e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home News బిల్ గేట్స్‌, వారెన్ బ‌ఫెట్‌, ర‌త‌న్ టాటా.. అప‌ర కుబేరులు చేసిన ఫ‌స్ట్ జాబ్ ఏంటో తెలుసా?

బిల్ గేట్స్‌, వారెన్ బ‌ఫెట్‌, ర‌త‌న్ టాటా.. అప‌ర కుబేరులు చేసిన ఫ‌స్ట్ జాబ్ ఏంటో తెలుసా?

first jobs of billionaires | ప్ర‌పంచంలోనే అప‌ర కుబేరులు ! ఫోర్బ్స్ ధ‌న‌వంతుల జాబితాలో టాప్‌లో ఉండే సంప‌న్నులు! పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ కోట్లు గ‌డించిన పారిశ్రామిక‌వేత్త‌లు ! బిల్ గేట్స్‌, వారెన్ బ‌ఫెట్‌, ఎల‌న్ మ‌స్క్‌, ర‌త‌న్ టాటా వంటి బిలియ‌నీర్ల గురించి చెప్పిన‌ప్పుడు వినిపించే మాట‌లివి. ఇప్పుడు వాళ్ల సంపాద‌న కోట్ల‌ల్లో ఉంటుంది. కానీ వాళ్లు ఈ స్థాయికి ఎద‌గ‌డానికి ముందు.. తొలిసారిగా వాళ్లు ఏం జాబ్ చేశార‌నే విష‌యం తెలుసా !

first jobs of billionaires |  jeff bezos
jeff bezos

అమెజాన్ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు జెఫ్ బెజోస్‌

ప్ర‌పంచ కుబేరుల జాబితాలో అగ్ర‌స్థానంలో ఉండే జెఫ్ బెజోస్‌.. ఈ స్థాయికి చేరుకోవ‌డానికి ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు. త‌న ప‌ద‌హారేండ్ల వ‌య‌సులో తొలిసారిగా మెక్ డొనాల్డ్స్‌లో ఫ్రై కుక్‌గా ప‌నిచేశాడు. ఒక‌వైపు చ‌దువుకుంటూనే.. పార్ట్‌టైంగా మెక్ డొనాల్డ్స్‌లో ప‌నిచేశాడు. అప్పుడు ఆయ‌న‌కు గంట‌కు 2.69 డాల‌ర్లు వ‌చ్చేవి. చ‌దువు పూర్త‌యిన త‌ర్వాత టెలీకమ్యూనికేష‌న్ స్టార్ట‌ప్‌.. ఫిటెల్ సంస్థ‌లో తొలిసారిగా ఫుల్‌టైం ఎంప్లాయిగా జాయిన్ అయ్యాడు. ఆ త‌ర్వాత 1994లో అమెజాన్ సంస్థ‌ను ప్రారంభించాడు.

first jobs of billionaires | warren buffett
warren buffett

వారెన్ బ‌ఫెట్‌

- Advertisement -

ప‌ద్నాలుగేండ్ల వ‌య‌సులోనే ఇన్‌క‌మ్ ట్యాక్స్ క‌ట్టిన బిజినెస్‌మ్యాన్ వారెన్ బ‌ఫెట్‌. త‌న ఏడేండ్ల వ‌య‌సులో వ‌న్ థౌజండ్ వేస్ టు మేక్ థౌజండ్ డాల‌ర్స్ అనే బుక్ చ‌దివిన వారెన్ బ‌ఫెట్ డ‌బ్బు సంపాద‌న‌పై ఇష్టాన్ని పెంచుకున్నాడు. ఆ ఆస‌క్తితోనే ర‌క‌ర‌కాల ప‌నులు చేయ‌డం మొద‌లుపెట్టాడు. పేప‌ర్ బాయ్‌గా ప‌నిచేయ‌డం మొద‌లు కోకా కోలా బాటిల్స్‌, చూయింగ్ గ‌మ్ అమ్మ‌డం వ‌ర‌కు అన్ని ప‌నులు చేశాడు. 1944 సమయంలో వాషింగ్టన్‌పోస్ట్‌ పత్రిక డెలివరీ బాయ్‌గా నెలకు 175 డాలర్ల వేతనానికి పనిచేశారు. ఆ త‌ర్వాత స్టాక్ ఎక్స్ఛేంజిపై ఆస‌క్తి పెంచుకుని వాటిల్లో ఇన్వెస్ట్ చేశాడు. వాటితో అప‌ర కుబేరుడిగా ఎదిగాడు.

first jobs of billionaires | bill gates
Bill gates

బిల్‌గేట్స్

హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో చ‌దువు మ‌ధ్య‌లోనే ఆపేసిన బిల్‌గేట్స్‌.. టెక్నాల‌జీ రంగంపై త‌న‌కు ఉన్న ఆస‌క్తితో అటువైపుగా అడుగులు వేశారు. తొలిసారి టీఆర్‌డ‌బ్ల్యూ సంస్థ‌లో కంప్యూట‌ర్ ప్రోగ్రామ‌ర్‌గా ప‌నిచేశాడు. ఆ త‌ర్వాత త‌న స్కూల్ ఫ్రెండ్ పాల్ అలెన్‌తో క‌లిసి 1975లో మైక్రోసాఫ్ట్ సంస్థ‌ను స్థాపించాడు.

first jobs of billionaires | elon musk
elon musk

ఎల‌న్ మ‌స్క్‌

టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థ‌ల అధినేత ఎల‌న్ మ‌స్క్ కూడా సొంత‌గానే ఎదిగాడు. చిన్న‌త‌నం నుంచి అంత‌రిక్షంపై ఆస‌క్తి ఎక్కువ‌గా ఉన్న మ‌స్క్‌.. త‌న 12వ ఏటా స్పేస్ థీమ్‌డ్ వీడియో గేమ్ బ్లాస్ట‌ర్‌కు కోడింగ్ చేశాడు. దాన్ని పీసీ అండ్ ఆఫీస్ టెక్నాల‌జీ అనే మ్యాగ‌జైన్‌కు ఇచ్చేశాడు. ఇందుకుగానూ ఎల‌న్ మ‌స్క్‌కు 500 డాల‌ర్ల పారితోషికం ల‌భించింది. ఆ త‌ర్వాత నెట్‌స్కేప్ సంస్థ‌లో ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నించాడు. అందులో జాబ్ కోసం ఎంత ప్ర‌య‌త్నించినా వాళ్ల నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదు. దీంతో కింబ‌ల్‌, గ్రెగ్ కౌరీతో క‌లిసి 1995లో జిప్ 2 అనే సాఫ్ట్‌వేర్ కంపెనీని స్థాపించాడు. అప్ప‌ట్నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎక్స్‌.కామ్‌, పేపాల్‌, స్పేస్ ఎక్స్ సంస్థ‌ల‌ను ప్రారంభించాడు. ఆ త‌ర్వాత టెస్లా మోటార్స్‌లో పెట్టుబ‌డులు పెట్టిన మ‌స్క్‌.. కొంత‌కాలానికి ఆ సంస్థ‌ను ద‌క్కించుకున్నాడు.

first jobs of billionaires | mark zuckerberg
mark zuckerberg

మార్క్‌ జూకర్‌బర్గ్‌

ఫేస్‌బుక్ వ్య‌వ‌స్థాప‌కుడు మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్‌కి చిన్న‌త‌నం నుంచే ఇంట‌ర్నెట్‌, టెక్నాల‌జీపై ఆస‌క్తి ఎక్కువ. 18 ఏండ్ల వ‌య‌సులోనే జుక‌ర్‌బ‌ర్గ్‌ సినాస్సీ అనే మ్యూజిక్ రిక‌మండేష‌న్ యాప్ రూపొందించాడు. ఈ యాప్‌ను కొనుగోలు చేసేందుకు అప్ప‌ట్లో 1 మిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కు ఆఫ‌ర్ కూడా చేశాయి. కానీ దాన్ని అమ్మేందుకు జుక‌ర్‌బ‌ర్గ్ నిరాక‌రించాడు. ఆ త‌ర్వాత కాలేజీలో ఉన్న స‌మ‌యంలోనే త‌న స్నేహితుల‌తో క‌లిసి 2004లో ఫేస్‌బుక్‌ను ఆవిష్క‌రించాడు. ఈ ఫేస్‌బుక్ ఎంత పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు.

first jobs of billionaires | ratan tata
ratan tata

రతన్‌ టాటా

టాటా గ్రూప్ మాజీ ఛైర్మ‌న్ ర‌త‌న్ టాటా పుట్టుక‌తో సంప‌న్నుడే. అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి వార‌సుడు. కానీ ఆ సంస్థ ఛైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు తీసుకోవ‌డానికి ముందు.. క‌ష్ట‌న‌ష్టాలు తెలుసుకోవాల‌ని అనుకున్నాడు. ఇందుకోసం 1961లో టాటా స్టీల్స్‌లో ఆప‌రేష‌న్స్ మేనేజ‌ర్‌గా ఉద్యోగంలో చేరాడు. 1991లో టాటా గ్రూప్ చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించాడు.

first jobs of billionaires | gautam adani
gautam adani

గౌతమ్‌ అదానీ

భార‌తీయ సంప‌న్న కుటుంబాల్లో అదానీ ఫ్యామిలీ ఒక‌టి. ఈ ఫ్యామిలీకి చెందిన అదానీ గ్రూప్ వ్య‌వస్థాప‌కుడు గౌత‌మ్ అదానీ కూడా త‌న సొంత కాళ్ల‌పై ఎదిగాడు. గౌత‌మ్ అదానీ తండ్రి ఒక వ్యాపారి. గుజ‌రాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆయ‌న‌కు టెక్ట్స్‌టైల్ కంపెనీ ఉన్న‌ప్ప‌టికీ.. దానిపై ఆధార‌ప‌డ‌లేదు. సొంతంగా గుర్తింపు తెచ్చుకునేందుకు డిగ్రీ చ‌దువు మ‌ధ్య‌లో ఆపేసి ముంబై వెళ్లాడు.1978లో వ‌జ్రాల వ్యాపారులైన మ‌హేంద్ర బ్ర‌ద‌ర్స్ డైమండ్ స్టార‌ర్‌గా పనిలో చేరాడు. ఆ త‌ర్వాత ఎన్నో వ్యాపారాలు చేశాడు. అలా 1988లో అదానీ గ్రూప్ స్థాపించాడు.

first jobs of billionaires | anand mahindra
anand mahindra

ఆనంద్ మ‌హీంద్రా

మ‌హీంద్రా గ్రూప్ చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్రా కూడా ధ‌న‌వంతుల కుటుంబంలోనే జ‌న్మించాడు. ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త జ‌గ‌దీశ్ చంద్ర మ‌హీంద్రా మ‌నుమ‌డు ఈయ‌న‌. అయిన‌ప్ప‌టికీ ఆనంద్ మ‌హీంద్రా తొలిసారిగా 1981లో మ‌హీంద్రా ఉజిన్ స్టీల్స్ కంపెనీలో ఫైనాన్స్ డైరెక్ట‌ర్‌కు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా ప‌నిచేశాడు. ఇప్పుడు మ‌హీంద్రా గ్రూప్‌లో ఎన్నో వ్యాపారాల‌ను న‌డిపిస్తున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

బ్యాంకాక్ అసలు పేరు ఏంటంటే.. ఆ పేరు మ‌న శ్లోకాల కంటే పొడ‌వైనది

కార్పొరేట్ కొలువులు.. ల‌గ్జ‌రీ లైఫ్ వ‌దిలేసి అడ‌విలో కాపురం

Pet Passport : శున‌కాల‌కూ పాస్‌పోర్టు ఉంటుంద‌ని తెలుసా !

కూలి ప‌నులు మాని యూట్యూబ్‌లో ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు..

పేద‌ల‌కు అండ‌గా.. ఒక్క‌డే 100 ఇండ్లు క‌ట్టించి ఇచ్చాడు

first jobs of billionaires | బిల్ గేట్స్‌, వారెన్ బ‌ఫెట్‌, ర‌త‌న్ టాటా.. అప‌ర కుబేరులు చేసిన ఫ‌స్ట్ జాబ్ ఏంటో తెలుసా?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement