పండుగంటే ఇంటిల్లిపాదికి సంతోషం. అందులోనూ తెలంగాణలో బతుకమ్మ పండుగంటే ఆడబిడ్డలకు సంబురమే. అయితే, ఈ సంబురమంతా గత వైభవంగా మార్చేసింది ప్రస్తుత సర్కారు. ఆరు గ్యారెంటీలంటూ, అందులో సింహభాగం మహిళలకే అంటూ ఊదరగొట్టి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ మాత్రం చేస్తానన్నవి చేయకపోగా ఉన్నవీ ఊడబీకింది.
మహిళలను అగౌరవపర్చడంలో కాంగ్రెస్ పార్టీ శైలే వేరు. 2023 ఎన్నికల్లో గట్టెక్కేందుకు కాంగ్రెస్ అడ్డగోలుగా హామీలిచ్చింది. ముఖ్యంగా మహిళలను ఆకర్షించడానికి ఎన్నెన్నో పథకాలను ప్రకటించింది. మహాలక్షీల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ నేడు ఆ మహాలక్షీలను మాయజేస్తున్నది. 100 రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలు అటకెక్కాయి. మరీ ముఖ్యంగా మహాలక్ష్మి పేరిట మహిళలకు నెలనెలా ఇస్తామన్నా రూ.2500 హామీకి రెండేండ్లవుతున్నా అతీగతీ లేదు.
ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది తెలంగా ణ బిడ్డల ఆత్మగౌరవానికి సూచీ లాంటి ఆస రా పింఛన్ల పథకం. నాడు కాంగ్రెస్ ముష్టివేసినట్టుగా రూ.200 విదిల్చేది. దాన్ని కేసీఆర్ సర్కార్ రూ.2 వేలకు పెంచింది. ఏ అవ్వ కూడా బతుకీడ్చేందుకు ఎవ్వరి దగ్గర చెయ్యి చాచకూడదనే గొప్ప మనసుతో కేసీఆర్ ఆ పథకాన్ని ప్రారంభించారు. కానీ, ఆసరా మొత్తాన్ని రూ.4 వేలకు పెంచుతామని మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ సర్కార్ ఇంతవరకూ దాని గురించి కనీసం ఆలోచించడం లేదు. ఇక రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీ కొన్ని నెలలకే ఉత్తగ్యాసేనని తేలిపోయింది. కేంద్ర సర్కార్ మాదిరి మొదట రెండు వందలు వేసిన సబ్సిడీ బక్కచిక్కి నేడు నలభై రూపాయలకొచ్చినట్టు, గత మూడు నెలలుగా రాష్ట్ర సర్కార్ సబ్సిడీ జాడ కనబడట్లేదు.
ఒకనాడు తెలంగాణ తల్లులు బిడ్డల పెండ్లి కి పడ్డ కష్టాలను కండ్లారాజూసిన కేసీఆర్ ఆ బాధలు పోవాల్నని సంకల్పించి కల్యాణలక్ష్మి పథకానికి అంకురార్పణ చేశారు. లక్షకు తో డు తులం బంగారం ఇస్తామని కోతలు కోసిన కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి ఎసరు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నది. పేరు గొప్ప ఊరు దిబ్బలాగా ‘ఇందిరమ్మ ఇండ్లు’ ప్రహసనంలా మారిన వైనాన్ని మనం చూస్తూనే ఉన్నాం. యువవికాసంలో భాగంగా ఆడబిడ్డలకు ఇస్తానన్న స్కూటీలు ఇవ్వలేదు. ఇక తెలంగాణలోని 98 శాతం చిన్న, సన్నకారు రైతుల్లో మహిళలే అధికం. వారికి ఇప్పటికే రెండు విడతల రైతుబంధును ఎగ్గొట్టి ఎకరా కు రూ.30 వేలను సర్కార్ బాకీపడ్డది. చివరకు యూరియాను సైతం ఇవ్వలేక ఆ లైన్లలో మా ఆడబిడ్డలు గేట్లు దుంకేలా… చెప్పులు పెట్టేలా… సొమ్మసిల్లేలా చేస్తున్నది. ఇలా చెప్పుకుంటూపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలకు చేస్తున్న దగా అంతాఇంతా కాదు.
అయినా కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఆడబిడ్డల ను నిరాదరణకు గురిచేయడం దాగున్నదే మో. స్వరాష్ట్రంలో అతి తక్కువ కాలంలోనే మహిళలకు స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చి కేసీఆర్ మమ్మల్ని ప్రోత్సహి స్తే… ఎప్పుడో 1990వ దశకంలో ప్రతిపాదించిన మహిళా బిల్లునే మూలనపడేసి, మహిళలకు ఎగనామం పెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ది. పేరుకు ఇందిరాగాంధీ ప్రధాని అని, సోనియాగాంధీ పార్టీ అధినేత అని గాంధీ తోకల ను తగిలించుకున్న ఆ కుటుంబాన్ని కీర్తించ డం తప్ప, నిజమైన భారత మహిళను ఇప్పటివరకూ గౌరవించిందీ లేదు. కనీసం తెలంగాణ పెద్ద పండుగ బతుకమ్మనైనా వారికి కనువిప్పు కలిగించాలి. ఒకనాడు నిజాంకు నిరసనగా బతుకమ్మ ఆడింది ఈ ప్రాంతం. మహిళల తెగువను కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలి. ఇకనైనా మహిళల పేరిట చేస్తున్న మోసాలకు చరమగీతం పాడాలి. లేదంటే మా బతుకమ్మల తెగువేంటో… మా ఆడబిడ్డల ైస్థెర్యం ఎలాంటిదో రాబోయే రోజుల్లో ఈ సర్కార్‌కు తప్పక చూపిస్తాం.