BRS Denmark | బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
శాసన సభ, శాసన మండలిలో పార్టీ పక్ష బలోపేతం కోసం తీసుకున్ననిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ డెన్మార్క్ శాఖ ప్రెసిడెంట్ ఆకుల శ్యామ్ అన్నారు.
కేసీఆర్ శాసన సభలో బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా తన్నీరు హరీశ్ రావు, పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలను, పార్టీ విప్‌గా దేశపతి శ్రీనివాస్‌ను నియమించడాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని బీఆర్ఎస్ డెన్మార్క్ శాఖ ప్రెసిడెంట్ శ్యామ్ ఆకుల అన్నారు.
పార్టీపై, ప్రజలపై అపారమైన అనుభవం, నిబద్ధత కలిగిన నాయకులుగా వీరందరూ సభలలో బీఆర్ఎస్ గొంతుకను మరింత బలంగా వినిపిస్తారని, తెలంగాణ ప్రజల హక్కుల కోసం అంచలంచెలుగా పోరాడుతారని నమ్ముతున్నాము. ఈ నియామకాలు బీఆర్ఎస్ పార్టీకి మరింత బలాన్నిచ్చి, రానున్న రోజుల్లో ప్రజల పక్షాన పోరాటాలకు దిశానిర్దేశం చేస్తాయని ఆకాంక్షిస్తున్నామన్నారు.
నూతన బాధ్యతలు స్వీకరించిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. విజయవంతమైన కార్యాచరణకు మా సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని హామీ నిచ్చారు.
Warangal | రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
Farmer died | వరినాట్లు వేసేందుకు వెళ్తూ.. పొలంలో పడి రైతు మృతి