సిమ్లా: శీతాకాలంలో మంచు కురవడం సాధారణమే. కానీ ఇప్పుడు శీతాకాలం ముగిసిపోయింది. హిమాలయాలను అనుకుని ఉన్న రాష్ట్రాల్లో అయితే వేసవి ప్రారంభంలో కూడా కొంతవరకు మంచు కురుస్తుంది. కానీ ఇప్పుడు వేసవి ప్రారంభం కూడా కాదు. నిండు వేసవి. దక్షిణాదిలోనైతే ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఓ గ్రామంపై విపరీతంగా మంచు కురిసింది. లాహౌల్ స్పితి జిల్లాలోని జబ్లింగ్ గ్రామంపై మంచు తెల్ల దుప్పటిలా కప్పేసింది. దాంతో గ్రామస్తులు ఇంటి నుంచి బయట అడుగుపెడితే చాలు చలికి గడ్డకట్టుకుపోయే పరిస్థితి ఉంది. గ్రామంపై దట్టంగా మంచు కప్పేసిన దృశ్యాలను ఈ కింది చిత్రాల్లో మీరు కూడా వీక్షించవచ్చు.
Himachal Pradesh: Jubling village of Lahaul-Spiti district
— ANI (@ANI) April 7, 2021
covered in a blanket of snow. pic.twitter.com/EPdv6hqjdT
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
టీకాతో బ్లడ్ క్లాటింగ్.. 30 మందిలో ఏడుగురు మృతి
భూమి వైపు దూసుకొస్తున్న మరో ఉల్క
నేడు ప్రధాని ‘పరీక్షా పే చర్చ’
ఏనుగు పిల్లను భుజాలపై మోసుకెళ్లిన ఫారెస్ట్ గార్డ్.. వీడియో వైరల్