనకు నిదర్శనం.
విద్య: ఒకనాడు సర్కారు బడులంటే ప్రజల్లో అపనమ్మకం, సర్కారు హాస్టళ్లు అన్నా చిన్నచూపు. అక్కడ ముక్కిపోయిన బియ్యం, పురుగులన్నం పెడ్తరని జనం ఆసక్తి చూపేవారు కారు. కానీ స్వరాష్ట్ర సాధన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారు.
పేదలకు నాణ్యమైన విద్య అందాలనే ఉద్దే శంతో సమైక్య రాష్ట్రంలో 200 కూడా లేని గురుకుల పాఠశాలలను ఎనిమిదేండ్లలో 1000కి పెంచి పేదలకు ఉచితంగా నాణ్యమైన కార్పొరేట్ విద్యనందిస్తున్నారు. సర్కారు గురుకులాలు, బడుల్లో సన్నబియ్యంతో నాణ్యమైన భోజనాన్ని అందజేస్తున్నారు. ‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి.
పాఠశాలల్లో వసతుల కల్పన, డిజిటల్ ఇంగ్లీష్ మాద్యమ బోధనతో గురుకులాల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. ఇవ్వాళ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ లేవంటూ బోర్డులు వెలుస్తున్నాయంటే కేసీఆర్ మార్క్ పాలనకు నిదర్శనంగా చెప్పవచ్చు.
వైద్యం: విద్య తర్వాత పేదలకు కావాల్సింది మెరుగైన వైద్యం. నేడున్న పరిస్థితుల్లో కార్పొరేట్ వైద్యం కాసుల వైద్యంగా మారింది. సమైక్య పాలనలో ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన’కు అనే స్థితి నుంచి మెరుగైన వసతుల కల్పనతో ‘నేను పోత బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే స్థితికి తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో హరీష్ రా వు లాంటి చురుకైన మంత్రికి బాధ్యతలు అప్పజెప్పి అద్భుత ఫలితాలను రాబడుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.
ప్రభుత్వ దవాఖాల్లో వసతుల కల్పన, పడకల సామర్థ్యం పెంపు, పల్లెల్లో పల్లె దవాఖానలు, పట్టణాల్లో బస్తీ దవాఖానలు, నియోజకవర్గ దవాఖానాల్లో పడకల పెంపు, ఆక్సిజన్ బెడ్స్ ఇలా వసతుల కల్పన చేపట్టి పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నది. మాతా శిశు సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టి శిశుమరణాలు తగ్గించింది సర్కార్. గర్భిణీల కోసం న్యూట్రిషన్ కిట్, పిల్లలకు కేసీఆర్ కిట్ అందిస్తున్నది. వైద్యాన్ని రాజధానికే పరిమితం చేయకుండా వరంగల్ లాంటి ద్వితీయ శ్రేణి నగరంలో 2,200 పడకల సూపర్ మల్టీ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం చేపట్టి దసరాకు ప్రారంభించుకోనున్నాం. జిల్లా కేంద్రాల్లో జిల్లా దవాఖానలను అప్‌గ్రేడ్ చేసి మెరుగైన వైద్యసేవలందే విధంగా చర్యలు చేపట్టింది సర్కార్. ఇది పేదలపై ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కున్న చిత్తశుద్ధికి నిదర్శనం.
సమైక్య రాష్ట్రంలో ఐదు మెడికల్ కళాశాలలుండేవి. వైద్యవిద్య పేదలకు అందని ద్రాక్షే. కానీ, నేడు తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎనిమిదేండ్లలో కేంద్రం ఎలాంటి సహకారం అందించకున్నా 29 మెడికల్ కళాశాలలు నిర్మించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. జిల్లాకో మెడికల్ కళాశాల ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇది కేసీఆర్ పరిపాలనాదక్షతకు నిదర్శనం.
జెన్సీ ప్రాంతమైన ములుగు, మారుమూల నియోజకవర్గం నర్సంపేటలోనూ మెడికల్ కళాశాలల ఏర్పా టు గొప్ప విషయం. నిరుపేద బిడ్డలకు వైద్యవిద్యను చేరువ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రుణం తీర్చుకోలేనిది. ఒకనాడు మెడికల్ సీటు దొరకాలంటే కోట్ల ముచ్చట. కానీ నేడు ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీలు కలుపుకొని రాష్ట్రంలోనే 10 వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రజా అవసరాలు, ప్రజల ఆశలు, ఆశయాలకనుగుణంగా కేసీఆర్ పాలన సాగిస్తున్నారు. అన్నిరంగాల్లో తెలంగా ణ సాధించిన ప్రగతి, ఆ ప్రగతి ఫలా లు పొందిన ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తారు. ఒక్క రాష్ర్టానికే కాదు, దేశానికి తెలంగాణ మాడల్‌ను పరిచయం చేస్తారు. ఇదీ పక్కా. ఇదే కేసీఆర్ మార్క్ పాలన.
తెలంగాణ విజయ్
94919 98702