కేసీఆర్ అంటే జన సునామీ.. ఉద్యమకాలం నుంచి కేసీఆర్ ప్రసంగాలకు మైమరచిపోనివారు లేరు. ఆయన ప్రసంగాలకు విపక్షాలే అబ్బురపడతాయి. రెండు పర్యాయాలు జనరంజకపాలన అందించిన సీఎం కేసీఆర్కు మాత్రమే తెలంగాణ ప్రజలకు ఏం కావాలో తెలుసుననేది అందరి అభిప్రాయం.
కేసీఆర్ను పట్టుకోవడం, అంచనా వేయడం అసాధ్యమైన విషయం. కేసీఆర్ అమ్ముల పొదిలో ఉండే అస్ర్తాలు వాటికి వచ్చే జనామోదం ఉద్యమకాలం నుంచి చూస్తూనే ఉన్నాం. కేసీఆర్ను తట్టుకోవటం కష్టమని విపక్ష నాయకుల అభిప్రాయం.‘ఎన్నికల్లో తాను ఇచ్చిన మాటకు కేసీఆర్ ఏ స్థ్ధాయిలో విలువ ఇచ్చి దాన్ని అమలు చేసేందుకు ఎంత వరకైనా వెళుతారని’ ప్రతిపక్ష నాయకులు విశ్లేషిస్తారు.
విపక్షాల అంచనాలు తలకిందులు చేసే కేసీఆర్ వ్యూహం అంచనా వేయటం విపక్షాలకు అంతు చిక్కదని మరోసారి స్పష్టమైంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనే కాదు గత తొమ్మిదిన్నరేండ్ల పాలనలో చేపట్టిన విప్లవాత్మక చర్యలు తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకు వచ్చా యి. 2014,2018 శాసనసభ ఎన్నికల్లో అనుసరించిన ప్రచార వ్యూహాన్నే ఈసారి కూడా కేసీఆర్ ఆచరిస్తున్నారు. ఏడుపదుల వయస్సులోను అలుపెరుగని వాగ్దాటి, ఆయన మాటే ఉప్పెన, అదే కేసీఆర్ ఆయుధం.
గత రెండు పర్యాయాలు జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ర్టాన్ని చుట్టేసిన కేసీఆర్ తాజా ఎన్నికల ప్రచారంలో చేసింది చెప్పి ఓట్లు అడిగే చేవ కలిగిన నేతగా ప్రజలు అభిమానిస్తున్నారు. జనాన్ని ఒప్పించే కేసీఆర్ ప్రసంగం, మెప్పించే చాతుర్యం ఓటర్లను ఎంతగానో ఆకర్షిస్తున్నది. ‘ఇంటికి ఒక బిడ్డను ఇవ్వాలని అడిగిన..పద్నాలుగేండ్లు పోరాడి తెలంగాణను తీసుకువచ్చి మీపాదాల ముందు ఉంచిన. రా ష్ర్టాన్ని కాకులకు, గద్దలకు వేద్దామా? ఈనగాచి నక్కలపాలు చేద్దామా? సాధించుకున్న తెలంగాణను మనమే తీర్చిదిద్దుకోవాలె.. ఆలోచించండి.. మన తెలంగాణను మనమే నిర్మించుకుందాం రాష్ట్రం లో మన ప్రభుత్వం ఉంటే మన రా జ్యం అవుతుంది. మన కల సాకారం చేసుకుందా’మంటూ కేసీఆర్ చేసే ప్రసంగాలు ప్రజలను ఆలోచనలో పడవేస్తున్నాయి.
కేసీఆర్ గొంతు వింటే ఒక ధైర్యం…ఆయన మాట్లాడితే ఒక భరోసా.. పిడికిలెత్తి నినదిస్తే ఒక ఉత్సాహం. నాయకుడికి నిర్వచనం అడిగితే కేసీఆర్ పేరు ఒకటి చాలు.అందుకే తెలంగాణ ప్రజలు ఆయన వెన్నంటి నిలిచారు. వెంట నడిచారు. కేసీఆర్కు పదవులంటే లెక్కలేదు. అందుకే తెలంగాణ కోసం పలుమార్లు రాజీనామా పత్రమై రణగర్జన చేశారు. ఎన్నికలంటే ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. తెలంగాణ ప్రజలపై ఆయనది చెక్కుచెదరని నమ్మకం. ప్రజలకూ ఆయనపై అచంచల విశ్వాసం. అంతులేని అభిమానం. అధికారిక సమావేశాల్లో రాజనీతిజ్ఞుడిగా విషయపరిజ్ఞానంతో మాట్లాడే కేసీఆర్ ఎన్నికల ప్రచార సమరాంగణంలో బక్కపలచని యుద్ధభేరిగా మారిపోయారు.
బహిరంగసభ కేసీఆర్ బహుముఖ ఆయు ధం. అందుకే ఒక్కో బహిరంగ సభ ఒక జన సునామీ. ఆసభల్లో కేసీఆర్ మాటలు ప్రత్యర్ధులపై మరఫిరంగులై పేలుతాయి. తెలంగాణను స్వప్నించి సాధించిన కేసీఆర్ గత తొమ్మిదిన్నరేండ్లలో రాష్ర్టాన్ని బంగారు తునకగా మార్చా రు. మూడో మలుపులో గెలుపు పిలుపు కోసం రణన్నినాదం చేస్తున్నారు. చెప్పింది చేసే కేసీఆర్ చేసింది, చేయబోయేది ప్రజలకు వివరిస్తున్న తీరు ఓటర్లను ముగ్ధులను చేస్తున్నది. ఆయన ప్రచారతీరు జనం గుండెల్లో గులాబీ జెండా ఎగురవేస్తున్నది.
ఒక వైపు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో విపక్షాల మైండ్ బ్లాంక్ చేసిన గులాబీ బాస్ ప్రచారం లో విపక్షాలపై అస్త్రశస్ర్తాలను సంధిస్తూ దూసుకు పోతున్నారు. యోధుడి సుడిగాలి పర్యటనతో రాష్ట్రమంతటా బీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకగా మారింది. ఎవరెన్ని చెప్పినా తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని రెండు ఎన్నికలు నిరూపించాయి. ఇప్పుడు అదే చరి త్ర పునరావృతమవుతుందనేది నిర్వివాదాంశం. ఈసారి తప్పకుండా సెంచరీ కొట్టడం ఖాయం గా కనిపిస్తున్నది.
(వ్యాసకర్త : తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్)
కోలేటి దామోదర్
98491 44406