బీఆర్ఎస్ విజయం తథ్యం.. బీ(టీ)ఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ శాఖ
TRS NRI Kuwait | టీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితిగా అవతరించడం పట్ల బీ(టీ)ఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ శాఖ హర్షం వ్యక్తం చేసింది. 2001లో టీఆర్ఎస్ను స్థాపించిన ఉద్యమనేత కేసీఆర్.. అలుపెరుగని పోరాటంతో
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితిగా అవతరించడం పట్ల బీ(టీ)ఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ శాఖ హర్షం వ్యక్తం చేసింది. 2001లో టీఆర్ఎస్ను స్థాపించిన ఉద్యమనేత కేసీఆర్.. అలుపెరుగని పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని టీఆర్ఎస్ కువైట్ శాఖ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల అన్నారు. ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన అభివృద్ధి, పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలతో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిచేలా సీఎం కేసీఆర్ చేశారని వెల్లడించారు.
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు దృష్ట్యా పక్కా విజన్, గట్టి పట్టుదల, దృఢ సంకల్పం ఉన్న కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి చేసినట్లుగానే భారత్ను కూడా ప్రపంచంలోనే తిరుగులేని దేశంగా తీర్చిదిద్దుతారాన్న విశ్వాసం ఉందని ధీమా వ్యక్తంచేశారు. విజయ దశమి రోజున బీఆర్ఎస్ను ప్రారంభించారు కాబట్టి విజయం తథ్యమని, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ కమిటీ తరపున తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

