ఆస్ట్రేలియా రాజధాని నగరమైన కాన్బెర్రాలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని, జాతీయా పార్టీని స్వాగతిస్తున్నామని, రాబోయే రోజుల్లో కేసీఆర్ దిశానిర్దేశం ప్రకారం నూతన జాతీయ పార్టీకి సేవలందింస్తామని, ఏసీటీ కన్వీనర్ రవి సాయల పిలుపునిచ్చారు.
కేసీఆర్ ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీకి కూడా సేవలందించి, వారి వెంటే నడవాలని ఆయన అన్నారు. దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని, నేడు ప్రతీ రాష్ట్రం తెలంగాణ మోడల్ని కోరుకుంటోందని, కేసీఆర్ నాయకత్వం వల్లే అది సాధ్యమని నమ్ముతున్నారని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి చెప్పారు.
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చే సత్తా కేసీఆర్కు మాత్రమే ఉందని, మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ఆస్ట్రేలియా నుండి టీం ప్రత్యేక కార్యాచరణతో వస్తుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఝాన్సి, రాకేష్ లక్కరసు, వీరేందర్, అనిత ఉగ్గం, రమేష్, సుషుత్, శ్రీనివాస్, రుద్ర తదితరుల సభ్యులు పాల్గొన్నారు.