ఈ దేశానికి స్వాతంత్య్రం ఎందరో మహానుభావుల త్యాగఫలం. ఈ 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దేశంలో అలజడులు పెరిగాయి. మతోన్మాద శక్తుల దాడులు ఎక్కువయ్యాయి. ‘మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్’ అని ప్రగల్భాలు పలికి యువతను, విద్యార్థులను పక్కదారి పట్టిస్తున్నారు. నయవంచనకు గురిచేశారు. ఈ పరిస్థితుల్లో దేశానికి ఒక ప్రత్యామ్నాయ శక్తి అవసరం. ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో ఒక ఉద్యమపార్టీగా అవతరించి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు తీర్చిన పార్టీ టీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్రంలో సాధించిన అభివృద్ధి దేశంలోనూ సాధించాలనే సంకల్పంతో కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీగా మార్చారు. మతోన్మాదుల నుంచి దేశాన్ని రక్షించాలన్న భావనతో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతుండటం శుభపరిణామం.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోని రైతులకు, దళితులకు న్యాయం జరుగాలనే సంకల్పంతో ఉన్నారు. అందులో భాగంగానే భారతదేశాన్ని ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దడానికి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా రూపాంత రం చేశారు. నవభారత నిర్మాణం జరుగాలన్న ఆకాంక్షతోనే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారనే విషయం తెలిసిందే. పీవీ వంటి ఎందరో మహనీయులకు జన్మనిచ్చిన తెలంగాణ గడ్డ కీర్తి ప్రతిష్ఠలను ఢిల్లీ స్థాయిలో నిలబెట్టాలనే బీఆర్ఎస్ పురుడు పోసుకున్నది.
ఓ పక్క ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు కోట్ల మంది తెలు గు ప్రజలు కుల రాజకీయాలతో సతమతమవుతున్నారు. అక్కడ ప్రభుత్వ వ్యవస్థలన్నీ నాశనమైపో యి కులాల కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఈ కొట్లాటలతో రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల ప్రజలు నలిగిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఉదయించే సూర్యుడిలా బీఆర్ఎస్ పార్టీ ముందుకువచ్చింది. ఆంధ్రులకు ఆశాజ్యోతిగా నిలువనున్నది. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగి తొమ్మి దేండ్లు కావస్తున్నా రాజధాని నిర్మించడంలో టీడీపీ, వైఎస్ఆర్సీపీలు విఫలమయ్యాయి. రెండు పార్టీల నాయకులు తమ నియంతృత్వ పోకడతో రాజధాని లేని రాష్ట్రం చేశారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చిన కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలు కూడా తీరుస్తారన్న ఆశలు ఆంధ్రా ప్రజల్లో చిగురిస్తున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు బడుగు, బలహీన వర్గాలకు బీఆర్ఎస్ తగిన ప్రాధాన్యం కల్పిస్తుందన్న కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆంధ్రులు బ్రహ్మరథం పట్టనున్నారు. మొన్న హైద రాబాద్‌లో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో మోగిన కరతాళ ధ్వనులు, ఈలలే దీనికి ఉదాహరణ.
ఆంధ్రలో ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచిన దళిత, వెనుకబడినవర్గాల నేతలు కనీసం తమ నియోజకవర్గాల్లో స్వతంత్రంగా పని చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారు ఏ పని చేయాలన్నా రెడ్డి, కమ్మ కులస్థుల అనుమతి తీసుకోవలసిన పరిస్థితి అక్కడ ఉన్నది. సొంత రాజకీయాలు చేయాలన్న ఆలోచనలో ఉన్న బడుగు బలహీనవర్గాల వారికి కేసీఆర్ రూపంలో బీఆర్ఎస్ ఒక వేదిక కానున్నది. రాజకీయాలను సామాన్య ప్రజలకు చేరువ చేయడంలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు విఫలమయ్యాయి. ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరిస్తారనటం లో ఎటువంటి సందేహం లేదు. ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్న టీడీపీ, వైసీపీని కాదని బీఆర్ఎస్కు ఓట్లు వేసేలా ఆంధ్రా యువత, విద్యార్థులు ముందుకు సాగుతారని నమ్మకం బలపడుతున్నది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధించాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరి. ఆ హోదా బీఆర్ఎస్తోనే సాధ్యం.
ఎన్టీఆర్ దగ్గరి నుంచి టీడీపీని చంద్రబాబు లాక్కుంటే, తన తండ్రి వైఎస్ మరణాన్ని అవకాశం గా తీసుకొని కాంగ్రెస్‌ను లాక్కున్నారు జగన్మోహన్ రెడ్డి. దానికే వైఎస్సార్సీపీ అని పేరు పెట్టారు. దొందూ దొందే.. రెండు పార్టీల విధానాలు మోసపూరితమైనవే. కానీ భారత్ రాష్ట్ర సమితి పార్టీ మేధావులు, బడుగు బలహీనవర్గాల ఆకాంక్షల నుంచి పుట్టింది. రైతుబంధు, దళిత బంధు, మిషన్ భగీరథ, సంక్షేమ హాస్టల్స్, గురుకుల పాఠశాలలు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ప్రజల జీవితాల్ని సుసంపన్నం చేస్తున్నారు కేసీఆర్. ఈ నమూనానే ఏపీతోపాటు యావత్ దేశానికి కావాలి.
తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్‌ను నెంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమం త్రి కేసీఆర్‌ది. కానీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ‘మీ రాజధాని పేరేంటి?’ అనడిగితే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. చేతగాక చేతులెత్తేసిన నాయకుడు చంద్రబాబు. మూడు రాజధానుల పేర ప్రజలను మభ్యపెట్టిన నాయకుడు వైఎస్ జగన్మో హన్‌రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎప్పుడు ఏర్పాటవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ రెండు పార్టీల విధానాలతో ఆంధ్రా ప్రజలు విసిగిపోయారు. బడుగు, బలహీనవర్గాలతోపాటు అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు, ఎంపీలు వ్యాపారవేత్తలు కావడం వల్ల పార్లమెంట్లో తమ ప్రజల వాణిని వినిపించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. కానీ, తెలంగాణలో ఈ పరిస్థితే లేదు. దీనికి సజీవ సాక్ష్యం తెలంగాణ ఉద్యమమే. తెలంగాణ ఎంపీలందరూ ఉద్యమించి తమ చిరకాల వాంఛ అయిన ప్రత్యేక తెలంగాణను సాకారం చేసుకున్నారు.
తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్‌ను నెంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. కానీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ‘మీ రాజధాని పేరేంటి?’ అనడిగితే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. చేతగాక చేతులెత్తేసిన నాయకుడు చంద్రబాబు. మూడు రాజధానుల పేర ప్రజలను మభ్యపెట్టిన నాయకుడు వైఎస్ జగన్మో హన్‌రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎప్పుడు ఏర్పాటవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ రెండు పార్టీల విధానాలతో ఆంధ్రా ప్రజలు విసిగిపోయారు.
వ్యాపారవేత్తలైన ఆంధ్రా ఎంపీలు రాష్ర్టానికి ప్రత్యేక హోదా సాధిస్తారనే నమ్మకం ఆంధ్రులకు లేదు. జగన్మోహన్రెడ్డి సీబీఐ కేసులకు, చంద్రబాబు ప్రధాని నరేంద్రమోదీకి భయపడి ఆంధ్రా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారు. మోదీకి బానిసలుగా మారిన ఈ నాయకులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధిస్తుందనే నమ్మకం ప్రజలకు ఏ మాత్రం లేదు. ఈ పరిస్థితుల్లో దేశం ముందుకు కేసీఆర్ లాంటి ఒక నాయకుడు రావడంతో వారిలో మళ్లీ ఆశలు చిగురించాయి. ఆయన ద్వారానే దేశాన్ని రక్షించుకోగలమన్న నమ్మకం ప్రజల్లో క్రమంగా పెరుగుతున్నది.
తెగువ, పట్టుదల ఉన్న ఆంధ్రా ప్రజలు ఈ రోజు అభివృద్ధికి దూరంగా ఉండటం, అవమానాలకు దగ్గరగా ఉండటం అత్యంత బాధాకరం. ఈ నేప థ్యంలో, ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలు కేవలం కేసీఆర్ వల్లనే నెరవేరుతాయన్న విశ్వాసం వ్యక్తమ వుతున్నది. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆంధ్రా ప్రజలు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో, తెలంగాణ ప్రజలతో సమానంగా అన్నిరకాల హక్కులు అనుభవిస్తున్నారు. రేపు బీఆర్ఎస్ పాల న వచ్చినా అన్నివర్గాల ప్రజలు కేసీఆర్ పాలనలో స్వేచ్ఛగా బతుకగలరనే నమ్మకం జనంలో ఉన్నది. అతి తక్కువ సమయంలో కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టును పూర్తి చేసిన కేసీఆర్ రేపు ఆంధ్రాలోనూ రాజధానిని నిర్మించగలరన్న నమ్మకం ప్రజల్లో ఉన్నది. రానున్న రోజుల్లో దేశ ప్రజలు కేసీఆర్ వెంట నడుస్తారనడంలో సందేహం లేదు. నవీన భారత నిర్మాణం బీఆర్ఎస్తోనే సాధ్యం.
(వ్యాసకర్త: రాయపాటి జగదీశ్ 93978 83638, రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ విద్యార్థి జేఏసీ)