Ireland | శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, ఆర్తజన బాంధవి, ఆశ్రీతకల్పవల్లి, లలితా పరాభట్టారిక స్వరూపిణి అయిన శ్రీ శ్రీ శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి అగ్నిప్రవేశ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మాఘ శుద్ధ విదియ రోజు 100 మందికి పైగా వాసవీ మాత భక్తులు, కార్యక్రమ నిర్వాహక సభ్యులందరు కలిసి స్థానిక VHCCI ఆలయానికి చేరుకొని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి హోమం, విశేష అభిషేకం నిర్వహించారు. తర్వాత అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి అమ్మవారి పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం అమ్మవారికి షోడశోపచార పూజలు, అష్టోత్తరం, లలిత సహస్రనామ పఠనం, సామూహిక కుంకుమార్చన, మహా మంగళహారతి నిర్వహించారు.
అనంతరం కార్యక్రమానికి హాజరైన భక్తులందరికీ కార్యక్రమ స్పాన్సర్స్ అయినటువంటి ఆంధ్రాభవన్, ఇండియన్ వైబ్, తాలి రెస్టారెంట్, రుచి రెస్టారెంట్స్ నుండి రుచికరమైన నోరూరించే వంటకాలతో అందరికీ భోజనాలను వడ్డించారు.
కార్యక్రమానికి ముఖ్య ఉభయదారులుగా దాతలు శ్రీనివాస్ వెచ్చ, శిరీష, సంతోశ్ కుమార్ పారేపల్లి, శ్రీనివాస్ సూడా, శృతి ముత్తుకుమార్, బాలాజీ జ్యోత్స్న, రేణుక దినేశ్, నితేశ్ గుప్తా, రఘు వల్లంకొండ, ప్రవీణ్ మదిరే, వెంకట్ జూలూరి లకు కార్యక్రమ నిర్వాహక సభ్యులు, కార్యక్రమ పురోహితులు సాయి ప్రజ్వల్ ద్వారా సత్కరించి అందరికి పేరు పేరునా కృతఙ్ఞతలు తెలియజేశారు. అనంతరం అమ్మవారి అలంకరణ, పుష్పాలంకరణ సేవకు కృషిచేసిన సభ్యుల్లో కావ్య , దివ్య , లావణ్య, రేణుక, శిరీష తదితరులకు కార్యక్రమ నిర్వాహక సభ్యులు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేశారు.
ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మరెన్నో జరగాలని నిర్వాహక సభ్యులు నవీన్ సంతోశ్, నరేంద్ర, భార్గవ్, శ్రీనివాస్ వెచ్చ , మాణిక్ కోరుకున్నారు. చివరిగా ఆలయ సభ్యులైన రమణ, సాగర్ తదితరులకు సభ్యులందరూ కృతఙ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో నిర్వాహక సభ్యులతో పాటుగా సేవాదళ్ సభ్యులైన సంతోశ్, సాయి తేజ, సందీప్, ప్రఫుల్ల, సుధీర్, సంపత్ కీలక పాత్ర పోషించారు.
Ireland3